Earn money in stock market స్టాక్ మార్కెట్ లో డబ్బు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతుంది. అంటే ఒకరి లాభం,
మరొకరికి నష్టం. బ్రోకరేజ్
ఛార్జీలు, జి.ఎస్.టి. తదితర
చార్జీలు పోగా, లాభం గడించడం అందరికీ
సులభ సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే వారికి 'మనీ మేనేజ్మెంట్' బాగా తెలియాలి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి,
ఎక్కడ ఎగ్జిట్ కావాలి,
స్టాప్‌లాస్, టార్గెట్ తెలిసి వుండాలి.
స్టాక్ మార్కెట్ లో ఎవరైనా సరే తన స్థాయికి తగినట్లు స్వంత డబ్బుతో దిగాలి. ఎట్టి
పరిస్థితిలోనూ అప్పు తెచ్చి పెట్టకూడదు. మార్కెట్ అనేది జూదం కాకపోయినా, రిస్క్ తో కూడుకున్నది.
స్టాక్ మార్కెట్ లో మదుపు చేసేవారు రెండు రకాలుగా ఉన్నారు. ఒకరు ట్రేడర్,
మరొకరు ఇన్వెస్టర్. తక్కువ
కాలంలో లాభనష్టాలు చూసుకునేవారు ట్రేడర్. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టి లాభనష్టాలు స్వీకరించేవారు ఇన్వెస్టర్. తామేమీ కావాలనుకుంటున్నామో
(ట్రేడర్ లేక ఇన్వెస్టర్) అనేది ఎవరికీ వారు స్వతహాగా నిర్ణయించుకోవాలి. పెట్టుబడి
పెట్టేవారు ఫండమెంటల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిస్
తెలిసి ఉంటే మంచిది.
మార్కెట్ లో స్టాక్ ధర హెచ్చుతగ్గులు, ఆశ, భయంపైనే ఆధారపడతాయి. పెట్టుబడిదారులు మినిమమ్ లాస్, మ్యాగ్జిమమ్ ప్రాఫిట్ సూత్రాన్ని పాటించాలి. అంటే
తక్కువ నష్టంతో వేగంగా బయటపడటం, ఎక్కువ లాభాన్ని తీసుకోవడానికి
వేచి ఉండే సూత్రం. స్టాక్ మార్కెట్ పైనే పూర్తిగా
ఆధారపడి ఉండం అంత మంచిది కాదు. మదుపరులు ఏదైనా పనిచేసుకుంటూ సైడ్ బిజినెస్‌లా స్టాక్
మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి.
ఒకదేశ ఆర్థిక పరిస్థితిని చాటేది ఆ దేశ స్టాక్ మార్కెట్ లే! ఏ పెట్టుబడిలోనైనా
రిస్క్ అంతో ఇంతో ఉంటుంది. మీరు ఎంతమేరకు రిస్క్ తీసుకోగలరో చూసుకోవాలి. మనకు వచ్చే
ఆదాయం రెండు రకాలు.
ఒకి నిష్క్రియ ఆదాయం (పాసివ్ ఇన్‌కమ్) అంటే బ్యాంకు వడ్డీలు, ఇంటి అద్దెలు. మనం పనిచేయకపోయినా అవి ఆదాయాన్ని ఇస్తాయి. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు
వచ్చే ఆదాయాన్ని క్రియాత్మక ఆదాయం (లినియర్ ఇన్‌కమ్) అంటారు. దీనికి ఉదాహరణ ట్రేడింగ్
అని చెప్పవచ్చు. ఇవికాక లీవరేజ్ ఇన్‌కమ్ అని కూడా వేరే మార్గాలున్నాయి. అవి ఫ్యూచర్
& ఆప్షన్స్ ద్వారా
వస్తుంది. కొంత కష్టపడితే లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని విండ్‌ఫాల్ (గాలివాటం) ఆదాయం అంటారు.
స్టాక్ మార్కెట్ ఎంతగా డబ్బు సంపాదించవచ్చో, అంతే స్థాయిలో పోగొట్టుకొనే ఛాన్స్ ఉంది. స్టాక్
మార్కెట్ కొన్ని రోజులు అప్‌ట్రెండ్,
మరికొన్ని రోజులు డౌన్ ట్రెండ్,
ఇంకా కొన్ని రోజులు రేంజ్
బౌండ్‌లో ట్రేడవుతుంటుంది. ఇందులో విజయం సాధించాలంటే నాలెడ్జ్, ఇన్వెస్ట్‌మెంట్, స్కిల్, పేషన్స్ అనేవి చాలా ముఖ్యం.
ముందుగా మీ ఆదాయంపై రాబడి (రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్)ను మీరు రోజువారీగా నోట్స్
రాసుకోవాలి. రిస్క్ రివార్డ్ సూత్రం కూడా పాటించాలి. ఏమీ తెలియకుండా స్టాక్ మార్కెట్
లోకి వస్తే... ఆరిపోవడం ఖాయం.
కొత్తగా ఇందులోకి వచ్చేవారు స్టాక్ మార్కెట్ పదజాలం కూడా తెలిసి ఉండాలి. ఇది ఒక మహాసముద్రం. ప్రవేశం
సులభమే, కానీ లాభాలు గడించడం
అంత సులభం కాదు. ఇందులోకి వచ్చేవారు కనీస మూలధనం మొత్తంతో వస్తేనే ఏమైనా సాధించవచ్చు.
ఇందులో వచ్చేవారికి పైన చెప్పినట్లు పెట్టుబడి, తెలివి, సహనం, నైపుణ్యం చాలా అవసరం.... సో... బెస్ట్ ఆఫ్ లాక్! - అశోక్