Tuesday, July 26, 2022

పాపను కాపాడిన రియల్‌ హీరో

 పాపను కాపాడిన రియల్‌ హీరో

Real Heroes..

Real Heroes..




చైనా విదేశాంగ ప్రతినిధి లియాజ్‌ ఝావో ట్విట్టర్లో పంచుకున్న ఒక వీడియో నేడు హల్‌చల్‌ చేస్తుంది.  చైనాలోని టాంగ్‌షింగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుంచి రెండేళ్ళ పాప పడిపోవడం, అక్కడే రోడ్డుపైనుండి నడిచి వెళ్తున్న షెన్‌డాంగ్‌ అనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను క్యాచ్‌ చేసి పట్టుకున్నాడు. 

షెన్‌డాంగ్‌తోపాటు మరో మహిళ కూడా అతనికి సహాయం చేసేందుకు వచ్చినట్లు వీడియోలో ఉంది. అందుకే మన హీరోలు సినిమాలలోనే కాదు, మన మధ్యలో కూడా హీరోలు ఉన్నారని ఈ వీడియో బట్టి తెలుస్తోంది. ఈ వీడియో నేడు వైరల్‌గా మారి ఈ రియల్‌ హీరోలను పొగడ్తలతో ముంచుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోబట్టి అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది.

mydailyroutinkk1973.blogspot.com

Thursday, July 14, 2022

వర్షం వర్షం వర్షం

వర్షం వర్షం వర్షం














వర్షం వల్ల ఆకాశానికి పడిన చిల్లులు భూతలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి 

డ్యాములు చెరువులు, కుంటలు నిండి పారివాహక ప్రాంతాలను ఖాళీ చేస్తున్నాయి

కుండపోతగా కురుస్తున్న వర్షానికి రైలు పట్టాల వెంబడి ఉన్న బీదవారు గజ గజగలాడుతున్నారు

పేదల బస్తీలలో కూలుతున్న గోడలవల్ల నిరాధారులైన వారు దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు

రోజువారి కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు 

 హోరు వాన వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలకు జడిసి ప్రజలు మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు

 రైతులు వర్షం పడినా కష్టాలు సహిస్తుంటారు 
 వర్షాలు పడకపోయినా కష్టాలు సహిస్తుంటారు

 భారీ వర్షాలను పట్టించుకోకుండా ప్రవహిస్తున్న నీటిలో
 వాహనాలు నడిపి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు

 నిరాశ్రులైన వారు దారుల వెంట తడిసి ముద్దయి ప్రాణాపాయంలో ఉన్నారు 

 నగరాలు బస్తీలు పల్లెలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతున్నారు

 ఓ దేవుడా వర్షాన్ని మితంగా కురిపించి 
మాకు ప్రశాంతతను చేకూర్చు 

 *మొహమ్మద్ అబ్దుల్ రషీద్, హైదరాబాద్

Wednesday, July 6, 2022

కస్టమైజ్డ్‌ ఫర్నిచర్‌

 
Customized Furniture  

కస్టమైజ్డ్‌ ఫర్నిచర్‌

వర్క్‌ టు హోమ్‌..... ఈ పదం కరోనా కాలంలో చాలా విన్నాం కదా. ఇంట్లోనే ఆఫీసు వర్క్‌ చేయాల్సిన అవసరం అందరికీ వచ్చింది. మీరు తలుపులు మూసి ఉన్న గదిలో పనిచేసినా, వంటగదిలో సందులో, డైనింగ్‌ టేబుల్‌పైన పనిచేసినా, ఆఫీసు వర్క్‌ మన  జీవితంలో భాగమవుతున్నాయి. మన ఇళ్లకు మరియు జీవితాలకు అలంకారంగా సరిపోయే ఆఫీసు ఫర్నిచర్‌ ఉండాలి. ఇంటి నుండి మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన ఫర్నీచర్‌ ఉన్నప్పుడే వర్క్‌ టు హోమ్‌ సులువుగా మారుతుంది. 

 నాణ్యత గల మెటీరియల్‌

ఈ అవసరాలను గుర్తించే ఫర్నిచర్‌ కంపెనీలు మీ అవసరాలకు మరియు మీ స్థలానికి సరిగ్గా సరిపోయే ఫర్నీచర్‌ తయారు చేస్తారు. మీరు మీ హోమ్‌ ఆఫీస్‌ కోసం ఫర్నిచర్‌ను తయారు చేసుకోవచ్చు. మీరు అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌ల నుండి ప్రత్యేకమైన ఫర్నిచర్‌ను కలిగి ఉన్నప్పుడే మీ వర్క్‌ నైపుణ్యం ఆఫీసు లాంటి అనుభవంతో తీరుతుంది. నైపుణ్యం కలిగిన చెక్క పని చేసేవారి నెట్‌వర్క్‌ మీ ఆర్డర్‌ను త్వరగా పూర్తి చేయగలదు.


కస్టమైజ్డ్‌ ఫర్నిచర్‌

మీ వర్క్‌ టు హోమ్‌ ఆఫీస్‌ కోసం అనుకూలమైన ఫర్నిచర్‌ను ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి:- నాణ్యతలో పెట్టుబడి పెట్టడం అంటే... అందరికీ అవసరమైన కస్టమైజ్డ్‌ ఫర్నిచర్‌లను ఇప్పుడు అన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. కాబట్టి మీరు మీ హోమ్‌ ఆఫీస్‌ను చూసేది మీరు మాత్రమే అయినప్పటికీ, మీకు అవసరమైన చోట డ్రాయర్‌, డెస్క్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు మీకు ఉంది. మీ వర్క్‌స్పేస్‌కు ఆనందం మరియు పనితీరులో మెరుగు కోసం అనుకూలమైన రంగులను ఎంచుకుంటే ఇంకా మంచిది.

లోకల్ Funiture షాప్

మీ ఫర్నిచర్‌ను మీ పట్టణంలోనే కొనుగోలు చేసుకుంటే మీ దగ్గరకు చేరుకోవడానికి తక్కువ  సమయం మాత్రమే అవుతుంది. వర్క్‌ టు హోమ్‌ ఆఫీస్‌లో టాప్‌ డిజైన్‌ మరియు చెక్క పనిలో నైపుణ్యం కలిగి కళాకారులు ఉన్నారు. టేబుల్‌పైన  ఒకటి వైర్‌లెస్‌ ఛార్జర్‌ మరియు బిల్ట్‌-ఇన్‌ మినీ స్పీకర్‌లతో కూడిన వాల్‌నట్‌ సైడ్‌బోర్డ్‌. ఆఫీస్‌ స్పేస్‌ తక్కువ కోరుకునే వారు కుర్చీ లాగి, తలుపులు తెరిచి, పని మొదలెట్టవచ్చు. మీ ఫర్నిచర్‌తో పాటు మీ పనితనానీ మంచి అనుభూతిని పొందడం గురించి మరెన్నో వివరాల కొరకు మాకు వ్రాయండి. మరియు మా బ్లాగ్‌ సందర్శించండి.

mydailyroutinkk1973.blogspot.com

Tuesday, July 5, 2022

హెల్త్ అండ్ ఫిట్నెస్

ఫిట్నెస్ ఇన్ రైనే సీజన్లో 


హెల్త్ అండ్ ఫిట్నెస్  

రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌ అంటూ.... హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుండి చిరు జల్లులు పడుతున్నాయి. ఈ జల్లులలోనే అందరూ తమ ఆఫీసులకు, పనులకు, షాపులకు వెళ్తున్నారు. చిన్నపాటి జల్లులే కదా అని మనం తడుస్తూపోతే... మన ఆరోగ్యం కాస్త జబ్బులతో చుట్టుముడుచుకుంటుంది.  అందుకే రెయినీ సీజన్‌లో మన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి ఆహారం

వర్షాకాలంలో ఎక్కువగా మనం విటమిన్‌ 'సి' లభించే ఆహారం తీసుకోవాలి.   ఎందుకంటే చిన్నపాటి రోగాల నుండి విటమిన్‌-సి మనల్ని కాపాడుతుంది.

ఫిట్ అండ్ హెల్త్ ఫుడ్ 


నీరు

మనం త్రాగే నీరు కలుషితం లేనిదై ఉండాలి. అవసరమైతే వేడి చేసి, చల్లార్చి త్రాగితే మరీ మంచిది. 

సులువుగా జీర్ణమయ్యే ఆహారం

వర్షాకాలంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అందుకోసం మన  ఆహారంలో పెరుగు, మజ్జిగ, ఇంట్లో చేసే పచ్చళ్ళు ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమవ్వడానికి సహకరిస్తాయి.

బయటి చిరుతిళ్ళ నుండి దూరంగా ఉండాలి

బజార్లలో లభించే జంక్‌ఫుడ్‌ నుండి దూరంగా ఉండాలి. వీధులలో లభించే ఆహారం మంచిది కాదు. వీటిపై ఎన్నో మైక్రో క్రిములతో కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ. 

దోమల నుండి రక్షణ

వర్షాకాలంలో దోమలు  ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇంట్లో దోమతెరలు ఉంటే మంచిది. దోమ కాటు మనల్ని భయంకర రోగాలకు దారితీస్తాయి. 

మనం తొడిగే బట్టలు

మనం వర్షాకాలంలో బట్టలను ఐరన్‌ చేసి తొడిగితే మంచిది. అవి శరీరానికి వెచ్చదనాన్ని, క్రిమికీటాల నుండి రక్షణ ఇస్తాయి.

ఇంట్లోని ఏసి గదులకు దూరంగా ఉండాలి

ఇంట్లోని ఏసి గదులలో మన శరీరం, బట్టలు పొడిగా ఉన్నప్పుడే వెళ్ళాలి. లేకుంటే మన శరీరం ఇంకాస్త చల్లబడి జలుబు వంటి రోగాలబారిన పడే అవకాశం ఎక్కువ. 

అలాగే మన చేతి గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు ఉంటే వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన శరీరంలో ప్రవేశించడం సులువ. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బులున్నవారి నుండి  దూరంగా ఉండాలి. 

Friday, July 1, 2022

T-Hub 2.0 భారతదేశంలోనే బిగ్‌ స్టార్టప్‌

T-Hub 2.0 

భారతదేశంలోనే బిగ్‌ స్టార్టప్‌ T-Hub 2.0 తెలంగాణలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని మదాపూర్‌లో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో, మల్టీబుల్‌ వెసిలిటితో దీని నిర్మాణం జరిగింది.

 ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంప్‌ అనబడే టీ-హబ్‌-2ను తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో, మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.

 ఈ టి-హబ్‌లో ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్‌ల కార్యకలాపాలు నిర్వహించుకునే ఏర్పాటు కలదు. దీని ఆకారం శాండ్‌విచ్‌లా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

T-Hub 2.0

స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తెలంగాణ గవర్నమెంట్‌ మొదటిసారి 2015లో టీ-హబ్‌-1ను ప్రారంభించింది. అది మంచి ఫలితాలు అందించడంతో టీ-హబ్‌ 2.0 పేరుతో మరో స్టార్టప్‌ను నిర్మించింది.

 దేశంలోనే టీ-హబ్‌ 2 పేరు ఒక రోల్‌ మోడల్‌గా మారింది. ఈ టీ-హబ్‌ 2.0 రాకతో ప్రపంచంలోనే అగ్రశేణి స్టార్టప్‌ శ్రేణులలో తెలంగాణ రాష్ట్రం చేరింది.

More Post's...