Thursday, August 20, 2020

మీ మీద మీకు విశ్వాసం ఉండాలి....8

చరిత్రను తిరిగేయండి. ఓ మంచిని అందులోనుంచే ఎంచుకోండి. దాని కొరకే సాధన చేయండి. మీరు కూడా చరిత్రకారులుగా మిగలవచ్చు. మీరు కూడా వారిలాగా మానవులే కదా? వారు ప్రపంచాన్ని వీడారు. మీరున్నారు. మీరు ఆ పని చేయవచ్చు. తప్పక సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు. వారు కూడా మీలాిం మానవులే కదా? నడుం బిగించండి. ముందుకు నడవండి. మీ ముందు విజయం వేచి చూస్తున్నది. ఇక మీదే ఆలస్యం. 
తలచుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగవచ్చు. నేడు కూడా మీదే రేపు కూడా మీదే. ఎవరి కోసం ఎదురు చూపులు. ఒక అమూల్యమైన అస్త్రం మీ వద్ద ఉంది. అణువస్త్రం  కొనుగొన్న ఆ అస్త్రమే మీకు దేవుడిచ్చిన అపార  మేధస్సు. అవకాశం కోసం ఎదురు చూడనవసరం లేదు. మీరే అవకాశం సృష్టించుకోండి. ఎవరి ఆధీనంలో పనిచేయనవసరం లేదు. మీరే అధినేత కావచ్చు. మీరే ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇది సాధ్యమే. ఎన్నోసార్లు ఈ వాక్యం ఈ పుస్తకంలో వివరించబడింది.  ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా చవిచూడవలసి నప్పుడు చవిచూడవలసినదే. తప్పదు. అధైర్యపడితే అది మీ అంతమే. ఎవరి కోసమైనా నిరీక్షణ చేస్తున్నప్పుడు ఓ హద్దు వరకే చేయండి. సమయం వృధా చేయకండి. నిరీక్షణ అనేది మానవున్ని నీరసం చేస్తుంది. మరి ఎవరి కోసం ఈ నిరీక్షణ. అన్వేషణ కావాలి. దరిద్య్రాన్ని తరిమికొట్టండి. ఈ రోజే ప్రతిజ్ఞ చేయండి. ాా బిర్లా అంబాని దరిద్య్రాన్ని తరిమిక్టొి కొన్ని వేల కుటుంబాలకు ఈనాడు ఉపాధి కల్పిస్తున్న మహానుభావులు. భారత ఆర్థిక వ్యవస్థనే మార్చివేసిన ఉద్దండులు. ఎంత కృషి, ఇదంతా ఆ దేవుడు సృష్టించిన మానవుని కృషే. మీరు కూడా మానవులే అన్న విషయాన్ని మర్చిపోకండి. చింతన చిదిమేయండి. కూకి వ్రేళ్ళతో పెకలిస్తేనే గాని ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యం కూడా మీ చెంత చేరుతుంది. లేకుంటే బ్రతుకంతా చీకి. జీవితం అమావాస్యలాిం నల్లని చీకిలా చేసుకోకూడదు. 
ఎంతమందైతే మహానుభావులు మహాత్ములు వచ్చి వెళ్ళారో వారందరూ మనలాిం మానవులే. తేడా ఏమి? వారు తమలో ఉన్న ప్రతిభను బయి ప్రపంచానికి చారు. ప్రతిభ ఎవరి సొంతం కాదు. దేవుడు ప్రతి మానవునికి ఇచ్చాడు. ఏదో ఒక రూపంలో. ఇచ్చిన ఆ ప్రతిభను అంధకారంలో ఉంచకూడదు. వీలైనంత వరకు దరిద్య్రాన్ని తరిమికొట్టండి. దాన్ని తరిమికొట్టడం సాధ్యమైన పనే. కానరానంతవరకు తరిమికొట్టండి. తరిమికొడ్తానని ప్రతిజ్ఞ చేసి మేల్కొని మేధస్సును సాహసంతో జతచేసి కృషి చేయండి. సక్సెస్‌ అనేది మీ ముందు మోకరిల్లుతుంది.  మీకు పట్టున్న సబ్జెక్టుల్లో సాధన చేయండి. 
విద్యార్థులారా! అవిరామంగా ఒక ార్గ్‌ె చేసుకొని కృషి చేస్తే మీ భవిష్యత్తు బాగు పడినట్లే. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. మీ భవిష్యత్తు మీచేతిలోనే ఉంది. ఎవరికోసమో ఎదురు చూడనవసరం లేదు. ఆత్మవిశ్వాసం అపారంగా పునికిపుచ్చు కుంటే చాలు- మీ జీవితం ధన్యమైనట్లే. మీకు తిరుగుండదు. తాకు చప్పుళ్లకు భయపడితే జీవితమంతా భయం గుప్ప్లిోనే ముగిసిపోతుంది. 
ఒకసారి ఉదయించే సూర్యున్ని చూడండి. అలుపెరుగక ఎలా ప్రకాశిస్తున్నాడో? అలాిం ప్రకాశం మీ మేధస్సులో కూడా ఉంది. ఓ విద్యుత్‌ దాగి వుంది. ఆ విద్యుత్‌తో ఎంత వెలుగు విరజిల్లుతారో అది మీ సొంతం. ఓ ాన్స్‌ఫారం మీ మెదడు. ఎంత జనర్‌ే చేసుకుాంరో చేసుకోండి. అంధకారాన్ని దూరం చేసి, దరిద్య్రాన్ని దరికి చేరనీయవద్దు. దరిద్య్రం ఓ పెద్ద శత్రువు. 
మానసిక ఆందోళన అనేది మరో శత్రువు. ఎందుకు పెంచుకుాంరు ఈ శత్రువులను. ఈ శత్రువులను తరిమివేయకపోతే - ఇవి మిమ్మల్ని అతి తొందరగా అంతం చేస్తాయి. అంత మనస్సు కకావికలమయినప్పుడు దైవధ్యానంలో మునిగి ఆ దైవం మీ వెన్నంటే ఉన్నాడని మనస్సులో అనుకుంటే చాలు. మీ ఆత్మకు సంపూర్ణ శాంతి కలుగుతుంది. ఇంకో విషయం గుర్తుంచుకోండి. శాంతి కాములే విజయ సారధులయ్యారు. 

No comments:

Post a Comment

More Post's...