Tuesday, June 30, 2020

క్యా బచ్చే ఆప్ కి బాత్ నహీఁ సున్తే ?

పిల్లల గురుంచి తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటున్న కాలం ఇది. అయితే పిల్లలు మన మాటలు వింటున్నారా?
చుడండి....ముఖ్యమైన వీడియో ఇస్లాం గురు ఛానల్ లోనిది. 

Monday, June 29, 2020

online క్లాసులు....పిల్లలు ?

ఎదో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు కదలే అని 24 గంటలు వారికి మొబైల్ ఫోన్ ఇచ్చివేయకండి. లేదంటే మీరే వారిని ఫోన్ కు బానిసగా మార్చి, వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నట్లే. ఏదైనా అతి ప్రమాదకరం. అది మన పిల్లల పట్ల మనకున్న నమ్మకమైనా సరే!


.........................
Translation English :

Do not give them a mobile phone for 24 hours that some children are attending online classes. Or maybe you just add them to the phone and ruin their golden future. Anything very dangerous. No matter what we believe in our children!

అతి తక్కువ ధరలకే.....!!

https://amzn.to/3g71cNr
వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో మొబైల్స్ అతి తక్కువ ధరకే amazon లో అభిస్తున్నాయి.
ఈ లింక్ click చేసి ఆర్డర్ చేయగలరు.

Friday, June 26, 2020

ఊరికెళ్ళి వ్యవసాయం చేస్తే.......? 26/6/2020 Friday, 8:26 p.m.

అస్సాలములైకుం......బ్రదర్స్! నాకు చిన్నప్పటి నుండే వ్యవసాయం అంటే మక్కువ. నేను చదివింది దొనకొండ లోని మా మేనమామ దగ్గరే అయినా.....సెలవులకు మార్కాపూర్ కు వచ్చే వాణి.  మా ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది. అది అప్పుడు నీళ్ళతో కళకళ లాడేది. ఇప్పుడు అది ఎప్పుడు చూసిన ఎండి నెర్రెలు కానవస్తుంది. కరువు మండలం అంటే ఆంధ్రప్రదేశ్ లో మార్కాపూర్ మండలం పేరు మొదటి వరుసలో ఉంటది. చిన్నప్పుడు అటు గుడ్లకమ్మ నది, ఇటు చెరువు నీళ్ళు ఉండేవి. 
ఇప్పుడు పరిస్థితులు మరబోతున్నఎమో అనిపిస్తుంది. వెలుగొండ ప్రాజెక్ట్ అక్టోబర్ కు మొదటి టన్నల్ ప్రారంభం అనే వార్త ఈరోజే విన్నాను. ప్రకాశం జిల్లా కు అశాజోతి వెలుగొండ ప్రాజెక్ట్.  ఆ ప్రాజెక్ట్ మొదలైతే.... మండలలోని బోరేవేల్ కైనా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మాకు మెట్ట భూమి ఉంది. అందులో బోరేవేల్ కూడా ఉంది. అది కేవలం వర్షా కాలం లోనే నీరు ఉంటాయి. అందుకే.... వెలుగొండ ప్రాజెక్ట్ మా మండలానికి చాలా ముఖ్యం.  
గతంలో నేను హైదరాబాద్ లో  జాబ్ వదిలేసి...ఊరికెళ్ళివ్యవసాయం చేసిన అనుభవం ఉంది.  మళ్ళి పిల్లల చదువు కోసం పట్నానికి రావాల్సి వచ్చింది. లేకుంటే ఊరిలోనే ఉండేవాన్ని. ఇప్పుడు మళ్ళి నాలో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం వార్త విన్నపట్టి నుండి ఊరి కి వెళ్ళాలనే ఆశ పుట్టింది.  





..................................
English Translation :
Assalamulaikum ...... Brothers! I have been passionate about farming since I was a child. I read it near my uncle in Donakonda ..... trade coming to Markapur for the holidays. There is a big pond in our hometown. It was then the artwork with water. Now it is not the driest nerd ever seen. The Markapur Zone in Andhra Pradesh is the first line of drought. As a child, there was a river of udder and river pond.
Now it seems that things are changing. I heard the news today that the Welkonda project is the first tunnel opening for October. Project for Prakasam District If that project starts .... the groundwater level in the zones will increase. We have mattress land. It also includes Borewell. Water is only present during the rainy season. This is why .... the lighting project is very important for our region.
I had a job in Hyderabad in the past ... He had to come back to Patanam for a child's education. Otherwise. The news of the start of the project has now returned to me.

Thursday, June 25, 2020

OnePlus 8 5G Only in Amazon

  • 48MP rear camera with 4k video at 30/60 fps, 1080p video at 30/60 fps, super slow motion: 720p video at 480 fps, 1080p video at 240fps, time-lapse: 1080p 30fps, 4k 30fps, cine aspect ratio video recording, ultrashot hdr, nightscape, micro, portrait, pro mode, panorama, cat&dog face detection&focus, ai scene detection, raw image | 16MP front facing camera
  • 16.637 centimeters (6.55-inch) 90Hz fluid display with 2400 x 1080 pixels resolution, 402 ppi pixel density
  • Memory, Storage & SIM: 6GB RAM | 128GB internal memory | Dual SIM (nano+nano) dual-standby (5G+5G)
  • Oxygen OS based on Android v10 operating system with 2.86GHz of clock speed with Qualcomm Snapdragon 865, powered by Kryo 585 CPU octa core processor, Adreno 650
  • 4300mAH lithium-ion battery.
    https://amzn.to/2BEj9El
  • 1 year manufacturer warranty for device and 6 months manufacturer warranty for in-box accessories including batteries from the date of purchase.

25/6/2020, Thursday, 6:36 విషాద వార్త...!

ఈరోజు చాలా విషాదకర సంఘటన. చాలా మంచి మనిషి, మిత భాషి, మృదు స్వభావి, హైదరాబాడు, చత్త బజార్, లక్కాద్ కోట్ లోని  తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ డైరెక్టర్ జనాబ్ సి.హెచ్. సమ్దాని గారు అకస్మాతుగా అల్లాహ్ కు ప్రియులు అయిపోయారు. 
ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఆయన్ని చాలాసార్లు  కలిసాను. ప్రింటింగ్ వర్క్ పై ఆయన్ని కలవడం జరిగేది. డబ్బుల విషయం చూడకుండా ప్రింటింగ్ వర్క్ చేసి ఇచ్చేవారు. ఆయన మనసులగానే.... ఆయన చేతులు చాలా మృదువుగా, వెన్న ముద్దా చేతికి తగిలిందా? అనే భావన కలిగేది. 

అల్లాహ్ ఆయన సేవలను గుర్తించి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అమీన్. 

   


.................................................................................................................................................................

English Translation :

Today is a very tragic event. He is a very good man, moderate language, soft character, Hyderabadi, Chatta Bazaar, Telugu Islamic Publication Director in Lakkot Kot, Janab C.H. Samdani suddenly became lovers of Allah. His hometown is West Godavari district.

I have met him many times. He would meet with the printing work. Printing work without giving money Like his mind .... Did his hands get so soft, butter kissed? The feeling of being.

I sincerely wish that Allah will recognize His service and reward him. Amin.


Happilo 100% Natural Almonds

  • High protein, dietary fiber, no gluten, no GMO, zero trans fat, zero cholesterol
  • 100 percent real nuts- good for an active life style
  • Lowers harmful cholesterol levels
  • Rich source of omega-3, anti oxidants and vitamins, calcium, iron and magnesium
  • Hearts best friend, improves cardiovascular system
  • Low hypoglycemichttps://amzn.to/3eAYyPU Index – perfect choice for diabetics
  • Lowers BP, maintains healthy skin and improves memory. Maximum Shelf Life 12 Months.



Monday, June 22, 2020

22/6/20 Monday, 9:29 రెజల్ట్ టెన్షన్....!!

అస్సాలముఅలైకుం దోస్తో,  ఈరోజు వర్క్ ఎంక్వయిరీ లోనే చాలా బిజీగా గడిచిపోయింది.   తర్వాత "ఇస్లాం గురు" ఛానల్ కు బ్యానర్ రెడీ చేయాలని వర్క్ లోడ్ పడిపోయింది. అందుకు టైం కూడా చూసుకోకుండా వర్క్ చేశాను. మద్యాహ్నం లంచ్ లేట్ అవ్వడంతో కాస్త నీరసంగా ఫీలయాను. హైదరాబాద్ లోని కరోన కేసుల గురించి నా ఫ్రెండ్ జీలనితో మాట్లాడాను. ఎంతో తెలివి తేటలున్న జీలాని మాటలు విన్నడం అంటే నాకు చాలా ఇష్టం.

 ఈరోజు  తెలంగాణాలో పదో తరగతి రిసల్ట్ వచ్చాయి. అల్ మోస్ట్ పిల్లందరూ పాస్ అనుకోండి కరోన ఎఫెక్ట్ వల్ల. అయితే....గ్రేడ్ తెలవాలి అంతే. అందులో మా పాప కూడా ఉంది.. 7.7 గ్రేడ్ తో పాస్ అయింది.  ప్రభుత్వ వెబ్ సైట్ ఎంతో మోరాయిస్తుంది. పిల్లలు కాస్త టెన్షన్ పడ్డారు. 
.................................................................................................................................................
English Translation :
With Asalamu Alaikum Dos, today's work is very busy in Inquiry. The workload then dropped to a banner for the "Islam Guru" channel. I have not worked for the time.

Lunch in the afternoon was a bit boring Philaya. I talked to my friend Zeelani about the coronation cases in Hyderabad. I like listening to the words of a very intelligent Jeelani.

Telangana today came to the tenth class. Almost all kids want to pass due to corona effect. However, the grade must be revealed. That includes our sins .. Passed with 7.7 grade. The government web site is very cordial. Children get a little tense.

కరోన తో జీవితం ఎలా గడపాలి?


Saturday, June 20, 2020

20/6/2020 Saturday, 8:08 ఇంకో 6 నెలలు పట్టోచ్చు...!

అస్సాలము అలైకుం, సారీ.... నిన్నసాయంత్రం  blog టైపింగ్ మొదలెట్టాను.... కరెంటు పోయింది.  అందుకే blog వ్రాయలేక పోయాను. శనివారం......చట్ట బజార్ ఈరోజు తెరవలేదా? అన్నట్టు ఉంది బజారును చూస్తే. నేను చత్త బజారులో గత 12 సంవత్సరాల నుండి ఉన్నాను. ఎప్పుడు కూడా బంద్ ఉన్నప్పట్టికీ షాపులు కళకళ లాడుతూ ఉంటాయి. జనంతో బజారంతా జనంతో నిండి ఉంటుంది. కానీ... కరోన తో బజారు ఉందా? లేదా? అంత నిర్మానుష్యం. 

ఈ సాయంత్రం నా ప్రియ మిత్రుడు ఏలూరి జీలాని సెవెన్ స్టార్ హోటల్ లో కలిసాడు..కొంత సేపు వాడితో ప్రస్తుత పరిస్థితుల పై చర్చించు కొన్నాము. అలాగే  వాహెద్ గారు పేస్ బుక్ లో షహీన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన  వ్యాసం కూడా చదివానని చెప్పాను. అతని యూటుబ్ ఛానల్ "ఇస్లాం గురు" కు నేనే బ్యానర్ రెడీ చేస్తాను.... కనుక నా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక చత్త బజార్ విషయానికి వస్తే.... ఇంకో 6 నెలలు పట్టే విధంగా ఉంది  పరిస్థితులు మారడానికి. 


............................................................................................................................................................

English Translation :

Sorry, sorry .... I started blogging yesterday evening .... the current is gone. That's why I couldn't write a blog. Saturday ...... Can't open the law bazaar today? Look at the bazaar. I have been in the dead bazaar for the past 12 years. Whenever there is a bandh, there are shops. The bazaar is filled with people. But… is there a bazaar with Corona? Or not? Not so productive.
This evening I met my dear friend Eluri Jeelani at the Seven Star Hotel. I have also read the article by Shaheen Institution in Waheed Garu Pace Book. I will banner to his YouTube channel "Islam Guru" .... so keep coming to me. And when it comes to the dead bazaar .... it takes another 6 months for conditions to change.

Thursday, June 18, 2020

18/6/2020 Thursday, 6:45 P.M. పెళ్లి ఖర్చులు తగ్గినాయి......షాపులు వెలవెలబోతున్నాయి!!

అస్సాలములైకుం, నిన్న పని వత్తిడి వాళ్ళ బ్లాగ్ వ్రాయలేక పోయాను. మన్నించగలరు. స్కూల్, కాలేజీ రోజులలో హాలిడే అంటే చాలా ఆనందం వేసేది. ఆటలు, సినిమాలు, లేకుంటే మా ఊరిలోని నది గుండ్లకమ్మ కు ఫ్రెండ్స్ఈ అందరం కలిసి ఈతకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు మాసిన బట్టలు కూడా  తీసుకెళ్ళి ఊతికి తేచుకునేవాళ్ళం. అంత  బాగుండేది. కానీ ఇప్పుడు హాలిడే అంటే కూడా ఏదో నిరుస్తాహం. ఇష్టం లేనట్టు గా ఒక ఫీలింగ్.  ఇక పెళ్లిలు అంటే చాలా సబరంగా ఉండేది. నా ఫ్రెండ్ శ్రీను అనేవాడు ఊరికి దూరంగా ఉండే కరెంటు ఆఫీస్ దగ్గర వాడి ఇల్లు. వాడి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు. వాడు ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయి హైదరాబాదలోనే డ్యూటీ చేస్తున్నాడు. ఒకటి రెండు సార్లు కలిసాడు కూడా.

ఫంక్షన్లు అంటే గుర్తుకు వచ్చింది.........నేడు పెళ్లిళ్లకు పెళ్లి కార్డు ప్రింటింగ్ 10 లేక 20 కార్డ్ల కంటే ఎక్కువ ప్రింటింగ్ చేపీటంలేదు. కరోనా తో  పెళ్లి ఖర్చులు తగ్గుతున్నా,   ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు మాత్రం తమ కనీస ఖర్చులు కూడా రావటం లేదని వాపోతున్నారు.  హైదరాబాద్ లోని పెళ్లి కార్డ్ల హబ్  చత్తబజార్ బోసి పోయింది. పెళ్ళిళ్ళ సేజాన్ ఇది. జనం లేక వెలవెలబోతున్నాయి షాపులు.  వాటిపై ఆధారపడ్డ వాళ్ళు తమ వద్ద పని చేసే వర్కర్ కు సగం జీతమే ఇస్తున్నారని తెలిసింది. కొందరు తమ పనివాళ్ళను తీసివేసారు కుడా. షాపుల రెంట్ కూడా కట్టలేని పరిస్థితి.!! 

చత్త బజార్లో దినసరి వేతనం వల్లే ఎక్కువ. ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ వల్ల పాపం ఇంతో మందికి ఇల్లు గడవక ఇబ్బందిపడ్డారు. నేను మా ఫ్రెండ్ అఫ్ఫాన్ భాయి తో మాట్లాడి కొందరికి రేషన్ కిట్ ఇప్పిచాగాలిగాను.  అఫ్ఫాన్ భాయి లాక్ డౌన్ కాలంలో  చేసిన సోషల్ వర్క్ మరువరానిది. ఆయన మెహర్ అనే సంస్థ చట్ట బజార్లోనే ఉంది. ఆయన మెహర్ సంస్థ  ఆధ్వర్యంలో కొన్ని వేలమందికి రోజూ అన్నం పంపిణి చేసాడు. కష్టకాలంలో ఎంతో మంది మహానుబావులు మానవతా దృక్పదం తో సేవ చేసారు. వారందరికి నా అభినందనలు. 
                                                                                    



.......................................................................................................................................................
English Translation :

Assalamuilaikum, yesterday I could not write a blog of work stressors. Honor. During school and college days, holiday means a lot of fun. Games, movies, or friends of the river Gundlakamma in our hometown. Even the clothes we wear on the way are easy to breathe. That would be nice. But now the holiday is also something to be disappointed. Feeling like a dislike. Marriages meant that it was very Sabari.
My friend Srinu's house is near the current office near the town. Friends used to call any function in the house. He is now a traffic inspector and is on duty in Hyderabad. Even if one meets twice.
Functions come to mind ......... Today's wedding card printing for weddings is no more than 10 or 20 cards. While the costs of marriage with Corona are falling, the printing press is not even coming up with their minimum costs. Chatbazar hub of Hyderabad wedding cards is gone. It is the bridegroom sezan. People are going to shop.
It is reported that those who depend on them pay half the salary to the worker who works for them. Some even took their jobs. Even the rent of the shop is unbearable. !!
The daily wage in Chat Bazaar is high. Lockdown in April and May has sadly left many people homeless. I talked to our friend Afan Bhai and got some ration kit. The social work done during the Afghan bhai lockdown was unforgettable. His company, Mehar, is in the law bazaar.
He distributed rice on a regular basis to a few thousand under the Mehr Company. During the difficult times many great people served with a humanitarian outlook. My congratulations to you all.


Tuesday, June 16, 2020

16/6/2020 Tuesday, 7:38 P.M. కార్పొరేటే దోపిడీ...!!

అస్సాలములైకుం, మనం ఎదో ఆలోచిస్తాం, కానీ అది ఏదో అవుతుంది. ఈరోజు నేను ఒక మేగజైన్ డిజైనింగ్ చేశాను. 'హెల్త్ వెల్త్ డైజెస్ట్" దాని పేరు. 8 పేజీలు. కంటెంట్ సున్నా. అన్ని ఆర్టికల్స్ ఎక్కడి నుండో కాపీ పేస్ట్ చేసి తాయారు చేయబడింది. చేపెదేమంటే..... అందరికీ ఇన్స్టంట్ వర్క్ కావాలి. ఫాస్ట్ .... ఫాస్ట్.....ఎదో చేసేసం. పని అయిపోయింది. ఏదీ తంతు.

హైదరాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం నుండి మంచి వర్షం పడుతుంది.  వర్షంతో జనాల్లో ఇంకా కరోన భయం పెరిగింది. ఏమో అది నా భయమో.... తెలియడం లేదు. నా ఫ్రెండ్ ఘోరి ఖాన్ కర్నూల్ లో ఉంటాడు. ఈ  కరోన భయంతో కర్నూల్ సిటీ వదిలి రావడం లేదు. హైదరాబాద్ బిరియాని గుర్తుకు వస్తుంది.....కానీ రాలేను..... కరోనా ఎఫెక్ట్ అని ఫోన్ చేసి చెబుతున్నాడు. 

నేను  మా శ్రేయేభిలాషి జిక్రా  స్కూల్ అడ్మినిస్త్రటర్ జనాబ్ సలీం గారు నాకు ఒక post చేసారు. అందులో  టాంజానియా దేశం కరోన ఫ్రీ  అని తెలిపారు.  అంత మాఫియా!! కరోన ను అడ్డుపెట్టుకొని దోపిడీ జరుగుతుందని ఆ పోస్ట్ ద్వారా తెలిసింది.  ఒక విధంగా చూస్తే ప్రపంచం అంత కరోన తో భయ పెట్టి కార్పోరేట్ మాఫియా దోపిడీ చేయాలని పన్నాగం పన్నింది అనే అనుమానం మనకు కలుగక మానదు. 

కరోన తో చిన్న చితక వ్యాపారాలు అటకెక్కాయి. ఇక జరిగే బిజినెస్ అంటే కార్పొరేటే హాస్పిటల్ దోపిడే. !!! కరోన టెస్ట్ ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా పర్మిషన్ లభించింది. జరిగేది అదే..!!!!
   


....................................................................................................................................................................

English Translation :
Assalamualaikum, we think about something, but it becomes something. Today I was designing a magazine. Its name is 'Health Wealth Digest'. 8 pages. Content is zero. All articles are copied and prepared from anywhere. Nothing.
Hyderabad will get good rains from noon today. With the rain, the fear of the corona has increased. I do not know. My friend Ghori Khan is in Kurnool. This corona is not leaving Kurnool City for fear. Hyderabad remembers biriyani ..... but Ralayan says that he has a corona effect.
I did a post by our well-wisher Zikra School Administrator Janab Salim. The Tanzanian country is called Corona Free. So much mafia !! The post reported that the corruption was being exploited. In a way, we are not in doubt that the corporate mafia is plotting to exploit the world with so much corona.
Small corrugated businesses with corona. The business that is happening is the corporate hospital exploit. !!! Permission was also granted to Corona Test Private Labs. Same thing happens .. !!!!

Monday, June 15, 2020

15/6/2020 Monday, 7:50 P.M.

ఈ రోజు చాలా విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.  నిన్న ఒక వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని నేను చాలా షాక్ కు గురయాను. ఎంతో భవిషత్ ఉన్న హీరో కే ఇన్ని కష్టాలా? ఇక పేదవారి కష్టాలు ఈ లాక్ డౌన్ వాళ్ళ ఎన్ని రెట్లు పెరగలేదు. మరి వారికున్న ధైర్యం ఈ హీరో కు లేకపోయేనే? మనిషికి రాక కష్టాలు ఎవరికి వస్తాయి? ఈ లాక్ డౌన్ లో హిందీ సినీ పరిశ్రమ నుండి చాలా మంది ప్రముఖుల మరణ వార్తలు మనం విన్నాము.
ఇక మా ఊరిలో మా అమ్మ కు మోకాళ్ళ నొప్పి పెరిగిందని, హాస్పిటల్ కు తీసుకు వెళ్తే ఎక్స్ర ర , రక్త పరిక్షలకు 5 వేలు ఖర్చు అని ఫోన్ చేసి చెప్పాడు. విన్న మాటలు నా కన్నీలు ఏమి చెప్పలేక పోయాయి. .... వయసుమళ్ళిన నొప్పులే అవి అని ఆమెకు కాస్త ధైర్యం చెప్పాను.
అమ్మను నా దగరకు తీసుకు రావాలనే అనుకొంటాను. కానీ... కుదరని పని. .......అది .... చెప్పలేను.
ఇక షాప్ లో రావలిసిన అమౌంట్ రావడం లేదు. నేను ఇవ్వాల్సిన్వారు రోజూ వస్తున్నారు. ఈ గజిబిజి లాక్ డౌన్ తో మొదలైందని అనుకుంటున్నాను. అంతా ఆ అల్లాహ్ పై భారం వేసి ముందుకు సాగాలనే ప్రయత్నం.
  





..........................................................................................................................................................................................

English Translation :
I want to share with you many things today. Yesterday I was shocked to hear the news that a rising star Sushant Singh Rajput had committed suicide. The hero of the future is very difficult? The misery of the poor has not increased how many times this lock-down. Could this hero lack the courage? To whom shall the trouble of man's arrival come? In this lockdown we hear the news of the death of many celebrities from the Hindi film industry.

In our hometown, my mother had a knee pain and told her that if taken to the hospital, X-ray and blood tests would cost 5 thousand. The words I heard could not tell my tears. .... I dare tell her that they are the pains of old age.


I want to bring mom to my door. But ... incapable of working. ....... it .... can't say.


Amount that is no longer available in the shop. I have been coming to you on a regular basis. I think this mess started with the lockdown. It is an attempt to put the burden on Allah.

Sunday, June 14, 2020

14/6/2020 Sunday,9:27 P.M.

 నాకు  చిన్నప్పట్టి నుండి  ఇంటి  పనులు చేయడం అలవాటు .  అందుకే  ప్రతి ఆదివారం  మా పిల్లల బట్టలు ,  నావి , మా శ్రీమతివి  బట్టలు వాష్ చేయడం నా డ్యూటీ .  ఈరోజు కూడా అదే డ్యూటీ చేయడం జరిగింది.  ఆదివారం రోజు ఇంట్లో నేను తప్ప అందరూ ఆలస్యంగా  లేస్తారు.  వారందరు లేచేసరికి బట్టలన్నీ వాష్ చేసాను . ఈరోజు తేదీ ౧౪కాబట్టి రేషన్ షాప్ కు వెల్లాలి . లేదంటే  రేపు లాస్ట్ రోజు. రెండు నెలల  రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు  తీసివేశారు.  అక్కసు కి వెళ్లేసరికి లైన్ చాతదంతా  ఉంది . కనీసం రెండు గంటలైనా అవుతుంది . ఉసురు అంటి వెన్నక్కి వచ్చేసాను . అటునుండి మార్కెట్ కు వెళ్తే కూరగాయల  ధరలు  కొంచెం  వెక్కువే . మనకు ఇష్టమైనవి తీసుకుంటే  ఇంట్లో  వారికీ  ఇష్టముండదు  .  ఇది మా ఇంటి  సమస్య  కాదు. అందరి సమస్య అని అనుకుంటాను.  ఆడవాళ్ళూ  వారు ఇష్టపడితే అందరికి ఇష్టమనుకుంటారు .ఉదయం టిఫిన్ లేకుండానే  మధ్యాహ్నం లంచ్ అయిపోయంది . ఈరోజు నా మేనకోడలు గుడెయ పుట్టిన రోజు.   వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని కంభం లో ఉంటారు.  శుభాకాంక్షలు  చెప్పి... కాస్త నడుము వాల్చాను . 

సాయంత్రం ఆఫీస్ కు   వెళదామని అనుకున్నాను  కానీ కుదరలేదు.   మగ్రిబ్ నమాజ్ చదువుకొని  ఇప్పుడున్న  పరిస్థులపై ఆ దైవానికి  వేడుకొన్నను.  మా  ఆర్థిక పరిస్థి ల తో ఇంట్లో  కాస్త రుసరుసలు గత మూడు నెలల తో  నడుస్తున్నాయి .  ఇటు  షాప్ లో  బిసినెస్ సరిగా నడవటం లేదు  కరోనా ఎఫెక్ట్ .....!

    
.......................................................................................................................................................................
Translate English :

I have a habit of doing household chores from smallpatti. That is why it is my duty to wash our children's clothes, my nannies and our Mrs. clothes every Sunday. The same duty was done today. Everybody gets up late, except for me at home on a Sunday. I washed all the clothes. Today is the date ౧౪ so go to the ration shop. Otherwise tomorrow is the last day. The ration card was removed if the ration was not taken for two months. On the way to Akkasu, the line is dead. At least two hours. Usuru came back. Vegetable prices are slightly higher if you go to the market. If we take our favorites, they will not like at home. This is not our home problem. I think that's everyone's problem. Females like it all if they like it. Lunch in the afternoon without Tiffin in the morning. Today is my niece Gudea's birthday. They are in Kambam, Andhra Pradesh. Saying goodbye ... kinda waist.

I planned to go to the office in the evening but could not. I read the Maghrib Namaz and prayed to the deity on the existing conditions. Our financial situation has been running at home for the past three months. Business in this shop is not behaving properly Corona effect.
 


Saturday, June 13, 2020

13/6/2020 Saturday, 5:53 P.M.

ఈరోజు ఆఫీసులో అంతగా వర్క్ లేదని, రొటీన్ పేస్ బుక్ ఓపెన్ చేసి ఇతరుల పోస్టులు  చదువుతున్నాను . ఇంతలో మా ఫ్రెండ్ యాసీన్ వచ్చి ఒక బాడ్ న్యూస్ నా చెవిలో వేసాడు. జమాల్ మార్కెట్లో ఉన్న ఎస్ కే ప్రింటర్స్ ఓనర్ ఖాదిర్ చనిపోయాడు నీకు తెలుసా ! అని. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.  అరే ! అత్తనా! చాలా చిన్న వయసు కుర్రాడు. కరోనా అని అందరూ అనుకుంటున్నారు అని మరో బాంబు పేల్చాడు. అంతే! ఏదో  గుండెలో కాస్త దడ పుట్టింది. ఎక్కోడో.....ఒక మూలాన కాస్త భయం కూడా వేసింది.  ఈ వార్త విన్న వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. భయం అయితే అలాగే ఉంది. గుండె కాస్త వేగంగానే కొట్టుకుంటూ ఉంటే కాస్త టీ ట్ తాగి ఒక 5 నిమిషాలు నిద్ర పోయాను. 

సాయంత్రం 5 తర్వాత ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటూ ఉంటే మార్కాపూర్ నుండి మా అమ్మ ఫోన్ చేసింది. ఆమెకు  ఇప్పుడు 75 నంవత్సరాలు . మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఎంతో బాధగా చెప్పింది. మా అమ్మ మా చెల్లెలి వద్ద ఉంటుంది. ఆమె బాగోగులు మా చెల్లెలు చూసుకుంటుంది. నేనైతే ఈ పట్టణంలో ఉండి  ఆమె కోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా నాలుగు మంచి మాటలు ఆమెతో చెప్పిపంచుకొని అమ్మ ప్రేమను పొందుతుంటాను. అక్కడే ఉన్న మాబావ గారితో మా మార్కెట్ సంగతులు చెప్పి నా గుండె బరువు దింపుకున్నాను.  
ఈ కరోనా యుద్ధంలో ఎవరు విజయులో, ఓటమి ఎవరిదో. ఆ దేవాది దేవుడైన అల్లాహ్ కె ఎరుక. 





    



Translation English :
Today there is not much work in the office, I open the routine pace book and read the posts of others. Meanwhile our friend Yasin came and put a bad news in my ear. You know, SK Printers Oner Qadir in Jamal Market is dead! That. Surprise became my turn.
All right! Aunt! A very young boy. Another bomb that everyone thinks is Corona. That's it! Something in the heart was born. Ekkodo ..... a source of fear. As soon as I heard the news, I walked home. The fear is there, though. If the heart beats a little faster, I drink a little tea and sleep for 5 minutes.
My mother phoned from Markapur to come to work after 5 pm. She is now 75 years old. Knee pains are high and sad. My mother stays at our younger sister. She looks after our younger sister. I can't stay in this town and do nothing for her. I always say four good words to her and I get mom's love. My heart was pounding with Mabawa, our marketplace. Who wins in this Corona war, who is defeated. That god is Allah.




Friday, June 12, 2020

12/6/2020 Friday, 7:02 p.m

అందరిలాగే జీవితం సాఫీగా సాగుతుందని నేను అనుకునేవాని. కానీ జీవితం పూలపాన్పు కాదని నిదానంగా తెలిసివస్తుంది. ఆర్డర్ వచ్చిన పని చేస్తే...పని చేసి వారికి అమౌంట్ చెల్లించాలి. ఆ పని వాళ్ళ నాకు కొంత అమౌంట్ వస్తుంది. కానీ..... ఇక్కడే ఒక తిరకాసు. పని చేసిన వారికి ఇవ్వడానికి నా దగ్గర అమౌంట్ లేదు. వర్క్ అయిపోయే నిమిషంలో నా దగ్గర అమౌంట్ లేదు...... ఎటూ పాలుపోని పరిస్థితి. రాత్రి కాబోతుంది. అమౌంట్ సర్దుబాటు కాలేదు.
జీవితంలోని ఈ వడిదోడుకులు ఎప్పుడు అంతం అవుతాయే.......ఏమో?.....రేపు... రేపు..... అంటూ ఆ ఏకేశ్వరుని వైపు చూడడం తప్ప. 
                                                                     









...............................................................................................................................................................

I think life is going smoothly like everyone else. But life is not slow. If the order comes to work ... work and pay them. I get some amount of those working. But ..... here is a tirakasu. I do not have an amount to give to those who work. I do not have a minute to work out ……. It's going to be night. Amount was not adjusted.

When does this end of life ....... What?
.. tomorrow ... tomorrow ..... unless you look at that monster.
                                                                      

12/6/2020 Friday, 12:11 PM

గత ఆరు నెలల నుండి నేనే ఇంటికి సంబంధించిన సామానులు తేచి ఇస్తున్నాను. మా శ్రీమతికి ఆ బరువు ఇవ్వ తలుచుకోలేదు. ఈ కారణంతో ఉదయం టిఫిన్ ఏమీ చేయలేదు నాపై కోపంతో.  సద్ది అన్నం తిని ఆఫీసుకు వచ్చేసాను.

ఆఫీసు అంటే.....పెద్ద  కార్పొరేటే ఆఫీస్ కాదు. ఒక షాప్ లాంటిది.  ఆ షాప్ రెంట్ కు ఇచ్చిన ఓనర్ లాక్ డౌన్ కారణంతో మాపై దయ తలచి రెండు నెలల రెంట్ మాఫీ చేసారు. అందుకు ఆయనకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆయన వచ్చి అరగంట మిగతా షాప్ ఓనర్ రెంట్ గురించి చెప్పారు. వాళ్ళు అమౌంట్ వస్తే ఇస్తామని చెబుతున్నారు... ఇది సబబేనా? అని నన్ను అడుగుతుంటే..... నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి. ఆర్ధిక భాధలైతే ఈ లాక్ డౌన్ పుణ్యమా అని అందరిని ఎడిపిస్తున్నాయి. 

అక్కడ ఇక్కడ అని 2 నెలల రెంట్ జమ చేసి ఇవ్వడం జరిగింది. 

       

.....................................................................................................................................................................


English Translation :

For the past six months, I have been bringing home furniture. We cannot afford to give that weight to our Mrs. Tiffin did nothing in the morning for this reason and was angry at me. Sadi ate rice and came to the office.

er of the shop rented us out for two months due to the owner's lockdown. I thanked him for that. He came and told about the shop owner for half an hour. They say if they get amount ... is it Sababena? To whom should I say my condition? In case of financial distress, the lock down is good.
It was here for 2 months rented and given.

Thursday, June 11, 2020

6/11/2020 Thursday Time: 8:25

ఈరోజు ఉదయమే లేచాను. కానీ ఎందుకో శరీరంలో నలతగా ఉంటే కాస్త గోరువెచ్చని నీటిలో పశుపు కలుపుకుదామని నీటిని స్టవ్ పై పెట్టానో లేదో......లేచింది మా ఇంటి మహారాణి......అవేడే మా శ్రీమతి. ఏంటి? కిచెన్లో ఉదయమే పని? అంటూ కళ్ళు నలుపుకుంటుంది.  ఆ....ఏముంది.... నా బొంద పసుపు నీరు.. అని స్టీవ్ పైన ఉన్న నీటిని చూపించాను.

టైం 9 అవుతుంటే టిఫిన్ చేద్దామంటే చేస్తేగా......నా ఖర్మ అనుకొని అలేగే  ఆఫీసుకు వచ్చాను.
ఆఫీసులో దూరేమో లేదో  వర్క్ లో మునిగిపోవడమే.   సమయం చూస్తే నలుగు గంటలు. కడుపులో ఎలుకలు వాకింగ్  కాదు రున్నింగ్  చేస్తున్నాయి . ఆఫీసుకు మా ఇల్లు చాల దగ్గరే.  ఇంట్లో లంచ్ కు వెళితే అక్కడ ఇరుగుపొరుగు మహిళా సంఘాల అమ్మలక్కలు మీటింగ్ నడుస్తున్నాయి. ఈ కారోన టైములో కూడా వీళ్ళ మీటింగ్ వాయిదా పడటం లేదు. వాళ్ళను కళ్ళతో కోపపడం తప్ప ఏమి చేయలేని మగవాళ్ళం.
రాత్రి ఆఫీసులో ఉండగా మా బావ గారు బషీర్ వీడియో కాల్ చేసారు. లాక్ దౌన్లో నేనే చేసుకున్న నా తల గుండును వీడియో లో చూసి నవ్వుకోవడం నాకు కొంత చీకాగు అనిపించింది.
రొటీన్ ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి రొజూ 10 అవుతుంది.  

..................................................................................................................................................

English Translation :

I woke up this morning. But if the body is nalatta a little bit of warm water to put the cattle on the stove to raise the water ...... queen of our house ... What? Morning work in the kitchen? Black eyes. That .... what .... .... my pale yellow water .. Steve showed me the water above.

Time is 9 and if Tiffin does it, I will come to the office of Allegge with my karma.
Sinking into the workplace, whether away from the office. Time is four hours. Rats in the stomach are running, not walking. Our house is very close to the office. Neighboring women's associations are meeting for lunch at home. Even in this corona time, their meeting is not postponed. There are men who cannot do anything except make them angry with their eyes.

Bashir made a video call while we were in the office at night. Watching the video of my self shaved head in lockdown made me laugh in the video.
When you go to the house to do routine office work, it is 10 in the night.

6/11/2020 Thursday

నా పేరు కరీం ఖాన్. నేను నా రోజు వారి జీవిత సంఘటనల గురించి తెలపాలని అనుకుంటున్నాను. నా జీవితం పూల పాన్పు కాదు. అది ఎన్నో ఓడు దొడుపులులుగా సాగుతుంది. కాబట్టి నా జీవితంలోని రోజువారి సంఘటనల గురించి చదవండి.







_________________________________________________________________________________


English Translation :


My name is Kareem Khan. I want my day to be about their life events. My life is not a flowerpot. It can be a lot of shipbuilding. So read about the day-to-day events of my life.







More Post's...