Monday, September 28, 2020

చరిత్రను తిరగేయండి......!

మీలో ఏ లోపం ఉంది? మీరు కూడా విజృంభించండి, చెలరేగండి. విహారించండి. అది సాధ్యమైన పనే. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేసుకుాంరా? లేక థవర్ష ప్రణాళిక సిద్ధం చేసుకుాంరా? చేసుకోండి. ప్రణాళిక ఉంటే తప్పక  సఫలమవుతారు. ఇది ఆధునిక యుగం. సైన్స్‌ చాలా డెవలప్‌ అయినది. అసాధ్యమనేది సుసాధ్యమవుతున్న ఈ రోజుల్లో మీరు మానసిక ఆందోళనతో  కృంగిపోకూడదు. చింత మీకు చిదిమివేస్తుంటే, దైవచింత చేసుకోండి. చింతను మీరు చిదిమివేయవచ్చు. అనవసర అపోహల ఫోబియాలకు గురై కొందరు యవ్వనంలోనే మంచం బారినపడుతున్నారు. వాస్తవంగా చూస్తే వారికి ఏ రోగం ఉండదు. 
కొందరు యవ్వనంలోనే కొందరు నలభై యేళ్ళకే వారికి ఇచ్చే సూచన ఏమి? లేవండి ఆ మంచం పైనుంచి, మీ మనస్సు నుంచి తొలగించండి ఆ అనవసర ఫోబియాను. జనజీవన స్రవంతిలో సాగిపోండి. ఆత్మ క్షోభకు, ఆత్మ వంచనకు గురికావద్దు. మీ అంతరాత్మతో ఆ పరమాత్మను ధ్యానించండి. జీవించేది కొద్ది కాలం మాత్రమే. మళ్ళీ ఎందుకు ఈ ఫోబియాలు. అవి తొలగించుకోకుంటే, అనామకంగా అంతమవుతారు. జీవితం యొక్క విలువను తెలుసుకోండి. జీవితం అతివిలువైనది. వెల కట్టలేనిది. చేయదలుచుకుంటే చాలా ఉంది. ఆ పనులు పూర్తి చేయాలనుకుంటే ఈ జీవితం కాలం సరిపోదు. మితంగా భోజనం చేసి అమితంగా కృషి చేసినచో ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆర్థికం కూడా బాగుంటుంది. ఈ రెండు మీ ఆధీనంలోనే ఉంటే మీకు ఎదురుండదు. అనవసర జోక్యాలతో అనార్ధాలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ఎందుకు చేయాలి? ఆ అనవసర జోక్యాలు. అలాంటప్పుడు ఎందుకు మీదారి మీరు చూసుకుంటే- మీరు ఆత్మశాంతితో జీవించవచ్చు. ఆత్మను అలజడికి గురికానివ్వకూడదు. తీవ్ర అనర్ధాలకు గురై రోగాల బారినపడుతారు. 
అనవసర జోక్యాలతో ప్రపంచ యుద్ధాలే జరిగాయి. తీవ్ర ప్రాణ, ఆస్థి నష్టాలు జరిగాయనేది సంగతి గుర్తుంచుకో. రిలేషన్‌ షిప్‌ను మెయిన్‌టెన్‌ చేసుకుంటూ ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రయత్నించండి. సమాజంలో ముందుకు సాగాలంటే రిలేషన్‌ షిప్‌ మెయిన్‌టెన్‌ చాలా అవసరం. ఒంటెద్దు పోకడ పోకూడదు. నలుగురితో సలహా సంద్రింపులు జరగాలి. అది మీకే మంచిది. అహంకారం, అహంభావం తీవ్ర నష్టానికి దారితీస్తాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో గివ్‌ రెస్పెక్ట్‌ అండ్‌ టేక్‌ రెస్పెక్ట్‌ చాలా ముఖ్యమైనది. దేవుడు మిమ్మల్ని బానిసగా బతకమన్నాడా? కాదు!  కదా! మరి బానిస బ్రతుకులెందుకు? మళ్ళీ బానిస బ్రతుకులెందుకు? వ్యసనాలకు బానిస కావద్దు. దానిని బానిసగా మార్చాలి. కానీ మీరు దానికి బానిస కావద్దు. సంఘం గౌరవించదు. బ్రతుకు దుర్భరమవుతుంది. ఇంతకు ముందే విన్నవించాను. దేవుడు మీకు విజ్ఞత ఇచ్చాడు. జీవితాన్ని పున్నమి వెన్నెల్లా చేసుకుాంరా? లేక అమావాస్య చీకిలా చేసుకుాంరా? అది మీ ఆధీనంలోనే ఉంది. పరులపై నిందలు వద్దు. ఏది ఏమైనా మీ ఆలోచనలు పాజిీవ్‌ ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించవచ్చు. ధైర్యవంతులదే ఈ ప్రపంచం. 

No comments:

Post a Comment

More Post's...