Thursday, September 24, 2020

ప్రపంచ హృదయ దినోత్సవం

 24 sept ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా
*హృదయం*
హృదయం
నా హృదయం
నా హృదయం జబ్బు పడితే        నా శరీరమంతా నిర్వీర్యమై పోతుంది 
నేను బతికి ఉన్నానని 
నేను స్పృహలో ఉన్నానని తెలిపేది నా హృదయమే
నా హృదయంలో ఎన్ని దుఃఖాలో ఎన్నెన్ని బాధలో
ఎన్నెన్నివెతలో 
ఎన్నెన్ని విచార లో దాగి ఉన్నాయి  
నా హృదయం లో 
ఎన్నో కోరికలున్నాయి
కన్న కలలూ ఉన్నాయి
ఊహలుఆశలు
చిగురిస్తుంటాయి
నా హృదయం లో జాలి దయ కరుణ ఉంది 
సౌమ్యత సౌజన్యత ఉంది 
ఉపకారం ఉంది 
కృతజ్ఞత భక్తి  నిబిడీకృతమై ఉన్నాయి
నా హృదయం లో గుబులు, భయం, శంకలు,అనుమానాలు కలుగుతుంటాయి 
అది కృత ఘ్నతకు కూడా పాల్పడుతోంటుంది 
ఇలాంటి నా హృదయాన్ని  కోసినప్పుడుడాక్టర్ గారికి 
ఇవేమైనా కనిపించిందా
ఏమైనా వినిపించిందా
 ఏమో!
 కానీ.. కానీ..కానీ.. 
నా హృదయంలో నుండి ఆత్మను ఎవరో లాగుతున్నారు 
కాస్త వారిని ఆపండి 
నేను కేకలు వేస్తున్నాను 
మీకు వినపడడం లేదా 
ఆఁ అర్థమైంది 
వీరు దైవదూతలు 
దైవదూతలారా! ఆగండాగండి  దేవుడు ఉన్నాడని 
నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది 
కాస్త నా వాళ్ళ తో చెప్పి వస్తాను 
ఇప్పుడు నా మాటవాళ్ళు నమ్ముతారు 
వీడ్కోలు చెప్పి వస్తాను
చె... పి... వ... స్తా.....
*అల్లాహ్ ఏ వ్యక్తి శరీరం లోనూ రెండు హృదయాలను పెట్టలేదు* ( దివ్యఖుర్ఆన్: 33-4)

-మొహమ్మద్ అబ్దుల్ రషీద్

No comments:

Post a Comment

More Post's...