ఈరోజు ఆఫీసులో అంతగా వర్క్ లేదని, రొటీన్ పేస్ బుక్ ఓపెన్ చేసి ఇతరుల పోస్టులు చదువుతున్నాను . ఇంతలో మా ఫ్రెండ్ యాసీన్ వచ్చి ఒక బాడ్ న్యూస్ నా చెవిలో వేసాడు. జమాల్ మార్కెట్లో ఉన్న ఎస్ కే ప్రింటర్స్ ఓనర్ ఖాదిర్ చనిపోయాడు నీకు తెలుసా ! అని. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అరే ! అత్తనా! చాలా చిన్న వయసు కుర్రాడు. కరోనా అని అందరూ అనుకుంటున్నారు అని మరో బాంబు పేల్చాడు. అంతే! ఏదో గుండెలో కాస్త దడ పుట్టింది. ఎక్కోడో.....ఒక మూలాన కాస్త భయం కూడా వేసింది. ఈ వార్త విన్న వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. భయం అయితే అలాగే ఉంది. గుండె కాస్త వేగంగానే కొట్టుకుంటూ ఉంటే కాస్త టీ ట్ తాగి ఒక 5 నిమిషాలు నిద్ర పోయాను.
సాయంత్రం 5 తర్వాత ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటూ ఉంటే మార్కాపూర్ నుండి మా అమ్మ ఫోన్ చేసింది. ఆమెకు ఇప్పుడు 75 నంవత్సరాలు . మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఎంతో బాధగా చెప్పింది. మా అమ్మ మా చెల్లెలి వద్ద ఉంటుంది. ఆమె బాగోగులు మా చెల్లెలు చూసుకుంటుంది. నేనైతే ఈ పట్టణంలో ఉండి ఆమె కోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా నాలుగు మంచి మాటలు ఆమెతో చెప్పిపంచుకొని అమ్మ ప్రేమను పొందుతుంటాను. అక్కడే ఉన్న మాబావ గారితో మా మార్కెట్ సంగతులు చెప్పి నా గుండె బరువు దింపుకున్నాను.
ఈ కరోనా యుద్ధంలో ఎవరు విజయులో, ఓటమి ఎవరిదో. ఆ దేవాది దేవుడైన అల్లాహ్ కె ఎరుక.
Translation English :
Today there is not much work in the office, I open the routine pace book and read the posts of others. Meanwhile our friend Yasin came and put a bad news in my ear. You know, SK Printers Oner Qadir in Jamal Market is dead! That. Surprise became my turn.
All right! Aunt! A very young boy. Another bomb that everyone thinks is Corona. That's it! Something in the heart was born. Ekkodo ..... a source of fear. As soon as I heard the news, I walked home. The fear is there, though. If the heart beats a little faster, I drink a little tea and sleep for 5 minutes.
My mother phoned from Markapur to come to work after 5 pm. She is now 75 years old. Knee pains are high and sad. My mother stays at our younger sister. She looks after our younger sister. I can't stay in this town and do nothing for her. I always say four good words to her and I get mom's love. My heart was pounding with Mabawa, our marketplace. Who wins in this Corona war, who is defeated. That god is Allah.
మాషా అల్లాహ్ చాలా మంచి పని మొదలు పెట్టారు.. జయహో.. అల్లాహ్ మీ శక్తి సామర్థ్యాలను సంవృద్ధి చేయాలని ఆయు ఆరోగ్యాలను రక్షించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ReplyDelete-షకీల్ పాషా షేక్.