Saturday, November 7, 2020

ప్రకృతి వైపు షికారు....!

హైదరాబాద్‌ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే 'సండే మార్కెట్ 'ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్మకాలు అంతగా లేకపోయినప్పికీ, పాత వస్తువుల అమ్మకాలకుపెట్టింది పేరు. 'సండే మార్కెట్' ఉదయం ఆరు గంటలకే జనంతో నిండిపోయింది. ఒక రౌండ్‌ వేసుకొని ఇంటికెళ్ళి పోయాను. శనివారం వేసుకున్న ప్రణాళిక ప్రకారం 'షికారు'కు నేను, నా మిత్రులు మహమూద్‌ ఖాన్‌ ఘోరి, ఇర్షాద్‌ మరియు మోయిన్‌ సాబ్‌ నలుగురం హిమాయత్‌సాగర్‌ సందర్శనకు బయలుదేరాము. దారిలో కిషన్‌బాగ్‌లోని 'హరీదర్గా'కు కూడా వెళ్ళాము. దర్గాలో అద్దాలతో చేసిన డిజైన్‌ చాలా ఆకర్షించింది.

అక్కడి నుండి రాజేంద్రనగర్‌ దాటుకుంటూ హిమాయత్‌సాగర్‌ చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సాగర్‌కు  పక్కనే ఉన్న గుట్టపై కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాము. అది ఆహ్లాదంగా కనిపించింది. నవాబులు నిర్మించిన ఆ హిమాయత్‌ సాగర్‌ను చూడడం నాకు అదే మొదిసారి. అక్కడ మేము సంతోషంగా, ఉల్లాసంగా గడిపాము.  హిమాయత్‌సాగర్‌  కట్టపై నడవడానికి అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. ఏదో పని జరుగుతుందని, అందుకని సందర్శకులను దానిమీదకు రానివ్వటం లేదని తెలిపారు. మేము మాతో తెచ్చుకున్న ఫలహారాన్ని ఆరగించి, సేదతీరి మరలా 2 గంటలకు శంషాబాద్‌ వైపు నుండి హైదరాబాద్‌కు బయలుదేరాము. దారిపొడవున పచ్చదనం, అందమైన రింగు రోడ్డు. చూడడానికి ఆహ్లాదకర వాతావరణం. అది చూడాల్సిందే తప్ప,  వివరించడం కుదరదు.

హైదరాబాద్‌లోకి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసరికి ఆకలి దంచేసింది. హైదరాబాద్‌లో బిర్యాని ఫేమస్‌ హోటల్‌ 'షాగౌస్‌'లో మేము నలుగురం 'బిర్యానీ, మంది (మసాలాతో ఉండని బిర్యాని)' ఆరగించేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. 

ఇంటికి చేరుకొనేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఈ విధంగా ఆదివారం అంతా  ప్రకృతి లో షికారు చేసేందుకు అవకాశం దొరికింది. దానికి సంబంధించిన చిత్రాలు మీరు చూడవచ్చు..  - కరీంఖాన్‌, హైదరాబాద్‌

1 comment:

More Post's...