పాజిటివ్ positive ఆలోచనలు, పట్టుదల ఉన్నవారిదే ఈ ప్రపంచం. దృఢ సంకల్పంతోపాటు,సహనం ముఖ్యం. ఆ సహనంతో ముందుకు వెళితే ఇక సాధించలేనిది
ఏమీ ఉండదు. ఆవేశం అనేది మీ వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆవేశంతో ఏమీ సాధించలేరు!
నష్టాలే చవిచూడవలసి వస్తుంది. మనకు ఇష్టమైన పని మనసు పెట్టి చేస్తే తప్పక సఫలురు అవుతారు.
ధర్మం, న్యాయంతో నడిస్తే
ఎన్ని ఆపదలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారనేది సత్యం. ఎన్ని ఆపదలు
వచ్చినా ఆదుకునేవారు మీ వెంటనే ఉంటారు. ఆలస్యమైనా విజయం మీదే.
మనశ్శాంతిని మించిన
శాంతి ఈ ప్రపంచంలో లేదు. ఒకవేళ అది కరువైతే మీరు ఏ పనీ ఏకాగ్రతతో చేయలేరు. విజయం సాధించలేరు.
భావితరాల వారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు ప్రభావితం కావాలి. అలాంటి పట్టుదలతో శ్రమించండి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని
మీ ముందు తరాల వారు నిరూపించారు.
'డిప్రెషన్' పదం మిమ్మల్ని మీ జీవితాన్ని కకావికలం చేస్తుంది.
ఎలాగైతే సముద్రంలో డిప్రెషన్ వచ్చి తుఫానులా మారి ఎలా అల్లకల్లోలం చేస్తుందో, అలాగే మానవుడు డిప్రెషన్‌కు గురైనప్పుడు దాని ప్రభావం
శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అసాధ్యులు...... సాధ్యులు
కావాలి Impossible ...... should be possible
సాధ్యమైనంత వరకు
(Depression)
డిప్రెషన్‌కు గురైనప్పుడు ధ్యాన సముద్రంలో మునిగిపోవాలి.
తమకు తాము ఏదో ఒక పనిలో లీనమైపోవాలి. అది మిమ్మల్ని అటాక్ చేయకముందే దాన్ని అధఃపాతాళానికి అణగద్రొక్కండి. అప్పుడే మీరు ఏదైనా
సాధించగలరు. అసాధ్యులు కావద్దు. సాధ్యులు కావాలి.
అజేయులుగా మిగలాలి. గజం భూమికోసం పోరాటాలు, జగడాలు జరుగుతున్నాయి. మీరు ఈ ప్రపంచంలో
వచ్చినప్పుడు ఆ గజం భూమి తీసుకొచ్చారా? లేదు కదా! మరి ఎందుకు ఈ వైషమ్యాలు.
దేశ భవిష్యత్తు యువతపై..... the future youth of
the country
దేశ భవిష్యత్తు ఆ
దేశ యువతపై ఆధారపడి ఉంటుంది. కానీ మత్తుకు బానిసై తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దు.
ఆధునిక యుగంలో ఉన్నాం. సాధించేది ముందు ఎంతో ఉంది. సాధించవచ్చు- శాసించవచ్చు అనే సంగతిని గుర్తుంచుకోండి.
ముందుగా మీరు ఎవరో
ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక నాయకున్నో, వైజ్ఞానికున్నో లేదా సక్సెస్ వ్యాపారవేత్తనో మీకు నచ్చిన వారినెవరినైనా తీసుకుని
ఆదర్శంగా తీసుకుని సాగిపోతే మీరు అజేయులుగానే మీ జీవన ప్రస్థానం ముగిస్తారనేది వాస్తవం.
అనామకులుగా మీ ప్రస్థానం ముగించకండి. ఆకాశమే హద్దుగా చెలరేగవచ్చు. ఆ శక్తి ఇచ్చాడు
దేవుడు మానవునికి. మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. - అజ్మత్ ఖాన్, హైదరాబాద్
English Translation :
Only the brave can achieve ...!
This is a world of positive thoughts and perseverance. In
addition to determination, patience is important. Going forward with that
patience there will be nothing more unattainable. Anger can seriously damage
your personality. Nothing can be achieved with rage! Will have to bear the
losses. We must succeed if we keep in mind our favorite work. The truth is that
if you walk with virtue and justice, you will face any dangers and move forward
with ease. No matter how many dangers come, those who support you will be with
you immediately. Late success is yours.
There is no peace in this world beyond peace of mind. If
it is dry you can not do any work with concentration. Can not succeed. Future
generations should take you as an ideal. They need to be affected. Work hard
with such perseverance. Your predecessors have proven that hard work pays off.
The word 'depression' can make your life miserable.
However, depression in the ocean can turn into a hurricane and can have a
devastating effect on human organs when it comes to depression.
Impossible ...... should be possible
Whenever possible you should have all four of these
components in place for launch to maximize profits. They have to immerse
themselves in something. Destroy it into the abyss before it attacks you. Only
then can you achieve anything. Not impossible. Want possible. Must remain
invincible. Fights and battles are going on for yard land. Did you bring that
yard land when you came into this world? Nope! And why these conflicts.
On the future youth of the country .....
The future of the country depends on the youth of that
country. But do not let the drug addicts ruin their future by hand. We are in
the modern age. There is so much to achieve before. Remember that achievable-
can be ruled.
First you have to take someone as an ideal. The fact is
that you're going to end your life as an invincible if you take on the ideal of
being a leader, a scientist, or a successful entrepreneur. Do not end your
reign as anonymous. The sky is the limit. God gave that power to man. Identify
yourself.