Sunday, December 13, 2020

నలమల టూర్‌ Nalamala tour

అందరికీ తెలిసి, కొందరికి తెలియని విషయం ఏమిటంటే.... ఇది పెళ్ళిళ్ళ సీజన్‌. రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. వృత్తి రీత్యా నేను వెడ్డింగ్‌ కార్డు డిజైనర్‌ కాబట్టి సీజన్లో ఎడతెరిపి లేకుండా వర్క్‌ నడుస్తుంది. పని వత్తిడి వల్ల మానసికంగా కాస్త విశ్రాంతి కావాలనే కోరిక ఎక్కడో మూల పుట్టింది. 

ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్‌ కూడా నేనే చేయాల్సి వచ్చింది.  అయితే,  ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్‌ సాబ్‌, ఇర్షాద్‌, ఘోరి ఖాన్‌ ని కూడా వెంట తీసుకెళ్ళాను. 

నలుగురం 3 రోజుల టూర్‌ను సెట్‌ చేసుకొని డిసెంబర్‌ 9,10,11 లలో అక్కడ చూడవలసిన ప్రదేశాలను, నలమల అడవి అందాలను ఆస్వాదించవచ్చునని ఆశతో ఎంతో ఉల్లాసంగా, హాయిగా ఈ మూడు రోజులు మా పనులను పక్కనబెట్టి మా ఊహాలలో తెలిపోయాము.


ఆ మూడు రోజుల ఫోటోలను మీతో షేర్‌ చేసుకుంటున్నాను. మీరూ చూడండి. ఆఁ... గతంలో కంభం  చెరువు గురించి మీకు తెలియజేసానుకుంటా... ఆ అక్కడకు కూడా వెళ్ళాము. చూడండి. - కరీంఖాన్‌, హైదరాబాద్‌. 
English Translation:
Nalamala Tour What everyone knows, what some people don't know is that .... it's wedding season‌. Weddings are in full swing in the two Telugu states. Professionally I am a wedding card designer so the season runs the workshop without a hitch.

కంభం cheruvu
The urge to relax mentally due to work pressure has taken root somewhere. At this point my niece got married. I also had to do the card design myself.
కంభం చేరువు బోర్డు
However, with the desire to go to this wedding I went on doing their chores a bit faster that day. Our niece's wedding was in the town of Giddaluru in the Nallamala forest, so I took my well - wishers, friends Moin Saab, Irshad and Ghori Khan with me to the wedding.
The four of us set out on a 3 day tour and in December 9,10,11 we set aside our work for these three days in the hope that we could see the places to see and enjoy the beauty of the Nalamala forest.
I will share those three days photos with you.

See for yourself. Um ...
I just wanted to let you know about the Cumbum pond in the past ...
we went there too. See.

Thursday, December 3, 2020

బీదవాడిగా పుట్టడం తప్పుకాదు...It is not Mistake to be born poor ...

అక్వేరియంలో రకారకాల రంగుల చేపలు ఎంత ప్రశాంతంగా ఉల్లసంగా విహరిస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? మీ మనసును కూడా అలా ఉంచడానికి ప్రయత్నించండి.  ప్రతి వర్క్ఆరంభంతో సహా అంతం కూడా  ఉంటుంది. ఆరంభం ఎలా ఉన్నా- అంతం మాత్రం మంచిగా ఉండాలి. ఒక విజయంతో ముగియాలి. తమకు తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీలో ఏదైనా అంగవైకల్యం ఉందా లేదు కదా! అంగవైకల్యం ఉన్నవారే, ఎన్నో రంగాలలో తమ తమ నైపుణ్యం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకైతే ఏలాంటి  అంగవైకల్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. అయినా మీరు అభివృద్ధి చెందడం లేదంటే అది మీ స్వయం కృపరాధమే.

నా అదృష్టం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేను అనే భావన రాకూడదు. సకల అంగాలు మీలో సక్రమంగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ముందుకు సాగాలి. చేయల్సినదేదో చేసి చూపాలి. ప్రయత్నమే పురుష లక్షణ మంటారు. కానీ మహిళలు కూడా పురుషులను అధిగమిస్తున్నారు. గమనించండి. మీలో నిద్రిస్తున్న మనిషిని బయటకు లాగండి. తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. అన్ని మీలో ఉన్నాయి - మీరు సమర్ధులు. ఏదైనా చేయగల సత్తా ఉంది మీకు. అలాంటప్పుడు మీరు వెనుకంజ వేయడం సమంజసం కాదు.

 ఇదంతా రాస్తున్నది మానసిక వ్యక్తిత్వ వికాసానికే. మానసిక వ్యక్తిత్వ వికాసం వికసించిందనుకోండి - ఇక విజయం మీదే. ఎలాగైతే ఓ మొగ్గ వికసించి పుష్పంగా మారి సువాసన వెదజల్లుతుందో!  

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.                                                     - అజ్మత్‌ఖాన్‌, హైదరాబాద్‌

It is not wrong to be born poor ...

Have you ever noticed how calm and merry the colorful fish in the aquarium are? Try to keep your mind that way too. There will also be an end, including the beginning of each workshop. No matter the beginning- the end must be good. Should end with a victory. Do not underestimate themselves. 

Do you have any disabilities? People with disabilities continue to demonstrate their expertise in many fields. You have no disability. Are healthy. If you do not thrive, however, it is your own fault. This is my luck, I should not feel that I can do nothing anymore. When all the limbs are regular in you you should go ahead and thank God for that. Do what needs to be done and show it. Attempt is called masculinity. But women also outnumber men. Note. Pull out the sleeping man in you. Anything can be done if it comes to mind. Can show the world. All are in you - you are capable. You have the ability to do anything. In that case it does not make sense for you to lag behind. 

All this is written for the development of mental personality. As mental personality development flourishes - success is yours. However, a bud blossoms into a flower and the fragrance dissipates!

 

More Post's...