Tuesday, February 22, 2022

మార్కెటింగ్‌ గోల్స్‌.....

మార్కెటింగ్‌ గోల్స్‌.....
రియల్‌ ఎస్టేట్‌ డౌన్‌ అయిపోయింది? పడిపోయింది... అంటాము. కానీ ఎప్పుడూ కూడా రియల్‌ ఎస్టేట్‌ పడిపోదు... కేవలం అప్‌ & డౌన్‌ అవుతుంటుంది. డౌన్‌ అయ్యే ఛాన్స్‌ ఉండదు. కరోనాతో లాక్‌డౌన్‌ వల్ల చాలా కంపెనీలు ఇప్పుడు స్పెషల్‌ ఆఫర్స్‌ ప్రకటిస్తున్నాయి. అందుకు ఆన్‌లైన్‌ గానీ, ఆఫ్‌ లైన్‌ గానీ మార్కెటింగ్‌ చాలా అవసరం. ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌లో ఎన్నో అఫర్స్‌ ఉన్నాయి. డిఫెరెంట్‌ స్టయిల్‌లో మార్కెటింగ్‌ చేయాలి. ఇందుకు ఆన్‌లైన్‌ సర్వీసులు చాలా ఉన్నాయి. న్యూ జనరేషన్‌ ఆన్‌లైన్‌ అవకాశాలు ఏమిటో చూద్దాం. రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ వెబ్‌సైట్స్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఎస్‌.ఎమ్‌.ఎస్‌. మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వాట్స్‌ప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, షాట్‌ విడియోస్‌, బ్లాగ్స్‌, గుగూల్‌ యాడ్స్‌ వంటి ఆన్‌లైన్‌ పద్ధతులో సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంది & మీ గోల్స్‌ కూడా రీచ్‌ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెటింగ్‌ టీమ్‌ ఆల్‌ దబెస్ట్‌.

Wednesday, August 25, 2021

ఈరోజు ఉదయం చార్మినార్ దృశ్యం

ఈరోజు ఉదయం ఫజ్ర్ నమాజ్ తర్వాత మా శ్రేయోభిలాషి మోయిన్ గారు చార్మినార్ అందాన్ని తమ సెల్ ఫోన్ తో చిత్రీకరించారు.

Friday, June 18, 2021

వ్యాక్సిన్ చైతన్య రథం

 


అదనపు డీజీ, ట్రాఫిక్ పోలీస్ అదనపు ఇంచార్జి కమి షనర్(హైదరాబాద్) అనిల్ కుమార్ చార్మినార్ వద్ద కోవిడ్ 19 వాక్సినేషన్  చైతన్య వ్యాన్కు జెండా ఊపి ఆరంభించారు. ఈ వేడుకకు డీసీపీ గజరాజ్ రావు (భోపాల్ ఐ పి ఎస్, ఎస్జెడ్), కె . బాబు రావు, ఎస్పి, (ఆ ప్ర) , బి ఆర్ నాయక్, ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమి షనర్ కూడా హాజరయ్యారు. వాక్సినేషన్ గురించి ప్రజలలో వీలైనంత త్వరగా చైతన్యం కలిగించేందుకు మెహర్  ఆర్గనైజేషన్స భ్యులు  అఫ్ఫాన్ ఖా ద్రి , ఎండి ఫరూఖ్, ఎం డి లతీఫ్, హస్సన్  ఖాద్రి, జోహెబ్ అహ్మద్, ఎం డి  సోహైల్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.



Saturday, June 12, 2021

మానవత్వపు సంస్థ

Jih human help

సమాజ  సమాజసేవలో పాలుపంచు కొన్న సంస్థలు ఉన్నాయి. అయితే మానవత్వం తో నేడు భారతదేశమంతటా చేస్తున్న సేవకు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే జమాతే ఇస్లామి హింద్ . ప్రస్తుతం ఈ కొవిడ్-19 కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సంస్థ సభ్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది . karoona పీడితులకు వారు చేస్తున్న సేవ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేవలం దైవ భీతితో దైవ ప్రసన్నత కోసం మానవత్వంతో కుల మత వర్గ వర్ణ విభేదాలు చూపకుండా వాళ్లు చేస్తున్న సేవ అందరికీ తెలిసిందే . సామాజిక మాధ్యమాలలో వారి సేవలు మనం వీడియో రూపంలో ఎందరఆదర్శం గా ఉన్నాయి .ఈ మహమ్మారి వల్ల నా అన్న వారే దూరమవుతున్న నేడు ఎందరికో ఆదర్శం కూడా.



Wednesday, April 21, 2021

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ

 చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది  రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.

Wednesday, February 17, 2021

పేదవాడి బిర్యానీ


 ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పని మీద సండే రోజు బయటికి వెళ్లినప్పుడు ఈ బ్యానర్ నా కంట పడింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని అబ్దుల్ గంజి  బస్టాండ్ లో పది రూపాయలకే వెజ్ బిర్యాని లభిస్తుంది ఇది నిజంగా గ్రేట్ 10 రూపాయలకే వెజ్ బిర్యానీ తినే సౌభాగ్యం మన హైదరాబాద్లోనే సాధ్యం . ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే మీరు కూడా ఆ రుచి చూడండి ఒకసారి.

Wednesday, January 6, 2021

సరిగమలు Musical night

 ఈరోజు మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి అజ్మత్ ఖాన్  తమ బ్రదర్స్ తో పాడిన సరిగమ మ్యూజికల్ నైట్ షో.




More Post's...