ఒకప్పుడు ఎవరినైనా చూసినట్లయితే ఆహా ఎంత స్మార్ట్ గా ఉన్నాడు అంటాము.. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇదివరకు ఈ స్మార్ట్ ఫోన్ కొంతమంది వరకే పరిమితమై ఉండేది అది కూడా ధనవంతుల్లో సెలబ్రిటీలలో మాత్రమే.
అయితే ప్రస్తుతం స్మార్ట్ టీవీల యుగం ప్రారంభమైంది. ఈ ప్రకటన చూసిన ఏ పత్రిక చూసినా స్మార్ట్ టీవీ ల ప్రకటనలే వస్తున్నాయి. వాట్ స్మార్ట్ ఫోన్ లో స్థానంలో ఎప్పుడు స్మార్ట్ టీవీలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి. ఇందులోనే బ్రౌజర్ గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ప్రతిదీ చూసుకోవడానికి ఈ స్మార్ట్ టీవీలు చాలా అవసరం. దీంతో డాటా స్మార్ట్ ఫోన్ లోకి లకు మాత్రమే కాకుండా టీవీ లో కూడా అవసరం అయ్యింది. ప్రతి ఇంట్లో నాలుగు ఫోన్లు ఒక స్మార్ట్ టీవీ దీంతో ఖర్చు పెరిగి చాటంత అవుతుంది.
ప్రస్తుత మహమ్మారి కరోనా వల్ల కాలేజీలు స్కూల్ ఆఫీసులు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇంటి వద్దనే అందరూ డాటా రూపములో డబ్బును ఖర్చు చేస్తున్నారు.
స్కూల్లో కాలేజీలు డిజిటల్ క్లాసులు అని పిల్లలతో స్మార్ట్ ఫోన్ లను స్మార్ట్ టీవీ లను చూసే విధంగా అలవాటు ప్రారంభించాయి. ఎప్పుడు టివి ముఖం చూడని వారు కూడా స్మార్ట్ టీవీలు తెచ్చి ఇంటిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక విధంగా డిజిటల్ మార్కెటింగ్ పెరిగిందనే చెప్పవచ్చు. సెల్యులార్ కంపెనీలు డాటాను పోటీపడి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
నేడు అత్యవసరం స్థానంలో స్మార్ట్ ఫోన్ స్మార్ట్ టీవీ సంపాదించాలి అని అనుకోవచ్చు. నువ్వు లేనిదే నేను లేను అని ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. రాబోయే డిజిటల్ యుగంలో వీటి తరువాత ఏది ఆక్రమిస్తోంది ఇక కాలమే చెప్పాలి.
Baga rasaru
ReplyDelete