Wednesday, October 14, 2020

ఆసియాలోనే పెద్ద చెరువు నిండింది Biggest Lake in Asia

మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము.

కంభం చెరువు (Cumbum Lake)


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి ఆనుకొనే ఉంది ఈ చెరువు. ఇది
15 శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని మహారాణి వరదరాజమ్మ గారు గుండ్లకమ్మ నది ఆనుకొనే ఈ చెరువు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇది ఆసియాలోనే పేరుగాంచిన పెద్ద చెరువులలో ఇది ఒకటి . దీని చుట్టూ సహజ సిద్ధమైన కొండలు ఉండడంతో ఒక ఆనకట్టతో దీని నిర్మాణం జరిగింది. అప్పట్లోనే ఈ చెరువు ఆనకట్ట ఎత్తు 57 అడుగులు. అందువల్ల ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా చెరువు నిండడానికి ఉపయోగపడుతుంది.

పిక్నిక్‌ స్పార్ట్ (Picnic Spot)

ఆసియాలోనే పెద్ద చెరువు కాబట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.  ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ చెరువు కు  కాస్త నీరు చేరుతుంది. అయితే ఈ సంవత్సరం  నిండుకుండలా నిండిపోవడంతో చూడడానికి సందర్శకులు వేల సంఖ్యలో వస్తున్నారు. అయితే ప్రభుత్వపరంగా ఎటువంటి వసతులు లేకపోయినప్పటికి సందర్శకులు తాకిడి ఎక్కువే. ఇక్కడికి చేరడానికి  సమీపంలో గుంటూరు-నంద్యాల రైల్వే లైన్‌లో  కంభం రైల్వేస్టేషన్‌, బస్‌ ద్వారా కూడా చేరుకోవచ్చు.

నిండుకుండలా మారిన కంభం చెరువు (Fulfill Cumbum Lake)

ఈ సంవత్సరం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కంభం చెరువు నేడు నిండుకుండలా మారింది. సందర్శకులు ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని చూడడానికి వేల సంఖ్యలో వస్తున్నారు.


ఈ చెరువు నిండడం అంటే... కంభం చుట్టుప్రక్కల మండలాల రైతులకు ఎంతో సంతోషకరమైన వార్త. మీకు వీలుంటే వీకెండ్ లో ఒకసారి వెళ్లి రావచ్చు. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.

6 comments:

More Post's...