నేను రాస్తున్న ఈ సాహిత్యంలో అనుభవంతో రాస్తున్న అనుభవాలే. మన విలువ ఏమిో మనం తెలుసుకోవాలి. మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలుస్తుంది. సమయం చాలా విలువైనది. మరి జీవితం అంతకంటే విలువైనది. ఈ విలువలను తెలుసుకుంటే అదే చాలు.
కొందరు ఆత్మహత్యలే పరిష్కారమనుకొని బలవర్మణాలకు పాల్పడుతున్నారు. అది చాలా ఘోర తప్పిదం. క్షమించరాని నేరం. చచ్చిసాధించేది ఏముంది? ఓ పిరికివానిగా మీ విలువైన జీవితం ముగుస్తుంది. చచ్చినా సరే పోరాడి చావాలి. ఓ వీరుడిగా మీరు గుర్తుండిపోతారు. ఇలా చేయదలచుకున్నవారికి నా సలహా ఒక్కటే- గుర్తుంచుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని., ఎన్నో సార్లు ఈ వాక్యాన్ని పదేపదే ఈ పుస్తకంలో రాసాను. ఒక్క సారి ఆలోచించండి. అర్ధాంతరంగా జీవితం ముగించడం మంచిదా? దేవుడు అలా చేయమన్నాడా? కాదు కదా! మరి ఎందుకు ఆ ఘోరానికి పాల్పడుతున్నారు?
మీతో ముడిపడివున్నవారు ఎందరివో జీవితాలు ప్రభావితమవుతున్నాయి. వద్దు, క్షణికావేశం వద్దు. ప్రశాంతంగా, శాంతిగా ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించండి. మనస్సును సంతోషంగా ఉంచుకోవాలి. మనస్తాపానికి గురికావద్దు. ఓ పుష్పం వికసించినప్పుడు సువాసన వెదజల్లుతుంది. మీ మనస్సును, మీ మెదడును పూర్తిస్థాయిలో వికసింపజేయండి. ఎలాగయితే ఓ మొగ్గ మెల్లమెల్లగా విప్పారి పుష్పంగా మారుతుందో అప్పుడు దాని ఉనికి అందరికీ తెలుస్తుంది. ఈ ఉదాహరణను తీసుకుంటే. దాని ఉనికి అంటే ఏమి? దాని యొక్క సువాసనే. మీరు కూడా మానవులే మీ ఉనికి ఉండకూడదా? అలా చేయలేరా? చేయవచ్చు. ముమ్మాికి చేయవచ్చు. అది మన చేతిలోని పనే. దేవుడు మీకిచ్చిన అపూర్వ మేధస్సుతో కొంతభాగమైనా ఉపయోగించుకుంటే చాలు. సమయం చాలా విలువైనది. అంతకంటే విలువైనది మన జీవితం. ఈ రెండు విలువలను సరిగ్గా గుర్తుంచుకుంటే చాలు విజయం మనదే.
ఉదాహరణ : హైదరాబాద్ నుండి ముంబాయి ఓ వారం రోజుల కొరకు వెళ్ళాలంటే ఓ ప్రణాళిక వేసుకుాంరు. ావెల్ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ సర్దుబాటుచేసుకొని ప్రయాణం మొదలెడతారు. ఒక వారం రోజుల వరకు మన ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పుడు- జీవితం అనే ఇంత పెద్ద నౌకకు ప్రణాళిక వేసుకుంటే చాలా సాఫీగా సాగుతుంది. ప్రణాళికా బద్దంగా నడుచుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఒకవేళ ప్రణాళిక లేకుంటే ఈ జీవితం అడవికాచిన వెన్నెల్లా గడిచిపోతుంది. నౌకకు తీరం దొరకనట్లు గడిచిపోతుంది. సమయం ఆసన్నమైనది. ఎన్ని సవాళ్ళయినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. జీవితానికి ఓ అర్ధం ఇవ్వాలి. అది మన మీదనే ఆధారపడి ఉంది. అభివృద్ధి చెందడం లేదు. ఫలానా మనిషి, ఫలానా సమస్య కారణం అనే సాకులు వెదక వద్దు. వెదకకూడదు. అలా వెతుక్కుంటూ ఎవరినో దూషించుకుంటూ ఉండిపోతే ఏమీచేయలేరు. ఏమీ సాధించలేరు. చిత్తశుద్ధితో సాధన చేస్తే అన్ని సాధ్యమే.
ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ ఆవేదన చెందకూడదు. మిమ్మల్ని ప్టుించిన మీ భగవంతుడు మీ వెంటనే ఉన్నాడని గుర్తుంచుకుని నడుచుకుంటే ఏ విధమైన ఆందోళన మీ దరిదాపులకు కూడా రాదు. మీ మానసిక స్థితిని ఎంతగా మీరు బలంగా రూపుదిద్దుకుంటే మీ అభివృద్ధి కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లాభ నష్టాలు ఉంాయి. నష్టం వస్తుందని వ్యాపారాన్ని మూసివేయలేం కదా. అలాగే జీవితంలో కూడా సుఖదుఖాలు వస్తుాంయి. దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితం అని అంతం చేసుకుాంరా? కాదు కదా? కాని కొందరు క్షణికావేశంతో అంతం చేసుకుంటున్నారు. ఎందరినో చూస్తున్నాము. కొందరు యుక్తవయసులోనే అంతం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే- ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనేది. ఆలోచనతో నడుచుకోవాలి కాని ఆవేశంతో కాదు.
ఆవేశంతో నష్టమే కానీ లాభమనేది ఉండదు. ఒకవేళ మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నప్పుడే ఏదో ఒక షాపింగ్ సెంటర్‌కు వెళ్ళి జనజీవన స్రవంతిలో కలవండి. ఒంటరిగా ఉండకండి. దాని తీవ్రత ఎక్కువవుతుంది. మానసిక ఆందోళన అనేది చాలా రోగాలకు మూలకారణమవుతుంది. దాని తీవ్రతను అణగద్రొక్కడానికి ప్రయత్నించాలి కాని, ఒకవేళ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే చాలా నష్టం వాిల్లుతుంది. అది వినాశనకారి. మానవునికి పెద్ద శత్రువు మానసిక ఆందోళననే. ఆ శత్రువును అంతం చేయండి. అంతం చేసే మేధస్సు కూడా మీ దగ్గరలోనే ఉంది.
English Translation :
Go ahead with the planning !
These are the experiences that I am writing with a lot of scrutiny and immense experience in the literature I am writing. We need to know what our value is. Everyone else knows as much as you do about yourself. Time is very precious. And life is worth more than that. It is enough to know these values.
Some commit suicide and resort to coercion. That is a terrible mistake. An unforgivable crime. What? Your precious life will end as a coward. Even if he dies, he must fight and die. You will be remembered as a hero. My advice to those who want to do this is the same- remember that there is a solution to every problem., I have written this sentence many times in this book over and over again. Think for a moment. Is it better to end life by meaning? Does God do that? No way! And why commit that atrocity?
The lives of many who are connected to you are being affected. No, not transient. Live life calmly, peacefully and with confidence. Keep the mind happy. Do not be offended. When a flower blooms, the fragrance dissipates. Fully develop your mind and your brain. However, if a bud slowly unfolds into a flower, then its existence will be known to all. If you take this example. What does its existence mean? The scent of it. Shouldn't you be human too? Can't do that? Can. Mummy can. That is our task. All you have to do is use some of the extraordinary intelligence that God has given you. Time is very precious. More valuable than that is our life. Success is ours if we remember these two values correctly.
Example: We have made a plan to travel from Hyderabad to Mumbai for a week. Avel Food Accommodation adjusts all this and starts the journey. When we are planning for up to a week- planning for such a big ship called life goes very smoothly. No matter how many problems you face, if you follow the plan, you will be comfortable. If left unmanaged, they can be left astray and lose the right path. The ship passes as if it could not find the shore. The time is imminent. Be prepared to face any number of challenges. Life must be given a meaning. It depends on us. Not developing. Falana man, do not look for excuses as to the cause of the particular problem. Do not search. There is nothing that you can do about it. Nothing can be achieved. All is possible if practiced in good faith.
Never feel lonely. No worries will even come to your doorstep if you walk away remembering that your God who caught you is right behind you. The stronger your mood, the better your development will be in that range. There are profit losses when doing a business. Can't close the business that the loss will come. Happiness comes in life as well. Why end this life when grief comes? Isn't it? But some end up with a fleeting moment. Seeing so many. Some end up in adolescence. All I can say is that there is a solution to every problem. Walk with thought but not with rage.
Anger is a loss but not a gain. If you are mentally very anxious then go to some shopping center and meet in the mainstream. Do not be alone. Its intensity increases. Psychological anxiety is the root cause of many diseases. One should try to suppress its severity but if it continues to increase it will do a lot of damage. It is destructive. The biggest enemy to man is mental anxiety. End that enemy. The intelligence to end is also near you.