ప్రపంచం నేడు కరోనాతో పోరాడుతుంది. ప్రజలు తమ జీవితాలను రక్షించుకోడానికి బాహ్య సమాజం నుండి దూరమై డిజిటల్ రంగానికి దగ్గరవుతున్నారు. నిజం! మీరు చదువుతున్నది వాస్తవం. ప్రపంచం నేడు క్రమ క్రమంగా డిజిటలైజ్ అవుతుంది. ఒక్క క్లిక్ తో విశ్వవ్యాప్త సమాచారం మన ముందుకు వస్తుంది.
ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. ఇందులో ఎందరో మేధావులు రాత్రి-పగలు కష్టపడి పనిచేస్తున్నారు. నేడు చట్ట సభలలోని నాయకుల ప్రసంగాల నుండి, వేల సంవత్సరాల పురాతన గ్రంథాలు కూడా డిజిటలైజ్ చేయబడుతున్నాయి.
అయితే.... అన్ని రంగాలు డిజిటలైజ్ కావడంతో మరి ఉద్యోగాలు అంటారా? ఈ డిజిటలైజ్ రంగంలో కూడా వేల ఉద్యోగాలు నిరుద్యోగుల పాలిట వరంగా మారాయి. ఇప్పుడు మార్కెటింగ్, ప్రభుత్వ పాలనాపరమైన సేవలు అన్ని డిజిటలైజ్ కావడంతో ప్రజలు కూడా వీటితో దోస్తి చేయక తప్పడం లేదు.
Bagundi
ReplyDeleteNice
ReplyDelete