నాటి స్వాతంత్రంలో అందరూ భాగస్వాములయ్యారు.... స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు... తెల్లదొరలను తరిమి కొట్టేందుకు... అందరూ ఒక్కటయ్యారు... ఒక్కటే వాదం, ఒక్కటే నినాదం... ఇలా భారతదేశం ఒక్కటైన తరుణంలో... అనేక మంది తమ తమ ఆలోచనలతో ఉద్యమంను ముందుకు నడుపుతూ ఉండగా... బారిస్టరు (అంటే ఇప్పటి లాయర్ చదువు) పూర్తి చేసుకున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ తనదైన ప్రతేక శైలిలో అహింసా వాదాన్ని ముందుకు తీసుకువచ్చారు.
కేవలం కొట్లాటతోనే కాదు... శాంతి యుతంగా కూడా మన నిరసనలను వ్యక్తం చేయొచ్చని తెలిపారు. ఇందులో భాగంగానే 1930 ఉప్పు సత్యాగ్రహం చేశారు అహ్మదాబాద్ నుండి అరేబియా సముద్రం వరకు సాగిన ఈ ర్యాలీలో లక్షల మంది పాలుపంచుకోగా గాంధీ గారితో పాటు 60వేల మందిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ తరువాత స్వదేశీ ఉద్యమం జరిగింది. అంటే విదేశీ వస్తు బహీష్కరణ అంటే భారతదేశంలో తయారు చేసిన వస్తువులను మాత్రమే వినియోగించాలి. దీని ద్వారా ఆర్ధికంగా భారతదేశ ప్రజలను, భారతదేశాన్ని ముందుకు నడిపేందుకు ఆయన శ్రమించారు.
1869 అక్టోెబర్ 02న జన్మించిన మొహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ దేశానికి దిశా నిర్దేశం చేసి శాంతీయుత మార్గం చూపి మహాత్మ గాంధీగా మారారు. కొన్ని కోట్ల మంది ప్రజలకు దిక్సూచిగా మారారు. - వసీం
Good information... thanks
ReplyDeleteGood article.
ReplyDeleteGood article
ReplyDelete