Thursday, October 29, 2020

చెరువుల నగరం City of Lake



 చెరువుల నగరం City of Lake
మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....!

వర్షం ఆధారంగా నీరు భూమి పైకి చేరుతుంది. భూమిలోకి ఇంకి భూమిలోపలికి చేరుతుంది. మరి వర్షం తర్వాత నీరు కావాలంటే నీరును నిల్వ చేసుకోవాలి. అలా ఆలోచనతోనే “చెరువులు” ఏర్పడ్డాయి. వర్షం ద్వార నీరును చెరువుల్లో Tank నిలువ చేస్తారు.  ఆ నీటిని త్రాగడానికి, పంట పొలాలకు వినియోగిస్తారు.

భారతదేశంలోని గ్రామాలు నీటి కోసం ఎక్కువగా చెరువుల మీదనే ఆధారం.  పూర్వకాలంలో రాజులూ, చక్రవర్తులు, నవాబులు ప్రజల అవసరాల కోసం చెరువులు త్రవెంచేవారు. అందులో మంచి నీటి చెరువులు, ఊర చెరువులు అని రెండు రకాలు.

చెరువులు Cheruvulu :


తెలంగాణాలో ఎక్కువగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అంటే ఒక చెరువు నిండితే, దాని నీరు మరో చెరువుకు అలుగు ద్వరా పోతుంది. అది నిండితే మరో చెరువుకు పోతుంది. దేనినే గొలుసుకట్టు చెరువులు అంటారు. వీటికి అనుబంధంగా కుంటలు, కాలువలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి తుములుంటాయి. ఈ విధానం మన తెలంగాణాలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు.  వర్షా కాలంలో చెరువులు నిండితే మిగిలిన నీరు బయటకు విడిచి పెట్టడానికి “కలుజులు” ఉంటాయి.  ఇవి నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.

చెరువుల నగరం City of Lake

మన హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 3000 నుండి 7౦౦౦  వరకు చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు మనకు కానరావు. అందులో కొన్ని ఎప్పుడో కనుమరుగాయై. వర్షం పడ్డప్పుడే అవి మనకు మునిగిన కాలనీల రూపంలో కానవస్తాయి. అందులో ఇప్పుడు 70 నుండి 500 వరకు ప్రభుత్వ లెక్కలో ఉన్నాయి.  కొన్ని ఇప్పటికి వాటి పేర్లు మాత్రం నిలిచాయి. నవాబ్ సబ్ కుంట, తీగల కుంట, అఫ్జాల్సాగర్, నల్లకుంట,మాసాబ్ ట్యాంక్ ఇవి అప్పటి కుంటలే. ఎన్నో చెరువులు ఆక్రమణలకు, చెత్త వేయడానికి, రియల్ ఎస్టేట్ తో చెరువులను కనుమరుగు చేసి.....నేడు హైదరాబాద్ కు వరదలు రావడానికి కారణాలుగా మారాయి.

 2010 నాటికి 500 సరస్సులు హుడా పరిధిలో ఉన్నాయి. మే 2018 నాటికిహుడా 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డును కలిగి ఉంది. వీటిలో 62 సరస్సులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి.
 వీటిలో చాలావరకు కుతుబ్ షాహీ రాజులూ, నవాబులు హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించబడ్డాయి.

English Translation :

City of Ponds City of Lake

Water is essential for human life and for living things. But the question is where does this water come from? Rain ....!

Water rises above the ground based on rainfall. Into the earth and into the earth. If you want water after rain, you have to store water. With that in mind, "ponds" were formed. Tanks store water in ponds through rain. That water is used for drinking and for crop fields.

Villages in India rely heavily on ponds for water. In ancient times kings, emperors and Nawabs used to dig ponds for the needs of the people. There are two types of fresh water ponds and settlement ponds.

Ponds Cheruvulu:

There are mostly chain ponds in Telangana. This means that if one pond fills up, its water will flow to another pond. If it fills up it will go to another pond. Anything is called chain ponds. These are accompanied by lairs and canals. Sneeze to control them. This policy is not found anywhere else in the world except in our Telangana. If the ponds fill up during the rainy season, there will be "drains" to release the remaining water. These protect the filled ponds from being cut off.

City of Ponds City of Lake :

There are about 3000 to 7000 ponds, lairs and reservoirs around our city of Hyderabad. But they never happen to us. Some of it ever disappeared. When it rains they do not come to us in the form of submerged colonies. Of that, 70 to 500 are now in government accounting. Some still have their names. Nawab Sub Kunta, Thigala Kunta, Afzalsagar, Nallakunta and Masab Tank were the then Kuntas. Many ponds have become the cause of encroachments, dumping of garbage, disappearance of ponds with real estate ..... floods in Hyderabad today.

 As of 2010, 500 lakes are under Hooda. As of May 2018, Hooda has a record of 169 lakes covering more than 10 hectares. Of these, 62 lakes are under government control.

 Most of these were built by the Qutb Shahi kings and Nawabs for the water needs of the people of Hyderabad.

2 comments:

More Post's...