Sunday, December 13, 2020

నలమల టూర్‌ Nalamala tour

అందరికీ తెలిసి, కొందరికి తెలియని విషయం ఏమిటంటే.... ఇది పెళ్ళిళ్ళ సీజన్‌. రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. వృత్తి రీత్యా నేను వెడ్డింగ్‌ కార్డు డిజైనర్‌ కాబట్టి సీజన్లో ఎడతెరిపి లేకుండా వర్క్‌ నడుస్తుంది. పని వత్తిడి వల్ల మానసికంగా కాస్త విశ్రాంతి కావాలనే కోరిక ఎక్కడో మూల పుట్టింది. 

ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్‌ కూడా నేనే చేయాల్సి వచ్చింది.  అయితే,  ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్‌ సాబ్‌, ఇర్షాద్‌, ఘోరి ఖాన్‌ ని కూడా వెంట తీసుకెళ్ళాను. 

నలుగురం 3 రోజుల టూర్‌ను సెట్‌ చేసుకొని డిసెంబర్‌ 9,10,11 లలో అక్కడ చూడవలసిన ప్రదేశాలను, నలమల అడవి అందాలను ఆస్వాదించవచ్చునని ఆశతో ఎంతో ఉల్లాసంగా, హాయిగా ఈ మూడు రోజులు మా పనులను పక్కనబెట్టి మా ఊహాలలో తెలిపోయాము.


ఆ మూడు రోజుల ఫోటోలను మీతో షేర్‌ చేసుకుంటున్నాను. మీరూ చూడండి. ఆఁ... గతంలో కంభం  చెరువు గురించి మీకు తెలియజేసానుకుంటా... ఆ అక్కడకు కూడా వెళ్ళాము. చూడండి. - కరీంఖాన్‌, హైదరాబాద్‌. 
English Translation:
Nalamala Tour What everyone knows, what some people don't know is that .... it's wedding season‌. Weddings are in full swing in the two Telugu states. Professionally I am a wedding card designer so the season runs the workshop without a hitch.

కంభం cheruvu
The urge to relax mentally due to work pressure has taken root somewhere. At this point my niece got married. I also had to do the card design myself.
కంభం చేరువు బోర్డు
However, with the desire to go to this wedding I went on doing their chores a bit faster that day. Our niece's wedding was in the town of Giddaluru in the Nallamala forest, so I took my well - wishers, friends Moin Saab, Irshad and Ghori Khan with me to the wedding.
The four of us set out on a 3 day tour and in December 9,10,11 we set aside our work for these three days in the hope that we could see the places to see and enjoy the beauty of the Nalamala forest.
I will share those three days photos with you.

See for yourself. Um ...
I just wanted to let you know about the Cumbum pond in the past ...
we went there too. See.

Thursday, December 3, 2020

బీదవాడిగా పుట్టడం తప్పుకాదు...It is not Mistake to be born poor ...

అక్వేరియంలో రకారకాల రంగుల చేపలు ఎంత ప్రశాంతంగా ఉల్లసంగా విహరిస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? మీ మనసును కూడా అలా ఉంచడానికి ప్రయత్నించండి.  ప్రతి వర్క్ఆరంభంతో సహా అంతం కూడా  ఉంటుంది. ఆరంభం ఎలా ఉన్నా- అంతం మాత్రం మంచిగా ఉండాలి. ఒక విజయంతో ముగియాలి. తమకు తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీలో ఏదైనా అంగవైకల్యం ఉందా లేదు కదా! అంగవైకల్యం ఉన్నవారే, ఎన్నో రంగాలలో తమ తమ నైపుణ్యం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకైతే ఏలాంటి  అంగవైకల్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. అయినా మీరు అభివృద్ధి చెందడం లేదంటే అది మీ స్వయం కృపరాధమే.

నా అదృష్టం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేను అనే భావన రాకూడదు. సకల అంగాలు మీలో సక్రమంగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ముందుకు సాగాలి. చేయల్సినదేదో చేసి చూపాలి. ప్రయత్నమే పురుష లక్షణ మంటారు. కానీ మహిళలు కూడా పురుషులను అధిగమిస్తున్నారు. గమనించండి. మీలో నిద్రిస్తున్న మనిషిని బయటకు లాగండి. తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. అన్ని మీలో ఉన్నాయి - మీరు సమర్ధులు. ఏదైనా చేయగల సత్తా ఉంది మీకు. అలాంటప్పుడు మీరు వెనుకంజ వేయడం సమంజసం కాదు.

 ఇదంతా రాస్తున్నది మానసిక వ్యక్తిత్వ వికాసానికే. మానసిక వ్యక్తిత్వ వికాసం వికసించిందనుకోండి - ఇక విజయం మీదే. ఎలాగైతే ఓ మొగ్గ వికసించి పుష్పంగా మారి సువాసన వెదజల్లుతుందో!  

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.                                                     - అజ్మత్‌ఖాన్‌, హైదరాబాద్‌

It is not wrong to be born poor ...

Have you ever noticed how calm and merry the colorful fish in the aquarium are? Try to keep your mind that way too. There will also be an end, including the beginning of each workshop. No matter the beginning- the end must be good. Should end with a victory. Do not underestimate themselves. 

Do you have any disabilities? People with disabilities continue to demonstrate their expertise in many fields. You have no disability. Are healthy. If you do not thrive, however, it is your own fault. This is my luck, I should not feel that I can do nothing anymore. When all the limbs are regular in you you should go ahead and thank God for that. Do what needs to be done and show it. Attempt is called masculinity. But women also outnumber men. Note. Pull out the sleeping man in you. Anything can be done if it comes to mind. Can show the world. All are in you - you are capable. You have the ability to do anything. In that case it does not make sense for you to lag behind. 

All this is written for the development of mental personality. As mental personality development flourishes - success is yours. However, a bud blossoms into a flower and the fragrance dissipates!

 

Saturday, November 28, 2020

అహింస నేటి ఆవశ్యకత (Non-violence is the need of the hour...)

ఒక జీవిని హింసించకపోవడమే అహింస. హింసించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అది మానసిక హింస కావొచ్చు, శారీరక హింస కావొచ్చు. ఒకరిని దూషించడం, మాట్లాడకపోవడం, దూరంగా ఉంచడం వంటిది మానసిక హింస కిందికి వస్తుంది. ఇక కొట్టడం, చిత్రవధ చేయడం, నిర్బంధించడం శారీక హింస కిందికి వస్తుంది. భర్త భార్యతో మాట్లాడకపోవడం,దూరంగా ఉంచడం, అన్న తమ్ముడిని దూరంగా ఉంచడం, కన్నబిడ్డలు ముసలి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వంటివన్నీ హింస కిందికే వస్తాయి. 
ఏకేంద్రీయం నుంచి పంచేంద్రీయ జీవులలో ఏ విధంగా హింసించినా అది హింసే అవుతుంది. మనిషి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. చిన్నవారిని, బలహీనులను ఎలాపడితే అలా దూషించడం, వారి మనస్సును గాయపరచడం మంచిది కాదు. బలముంది కదా అని బలహీనులను కొట్టడం, వారి ఆస్తిపాస్తులు, డబ్బుదస్కం కాజేయడం కూడా మంచిది కాదు. కష్టపడకుండా అప్పనంగా ఇతరుల ఆస్తిపాస్తులు కాజేయడం కొందరికి మామూలే. కానీ ఆ ఆలోచనే మంచిది కాదు.
కేవలం తమ అహాన్ని సంపూర్తి చేసుకునేందుకుగాను ధనాన్ని, అధికారాన్ని కొందరు పోగుచేసుకుంటుంటారు. ఇది కూడా ఒక రకమైన హింసే  అనుకోవాలి. 
బుద్ధుడు, మహావీర్‌, నానక్‌, కబీర్‌, మహాత్మా గాంధీ వంటి పుణ్యపురుషులు జన్మించిన మన దేశంలో నేటికీ హింసాత్మక వాతావరణం ఉందని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగా మన చుట్టూ అనేకం హింస జరుగుతున్నాయి. యుద్ధాలు , మతకల్లోలాలు , కులఘర్షణలు, వర్గపోరాటాలు, మూకదాడులు, పరువు హత్యలు  వంటివి మనం చూస్తూనే ఉన్నాం. 
మనం అహింసతో కూడిన జీవితం, రాజకీయాలు , ఆర్థికవిధానం, విద్యావిధానం వైపు అడుగులేయాల్సి ఉంది. ఇది మన పిల్లలకు కూడా నేర్పించి అలవాటుచేయాల్సి ఉంది. అందరూ బాధ్యతాయుతంగా, జవాబు దారీతనంతో జీవించే సత్సమాజంను మనం రూపొందించుకోవాల్సి ఉంది. 
మన జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గాన్నే తన జీవన విధానంగా మార్చుకుని మనకు ఆదర్శంగా నిలిచారు. ఇస్లాంలో అయెతే ఒకరిని అన్యాయంగ హింసిస్తే అందరిని హింసించినట్లు అని చెబుతుంది. ఇదే జీవన విధానం మనందరిదీ కావాలి. అప్పుడే ఈ ప్రపంచంలో అందరూ సామరస్యంతో ప్రశాంతంగా సాధారణ జీవితం గడపడం సాధ్యపడుతుంది.

నేటి ఆధునిక సమాజంలో అభివృద్ధి, ప్రగతి అనేవి దోపిడి, హింస వంటి పునాదుపైనే నిర్మితాయ్యాయి. కానీ ఇలాంటిది అభిషణీయం కాదు. నేడు సమాజంలో అనైతికత, అహింస జడులువిప్పి ఉంది. అతి తక్కువ మంది చేతిలో కోట్లాది రూపాయలు ఉంటూ, అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. ఈ ఆర్థిక అసమానతను ఏమనాలి? అన్ని రంగాలలో ఏదో రకమైన హింస, దోపిడి చోటుచేసుకుంటోంది. వినియోగ సంసృతి(కన్జూమరిజం) పెరిగిపోయి క్రోనీ క్యాపిటలిజం రాజ్యమేుతోంది. ఇవన్నీ సమూలంగా మారి గాంధీగారు కలలుకన్న అహింసా రాజ్యం మనకు సిద్ధించాల్సి ఉంది.  -అశోక్‌, హైదరాబాద్‌.

English Translation :

Non-violence is the need of the hour...

Non-violence is not torturing an organism. Torture comes in many forms. It can be mental violence, it can be physical violence. Psychological violence comes down to blaming someone, not talking, keeping them away. No longer does beating, torture, and detention fall under physical violence. Violence includes the husband not talking to his wife, keeping her away, keeping her brother away, and the children not caring for their elderly parents.

It is torture in any way from eccentric to pentagonal organisms. The man must control his tongue. It is not good to hurt the little ones and the weak and hurt their minds. It is not even good to beat the weak, to squander their possessions and money, whether they are strong or not. It is common for some to plunder other people's property as a father without hard work. But that thought is not good.

Some people accumulate money and power just to satisfy their ego. It should also be considered a form of violence.

Not to mention that there is still an atmosphere of violence in our country where saints like Buddha, Mahavira, Nanak, Kabir and Mahatma Gandhi were born. For example, there is a lot of violence going on around us. We continue to see wars, sectarian strife, sectarian strife, class struggles, coups, and honor killings.

We need to move towards a non-violent life, politics, economics and education. It also needs to be taught and practiced by our children. We need to create a society where everyone lives responsibly and responsibly.

Our patriarch Mahatma Gandhi changed the non-violent way of life into his way of life and stood as an ideal for us. In Islam, however, it is said that to torture someone unjustly is to torture everyone. This is the way of life we ​​all want. Only then will it be possible for everyone in this world to live a peaceful and normal life in harmony.

In today's modern society, development and progress are built on the foundations of exploitation and violence. But something like this is not admirable. Immorality and non-violence are rampant in society today. With very few people holding crores of rupees in their hands, the vast majority are languishing in poverty. What about this economic inequality? Some kind of violence and exploitation is taking place in all sectors. Consumerism is on the rise and crony capitalism is on the rise. We have to change all this radically and prepare the non-violent state that Gandhi dreamed of.

Monday, November 16, 2020

సక్సెస్‌ ఫుల్‌ జీవితానికి......! For a Successful Life ......!

సక్సెస్‌ ఫుల్‌ జీవితం గడుపుటకొరకు కొన్ని సూత్రాలు ఎంచుకోవాలి. కొన్ని మంచి ప్రణాళికలు వేసుకోవాలి. కొండను పిండి చేయాల్సిన అవసరం లేదు. హాయిగా జీవితం సాగిపోతుంది. మానసిక ఒత్తిడిని అధిగమిస్తే అన్నింని అధిగమించినట్లే. శారీరకంగా ధృడంగా బలంగా ఉంటే లాభం లేదు. మానసికంగా బలంగా ఉంటేనే అనుకున్నది సాధించవచ్చు.

మీరు ఒకవేళ నాయకుడిగా మారాలంటే దానికోసం సహనం చాలా అవసరం. వాక్చాతుర్యం, మంచిమాట కలుపుగోలుపుతనం, చిరునవ్వు ఇవి అన్ని ఉంటే జన హృదయాలను గెలవవచ్చు. జీరో నుంచి మొదలుప్టిెన తమ ప్రస్థానం హీరోగా ముగించిన నాయకులు చాలా మంది ఉన్నారు.

నిజాయితీ ఉంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అవినీతిలో అశాంతి ఉంటుంది. మనశ్శాంతి దెబ్బతింటుంది.  మనశ్శాంతిని మించిన శాంతి వేరొకి లేదని.

నిమిషాలకు 72సార్లు గుండె కొట్టుకుంటుంది. ఓ గడియారపు ముల్లు నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అంటే కాలం కంటే  వేగంగా మీ గుండె పరుగెడుతుంది. అలాంటప్పుడు మీరు కాలంతో పోటీపడి అభివృద్ధి చెందడం చాలా సులభం.  సమయాన్ని సద్వినియోగం చేసినవారిదే విజయం. డబ్బు సాధించడం ఓ కళ.  అయితే సంపాదించిన డబ్బు ఆదా చేయడం ఓ పెద్ద కళ.  ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ రెండు కళలు చాలా అవసరం.  ఒకటే కళ ఉంటే సరిపోదు. రెండవ కళ చాలా అవసరం. ఆల్‌ ది బెస్ట్‌!!!

For a Successful Life ......!

There are certain principles that must be chosen in order to live a successful life. Make some good plans. No need to grind the hill. Cozy life goes on. Overcoming mental stress is like overcoming everything. There is no gain if you are physically strong and strong. If you are mentally strong, you can achieve what you set out to do.

It takes a lot of patience if you want to become a leader. Eloquence, kindness and smile can win the hearts of the people if they are all there. There are a lot of leaders who start from zero and end their reign as heroes.

To be honest no one needs to be afraid. Note this sentence carefully. There will be unrest in corruption. Peace of mind is damaged. That there is no peace other than peace of mind.

The heart beats 72 times per minute. A clock strikes 60 times per minute. That means your heart beats faster than time. Then it is very easy for you to compete and grow over time. Success is for those who make the most of their time. Making money is an art. But saving money is a big art. Both of these arts are essential for economic recovery. It is not enough to have the same art. The second art is much needed. All the best !!!

Saturday, November 7, 2020

ప్రకృతి వైపు షికారు....!

హైదరాబాద్‌ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే 'సండే మార్కెట్ 'ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్మకాలు అంతగా లేకపోయినప్పికీ, పాత వస్తువుల అమ్మకాలకుపెట్టింది పేరు. 'సండే మార్కెట్' ఉదయం ఆరు గంటలకే జనంతో నిండిపోయింది. ఒక రౌండ్‌ వేసుకొని ఇంటికెళ్ళి పోయాను. శనివారం వేసుకున్న ప్రణాళిక ప్రకారం 'షికారు'కు నేను, నా మిత్రులు మహమూద్‌ ఖాన్‌ ఘోరి, ఇర్షాద్‌ మరియు మోయిన్‌ సాబ్‌ నలుగురం హిమాయత్‌సాగర్‌ సందర్శనకు బయలుదేరాము. దారిలో కిషన్‌బాగ్‌లోని 'హరీదర్గా'కు కూడా వెళ్ళాము. దర్గాలో అద్దాలతో చేసిన డిజైన్‌ చాలా ఆకర్షించింది.

అక్కడి నుండి రాజేంద్రనగర్‌ దాటుకుంటూ హిమాయత్‌సాగర్‌ చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సాగర్‌కు  పక్కనే ఉన్న గుట్టపై కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాము. అది ఆహ్లాదంగా కనిపించింది. నవాబులు నిర్మించిన ఆ హిమాయత్‌ సాగర్‌ను చూడడం నాకు అదే మొదిసారి. అక్కడ మేము సంతోషంగా, ఉల్లాసంగా గడిపాము.  హిమాయత్‌సాగర్‌  కట్టపై నడవడానికి అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. ఏదో పని జరుగుతుందని, అందుకని సందర్శకులను దానిమీదకు రానివ్వటం లేదని తెలిపారు. మేము మాతో తెచ్చుకున్న ఫలహారాన్ని ఆరగించి, సేదతీరి మరలా 2 గంటలకు శంషాబాద్‌ వైపు నుండి హైదరాబాద్‌కు బయలుదేరాము. దారిపొడవున పచ్చదనం, అందమైన రింగు రోడ్డు. చూడడానికి ఆహ్లాదకర వాతావరణం. అది చూడాల్సిందే తప్ప,  వివరించడం కుదరదు.

హైదరాబాద్‌లోకి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసరికి ఆకలి దంచేసింది. హైదరాబాద్‌లో బిర్యాని ఫేమస్‌ హోటల్‌ 'షాగౌస్‌'లో మేము నలుగురం 'బిర్యానీ, మంది (మసాలాతో ఉండని బిర్యాని)' ఆరగించేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. 

ఇంటికి చేరుకొనేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఈ విధంగా ఆదివారం అంతా  ప్రకృతి లో షికారు చేసేందుకు అవకాశం దొరికింది. దానికి సంబంధించిన చిత్రాలు మీరు చూడవచ్చు..  - కరీంఖాన్‌, హైదరాబాద్‌

Thursday, October 29, 2020

చెరువుల నగరం City of Lake



 చెరువుల నగరం City of Lake
మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....!

వర్షం ఆధారంగా నీరు భూమి పైకి చేరుతుంది. భూమిలోకి ఇంకి భూమిలోపలికి చేరుతుంది. మరి వర్షం తర్వాత నీరు కావాలంటే నీరును నిల్వ చేసుకోవాలి. అలా ఆలోచనతోనే “చెరువులు” ఏర్పడ్డాయి. వర్షం ద్వార నీరును చెరువుల్లో Tank నిలువ చేస్తారు.  ఆ నీటిని త్రాగడానికి, పంట పొలాలకు వినియోగిస్తారు.

భారతదేశంలోని గ్రామాలు నీటి కోసం ఎక్కువగా చెరువుల మీదనే ఆధారం.  పూర్వకాలంలో రాజులూ, చక్రవర్తులు, నవాబులు ప్రజల అవసరాల కోసం చెరువులు త్రవెంచేవారు. అందులో మంచి నీటి చెరువులు, ఊర చెరువులు అని రెండు రకాలు.

చెరువులు Cheruvulu :


తెలంగాణాలో ఎక్కువగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అంటే ఒక చెరువు నిండితే, దాని నీరు మరో చెరువుకు అలుగు ద్వరా పోతుంది. అది నిండితే మరో చెరువుకు పోతుంది. దేనినే గొలుసుకట్టు చెరువులు అంటారు. వీటికి అనుబంధంగా కుంటలు, కాలువలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి తుములుంటాయి. ఈ విధానం మన తెలంగాణాలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు.  వర్షా కాలంలో చెరువులు నిండితే మిగిలిన నీరు బయటకు విడిచి పెట్టడానికి “కలుజులు” ఉంటాయి.  ఇవి నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.

చెరువుల నగరం City of Lake

మన హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 3000 నుండి 7౦౦౦  వరకు చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు మనకు కానరావు. అందులో కొన్ని ఎప్పుడో కనుమరుగాయై. వర్షం పడ్డప్పుడే అవి మనకు మునిగిన కాలనీల రూపంలో కానవస్తాయి. అందులో ఇప్పుడు 70 నుండి 500 వరకు ప్రభుత్వ లెక్కలో ఉన్నాయి.  కొన్ని ఇప్పటికి వాటి పేర్లు మాత్రం నిలిచాయి. నవాబ్ సబ్ కుంట, తీగల కుంట, అఫ్జాల్సాగర్, నల్లకుంట,మాసాబ్ ట్యాంక్ ఇవి అప్పటి కుంటలే. ఎన్నో చెరువులు ఆక్రమణలకు, చెత్త వేయడానికి, రియల్ ఎస్టేట్ తో చెరువులను కనుమరుగు చేసి.....నేడు హైదరాబాద్ కు వరదలు రావడానికి కారణాలుగా మారాయి.

 2010 నాటికి 500 సరస్సులు హుడా పరిధిలో ఉన్నాయి. మే 2018 నాటికిహుడా 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డును కలిగి ఉంది. వీటిలో 62 సరస్సులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి.
 వీటిలో చాలావరకు కుతుబ్ షాహీ రాజులూ, నవాబులు హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించబడ్డాయి.

English Translation :

City of Ponds City of Lake

Water is essential for human life and for living things. But the question is where does this water come from? Rain ....!

Water rises above the ground based on rainfall. Into the earth and into the earth. If you want water after rain, you have to store water. With that in mind, "ponds" were formed. Tanks store water in ponds through rain. That water is used for drinking and for crop fields.

Villages in India rely heavily on ponds for water. In ancient times kings, emperors and Nawabs used to dig ponds for the needs of the people. There are two types of fresh water ponds and settlement ponds.

Ponds Cheruvulu:

There are mostly chain ponds in Telangana. This means that if one pond fills up, its water will flow to another pond. If it fills up it will go to another pond. Anything is called chain ponds. These are accompanied by lairs and canals. Sneeze to control them. This policy is not found anywhere else in the world except in our Telangana. If the ponds fill up during the rainy season, there will be "drains" to release the remaining water. These protect the filled ponds from being cut off.

City of Ponds City of Lake :

There are about 3000 to 7000 ponds, lairs and reservoirs around our city of Hyderabad. But they never happen to us. Some of it ever disappeared. When it rains they do not come to us in the form of submerged colonies. Of that, 70 to 500 are now in government accounting. Some still have their names. Nawab Sub Kunta, Thigala Kunta, Afzalsagar, Nallakunta and Masab Tank were the then Kuntas. Many ponds have become the cause of encroachments, dumping of garbage, disappearance of ponds with real estate ..... floods in Hyderabad today.

 As of 2010, 500 lakes are under Hooda. As of May 2018, Hooda has a record of 169 lakes covering more than 10 hectares. Of these, 62 lakes are under government control.

 Most of these were built by the Qutb Shahi kings and Nawabs for the water needs of the people of Hyderabad.

Friday, October 23, 2020

ధైర్యవంతుడే సాధించగలడు...! Only the brave can achieve ...!

పాజిటివ్‌ positive ఆలోచనలు, పట్టుదల ఉన్నవారిదే ఈ ప్రపంచం.  దృఢ సంకల్పంతోపాటు,సహనం ముఖ్యం. ఆ సహనంతో ముందుకు వెళితే ఇక సాధించలేనిది ఏమీ ఉండదు. ఆవేశం అనేది మీ వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆవేశంతో ఏమీ సాధించలేరు! నష్టాలే చవిచూడవలసి వస్తుంది. మనకు ఇష్టమైన పని మనసు పెట్టి చేస్తే తప్పక సఫలురు అవుతారు. ధర్మం, న్యాయంతో నడిస్తే ఎన్ని ఆపదలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారనేది సత్యం. ఎన్ని ఆపదలు వచ్చినా ఆదుకునేవారు మీ వెంటనే ఉంటారు. ఆలస్యమైనా విజయం మీదే.

మనశ్శాంతిని మించిన శాంతి ఈ ప్రపంచంలో లేదు. ఒకవేళ అది కరువైతే మీరు ఏ పనీ ఏకాగ్రతతో చేయలేరు. విజయం సాధించలేరు. భావితరాల వారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు ప్రభావితం కావాలి. అలాంటి  పట్టుదలతో శ్రమించండి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని మీ ముందు తరాల వారు నిరూపించారు.

'డిప్రెషన్‌' పదం మిమ్మల్ని మీ జీవితాన్ని కకావికలం చేస్తుంది. ఎలాగైతే సముద్రంలో డిప్రెషన్‌ వచ్చి తుఫానులా మారి ఎలా అల్లకల్లోలం చేస్తుందో, అలాగే మానవుడు డిప్రెషన్‌కు గురైనప్పుడు దాని ప్రభావం శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అసాధ్యులు...... సాధ్యులు కావాలి Impossible ...... should be possible 

సాధ్యమైనంత వరకు (Depression)  డిప్రెషన్‌కు గురైనప్పుడు ధ్యాన సముద్రంలో మునిగిపోవాలి. తమకు తాము ఏదో ఒక పనిలో లీనమైపోవాలి. అది మిమ్మల్ని అటాక్‌ చేయకముందే దాన్ని  అధఃపాతాళానికి అణగద్రొక్కండి. అప్పుడే మీరు ఏదైనా సాధించగలరు.  అసాధ్యులు కావద్దు. సాధ్యులు కావాలి. అజేయులుగా మిగలాలి. గజం భూమికోసం పోరాటాలు, జగడాలు జరుగుతున్నాయి. మీరు ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ గజం భూమి తీసుకొచ్చారా? లేదు కదా! మరి ఎందుకు ఈ వైషమ్యాలు.

దేశ భవిష్యత్తు యువతపై..... the future youth of the country

దేశ భవిష్యత్తు ఆ దేశ యువతపై ఆధారపడి ఉంటుంది. కానీ మత్తుకు బానిసై తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దు. ఆధునిక యుగంలో ఉన్నాం. సాధించేది ముందు ఎంతో ఉంది.  సాధించవచ్చు- శాసించవచ్చు అనే సంగతిని గుర్తుంచుకోండి.

ముందుగా మీరు ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక నాయకున్నో, వైజ్ఞానికున్నో లేదా సక్సెస్‌ వ్యాపారవేత్తనో మీకు నచ్చిన వారినెవరినైనా తీసుకుని ఆదర్శంగా తీసుకుని సాగిపోతే మీరు అజేయులుగానే మీ జీవన ప్రస్థానం ముగిస్తారనేది వాస్తవం. అనామకులుగా మీ ప్రస్థానం ముగించకండి. ఆకాశమే హద్దుగా చెలరేగవచ్చు. ఆ శక్తి ఇచ్చాడు దేవుడు మానవునికి. మిమ్మల్ని మీరు గుర్తించుకోండి.      - అజ్మత్‌ ఖాన్‌, హైదరాబాద్‌

 

English Translation :

Only the brave can achieve ...!

This is a world of positive thoughts and perseverance. In addition to determination, patience is important. Going forward with that patience there will be nothing more unattainable. Anger can seriously damage your personality. Nothing can be achieved with rage! Will have to bear the losses. We must succeed if we keep in mind our favorite work. The truth is that if you walk with virtue and justice, you will face any dangers and move forward with ease. No matter how many dangers come, those who support you will be with you immediately. Late success is yours.

There is no peace in this world beyond peace of mind. If it is dry you can not do any work with concentration. Can not succeed. Future generations should take you as an ideal. They need to be affected. Work hard with such perseverance. Your predecessors have proven that hard work pays off.

The word 'depression' can make your life miserable. However, depression in the ocean can turn into a hurricane and can have a devastating effect on human organs when it comes to depression.

Impossible ...... should be possible

Whenever possible you should have all four of these components in place for launch to maximize profits. They have to immerse themselves in something. Destroy it into the abyss before it attacks you. Only then can you achieve anything. Not impossible. Want possible. Must remain invincible. Fights and battles are going on for yard land. Did you bring that yard land when you came into this world? Nope! And why these conflicts.

On the future youth of the country .....

The future of the country depends on the youth of that country. But do not let the drug addicts ruin their future by hand. We are in the modern age. There is so much to achieve before. Remember that achievable- can be ruled.

First you have to take someone as an ideal. The fact is that you're going to end your life as an invincible if you take on the ideal of being a leader, a scientist, or a successful entrepreneur. Do not end your reign as anonymous. The sky is the limit. God gave that power to man. Identify yourself.

Tuesday, October 20, 2020

హైదరాబాద్‌ను కాపాడుతున్న మూసీ...!

జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి.  జీవ నదులైన గంగా, యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్నో నగరాలు వెలిసాయి.

హైదరాబాద్‌ నగరం మధ్య నుండి ప్రవహించేదే మూసీ నది

కృష్ణా ఉపనదులలో మూసీ నది ఒకటి. హైదరాబాద్‌ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ ,  సుమారు 120 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు  హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది.  అప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చెయాలని వరదల నుండి నగరాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో  హైదరాబాద్‌ నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  సాంకేతిక నిపుణుడు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాయత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.  1920లో మూసీ నదిపై నగరానికి వెలుపల ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ అనే రెండు జలాశయాలు నిర్మించారు. ఈ రెండు జలాశయాల వల్లే మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుతూ, నగరానికి అవసరమైన మంచి నీటి అవసరాన్ని తీరుస్తున్నాయి.

అయితే.... మూసీ మురికి కాలువ

నేడు మూసీ నది అంటేనే  మురికి కాలువ అనే భ్రమలో నగరవాసులు ఉన్నారు. ప్రస్తుతం దాని స్థితి ఆ విధంగా తయారైంది. హైదరాబాద్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పరిశ్రమలలోని వ్యర్ధ నీరంతా ఈ మూసీలోనే వదులుతున్నారు.  దీంతో ఇది ఒక మురికి కాలువ స్థాయిలో చేరిపోయింది.

వర్షం అంటేనే భయం

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో నగర వెలుపల ఉన్న చెరువులు నిండి...నీరు వెళ్ళే దారిలేక కాలనీల వైపు మళ్ళడంతో హైదరాబాద్‌లో అపార ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం కూడా జరిగింది. నగర ప్రజలు వర్షం అంటేనే భయపడుతున్నారు.

Wednesday, October 14, 2020

ఆసియాలోనే పెద్ద చెరువు నిండింది Biggest Lake in Asia

మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము.

కంభం చెరువు (Cumbum Lake)


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి ఆనుకొనే ఉంది ఈ చెరువు. ఇది
15 శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని మహారాణి వరదరాజమ్మ గారు గుండ్లకమ్మ నది ఆనుకొనే ఈ చెరువు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇది ఆసియాలోనే పేరుగాంచిన పెద్ద చెరువులలో ఇది ఒకటి . దీని చుట్టూ సహజ సిద్ధమైన కొండలు ఉండడంతో ఒక ఆనకట్టతో దీని నిర్మాణం జరిగింది. అప్పట్లోనే ఈ చెరువు ఆనకట్ట ఎత్తు 57 అడుగులు. అందువల్ల ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా చెరువు నిండడానికి ఉపయోగపడుతుంది.

పిక్నిక్‌ స్పార్ట్ (Picnic Spot)

ఆసియాలోనే పెద్ద చెరువు కాబట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.  ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ చెరువు కు  కాస్త నీరు చేరుతుంది. అయితే ఈ సంవత్సరం  నిండుకుండలా నిండిపోవడంతో చూడడానికి సందర్శకులు వేల సంఖ్యలో వస్తున్నారు. అయితే ప్రభుత్వపరంగా ఎటువంటి వసతులు లేకపోయినప్పటికి సందర్శకులు తాకిడి ఎక్కువే. ఇక్కడికి చేరడానికి  సమీపంలో గుంటూరు-నంద్యాల రైల్వే లైన్‌లో  కంభం రైల్వేస్టేషన్‌, బస్‌ ద్వారా కూడా చేరుకోవచ్చు.

నిండుకుండలా మారిన కంభం చెరువు (Fulfill Cumbum Lake)

ఈ సంవత్సరం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కంభం చెరువు నేడు నిండుకుండలా మారింది. సందర్శకులు ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని చూడడానికి వేల సంఖ్యలో వస్తున్నారు.


ఈ చెరువు నిండడం అంటే... కంభం చుట్టుప్రక్కల మండలాల రైతులకు ఎంతో సంతోషకరమైన వార్త. మీకు వీలుంటే వీకెండ్ లో ఒకసారి వెళ్లి రావచ్చు. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.

Tuesday, October 13, 2020

జగమంతా స్మార్ట్

 ఒకప్పుడు ఎవరినైనా చూసినట్లయితే ఆహా ఎంత స్మార్ట్ గా ఉన్నాడు అంటాము.. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇదివరకు ఈ స్మార్ట్ ఫోన్ కొంతమంది వరకే పరిమితమై ఉండేది అది కూడా ధనవంతుల్లో సెలబ్రిటీలలో మాత్రమే. 

అయితే ప్రస్తుతం స్మార్ట్ టీవీల యుగం ప్రారంభమైంది. ఈ ప్రకటన చూసిన ఏ పత్రిక చూసినా స్మార్ట్ టీవీ ల ప్రకటనలే వస్తున్నాయి. వాట్ స్మార్ట్ ఫోన్ లో స్థానంలో ఎప్పుడు స్మార్ట్ టీవీలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి. ఇందులోనే బ్రౌజర్ గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ప్రతిదీ చూసుకోవడానికి ఈ స్మార్ట్ టీవీలు చాలా అవసరం. దీంతో డాటా స్మార్ట్ ఫోన్ లోకి లకు మాత్రమే కాకుండా  టీవీ లో కూడా అవసరం అయ్యింది. ప్రతి ఇంట్లో నాలుగు ఫోన్లు ఒక స్మార్ట్ టీవీ దీంతో ఖర్చు పెరిగి చాటంత అవుతుంది.

ప్రస్తుత మహమ్మారి కరోనా వల్ల కాలేజీలు స్కూల్ ఆఫీసులు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇంటి వద్దనే అందరూ డాటా రూపములో డబ్బును ఖర్చు చేస్తున్నారు. 

స్కూల్లో కాలేజీలు డిజిటల్ క్లాసులు అని పిల్లలతో స్మార్ట్ ఫోన్ లను స్మార్ట్ టీవీ లను చూసే విధంగా అలవాటు ప్రారంభించాయి. ఎప్పుడు టివి ముఖం చూడని వారు కూడా స్మార్ట్ టీవీలు తెచ్చి ఇంటిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక విధంగా డిజిటల్ మార్కెటింగ్ పెరిగిందనే చెప్పవచ్చు. సెల్యులార్ కంపెనీలు డాటాను పోటీపడి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. 

నేడు అత్యవసరం స్థానంలో స్మార్ట్ ఫోన్ స్మార్ట్ టీవీ సంపాదించాలి అని అనుకోవచ్చు. నువ్వు లేనిదే నేను లేను అని ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. రాబోయే డిజిటల్ యుగంలో వీటి తరువాత ఏది ఆక్రమిస్తోంది ఇక కాలమే చెప్పాలి.

More Post's...