Saturday, June 12, 2021

మానవత్వపు సంస్థ

Jih human help

సమాజ  సమాజసేవలో పాలుపంచు కొన్న సంస్థలు ఉన్నాయి. అయితే మానవత్వం తో నేడు భారతదేశమంతటా చేస్తున్న సేవకు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే జమాతే ఇస్లామి హింద్ . ప్రస్తుతం ఈ కొవిడ్-19 కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సంస్థ సభ్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది . karoona పీడితులకు వారు చేస్తున్న సేవ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేవలం దైవ భీతితో దైవ ప్రసన్నత కోసం మానవత్వంతో కుల మత వర్గ వర్ణ విభేదాలు చూపకుండా వాళ్లు చేస్తున్న సేవ అందరికీ తెలిసిందే . సామాజిక మాధ్యమాలలో వారి సేవలు మనం వీడియో రూపంలో ఎందరఆదర్శం గా ఉన్నాయి .ఈ మహమ్మారి వల్ల నా అన్న వారే దూరమవుతున్న నేడు ఎందరికో ఆదర్శం కూడా.



Wednesday, April 21, 2021

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ

 చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది  రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.

Wednesday, February 17, 2021

పేదవాడి బిర్యానీ


 ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పని మీద సండే రోజు బయటికి వెళ్లినప్పుడు ఈ బ్యానర్ నా కంట పడింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని అబ్దుల్ గంజి  బస్టాండ్ లో పది రూపాయలకే వెజ్ బిర్యాని లభిస్తుంది ఇది నిజంగా గ్రేట్ 10 రూపాయలకే వెజ్ బిర్యానీ తినే సౌభాగ్యం మన హైదరాబాద్లోనే సాధ్యం . ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే మీరు కూడా ఆ రుచి చూడండి ఒకసారి.

Wednesday, January 6, 2021

సరిగమలు Musical night

 ఈరోజు మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి అజ్మత్ ఖాన్  తమ బ్రదర్స్ తో పాడిన సరిగమ మ్యూజికల్ నైట్ షో.




Sunday, December 13, 2020

నలమల టూర్‌ Nalamala tour

అందరికీ తెలిసి, కొందరికి తెలియని విషయం ఏమిటంటే.... ఇది పెళ్ళిళ్ళ సీజన్‌. రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. వృత్తి రీత్యా నేను వెడ్డింగ్‌ కార్డు డిజైనర్‌ కాబట్టి సీజన్లో ఎడతెరిపి లేకుండా వర్క్‌ నడుస్తుంది. పని వత్తిడి వల్ల మానసికంగా కాస్త విశ్రాంతి కావాలనే కోరిక ఎక్కడో మూల పుట్టింది. 

ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్‌ కూడా నేనే చేయాల్సి వచ్చింది.  అయితే,  ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్‌ సాబ్‌, ఇర్షాద్‌, ఘోరి ఖాన్‌ ని కూడా వెంట తీసుకెళ్ళాను. 

నలుగురం 3 రోజుల టూర్‌ను సెట్‌ చేసుకొని డిసెంబర్‌ 9,10,11 లలో అక్కడ చూడవలసిన ప్రదేశాలను, నలమల అడవి అందాలను ఆస్వాదించవచ్చునని ఆశతో ఎంతో ఉల్లాసంగా, హాయిగా ఈ మూడు రోజులు మా పనులను పక్కనబెట్టి మా ఊహాలలో తెలిపోయాము.


ఆ మూడు రోజుల ఫోటోలను మీతో షేర్‌ చేసుకుంటున్నాను. మీరూ చూడండి. ఆఁ... గతంలో కంభం  చెరువు గురించి మీకు తెలియజేసానుకుంటా... ఆ అక్కడకు కూడా వెళ్ళాము. చూడండి. - కరీంఖాన్‌, హైదరాబాద్‌. 
English Translation:
Nalamala Tour What everyone knows, what some people don't know is that .... it's wedding season‌. Weddings are in full swing in the two Telugu states. Professionally I am a wedding card designer so the season runs the workshop without a hitch.

కంభం cheruvu
The urge to relax mentally due to work pressure has taken root somewhere. At this point my niece got married. I also had to do the card design myself.
కంభం చేరువు బోర్డు
However, with the desire to go to this wedding I went on doing their chores a bit faster that day. Our niece's wedding was in the town of Giddaluru in the Nallamala forest, so I took my well - wishers, friends Moin Saab, Irshad and Ghori Khan with me to the wedding.
The four of us set out on a 3 day tour and in December 9,10,11 we set aside our work for these three days in the hope that we could see the places to see and enjoy the beauty of the Nalamala forest.
I will share those three days photos with you.

See for yourself. Um ...
I just wanted to let you know about the Cumbum pond in the past ...
we went there too. See.

Thursday, December 3, 2020

బీదవాడిగా పుట్టడం తప్పుకాదు...It is not Mistake to be born poor ...

అక్వేరియంలో రకారకాల రంగుల చేపలు ఎంత ప్రశాంతంగా ఉల్లసంగా విహరిస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? మీ మనసును కూడా అలా ఉంచడానికి ప్రయత్నించండి.  ప్రతి వర్క్ఆరంభంతో సహా అంతం కూడా  ఉంటుంది. ఆరంభం ఎలా ఉన్నా- అంతం మాత్రం మంచిగా ఉండాలి. ఒక విజయంతో ముగియాలి. తమకు తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీలో ఏదైనా అంగవైకల్యం ఉందా లేదు కదా! అంగవైకల్యం ఉన్నవారే, ఎన్నో రంగాలలో తమ తమ నైపుణ్యం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకైతే ఏలాంటి  అంగవైకల్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. అయినా మీరు అభివృద్ధి చెందడం లేదంటే అది మీ స్వయం కృపరాధమే.

నా అదృష్టం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేను అనే భావన రాకూడదు. సకల అంగాలు మీలో సక్రమంగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ముందుకు సాగాలి. చేయల్సినదేదో చేసి చూపాలి. ప్రయత్నమే పురుష లక్షణ మంటారు. కానీ మహిళలు కూడా పురుషులను అధిగమిస్తున్నారు. గమనించండి. మీలో నిద్రిస్తున్న మనిషిని బయటకు లాగండి. తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. అన్ని మీలో ఉన్నాయి - మీరు సమర్ధులు. ఏదైనా చేయగల సత్తా ఉంది మీకు. అలాంటప్పుడు మీరు వెనుకంజ వేయడం సమంజసం కాదు.

 ఇదంతా రాస్తున్నది మానసిక వ్యక్తిత్వ వికాసానికే. మానసిక వ్యక్తిత్వ వికాసం వికసించిందనుకోండి - ఇక విజయం మీదే. ఎలాగైతే ఓ మొగ్గ వికసించి పుష్పంగా మారి సువాసన వెదజల్లుతుందో!  

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.                                                     - అజ్మత్‌ఖాన్‌, హైదరాబాద్‌

It is not wrong to be born poor ...

Have you ever noticed how calm and merry the colorful fish in the aquarium are? Try to keep your mind that way too. There will also be an end, including the beginning of each workshop. No matter the beginning- the end must be good. Should end with a victory. Do not underestimate themselves. 

Do you have any disabilities? People with disabilities continue to demonstrate their expertise in many fields. You have no disability. Are healthy. If you do not thrive, however, it is your own fault. This is my luck, I should not feel that I can do nothing anymore. When all the limbs are regular in you you should go ahead and thank God for that. Do what needs to be done and show it. Attempt is called masculinity. But women also outnumber men. Note. Pull out the sleeping man in you. Anything can be done if it comes to mind. Can show the world. All are in you - you are capable. You have the ability to do anything. In that case it does not make sense for you to lag behind. 

All this is written for the development of mental personality. As mental personality development flourishes - success is yours. However, a bud blossoms into a flower and the fragrance dissipates!

 

Saturday, November 28, 2020

అహింస నేటి ఆవశ్యకత (Non-violence is the need of the hour...)

ఒక జీవిని హింసించకపోవడమే అహింస. హింసించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అది మానసిక హింస కావొచ్చు, శారీరక హింస కావొచ్చు. ఒకరిని దూషించడం, మాట్లాడకపోవడం, దూరంగా ఉంచడం వంటిది మానసిక హింస కిందికి వస్తుంది. ఇక కొట్టడం, చిత్రవధ చేయడం, నిర్బంధించడం శారీక హింస కిందికి వస్తుంది. భర్త భార్యతో మాట్లాడకపోవడం,దూరంగా ఉంచడం, అన్న తమ్ముడిని దూరంగా ఉంచడం, కన్నబిడ్డలు ముసలి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వంటివన్నీ హింస కిందికే వస్తాయి. 
ఏకేంద్రీయం నుంచి పంచేంద్రీయ జీవులలో ఏ విధంగా హింసించినా అది హింసే అవుతుంది. మనిషి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. చిన్నవారిని, బలహీనులను ఎలాపడితే అలా దూషించడం, వారి మనస్సును గాయపరచడం మంచిది కాదు. బలముంది కదా అని బలహీనులను కొట్టడం, వారి ఆస్తిపాస్తులు, డబ్బుదస్కం కాజేయడం కూడా మంచిది కాదు. కష్టపడకుండా అప్పనంగా ఇతరుల ఆస్తిపాస్తులు కాజేయడం కొందరికి మామూలే. కానీ ఆ ఆలోచనే మంచిది కాదు.
కేవలం తమ అహాన్ని సంపూర్తి చేసుకునేందుకుగాను ధనాన్ని, అధికారాన్ని కొందరు పోగుచేసుకుంటుంటారు. ఇది కూడా ఒక రకమైన హింసే  అనుకోవాలి. 
బుద్ధుడు, మహావీర్‌, నానక్‌, కబీర్‌, మహాత్మా గాంధీ వంటి పుణ్యపురుషులు జన్మించిన మన దేశంలో నేటికీ హింసాత్మక వాతావరణం ఉందని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగా మన చుట్టూ అనేకం హింస జరుగుతున్నాయి. యుద్ధాలు , మతకల్లోలాలు , కులఘర్షణలు, వర్గపోరాటాలు, మూకదాడులు, పరువు హత్యలు  వంటివి మనం చూస్తూనే ఉన్నాం. 
మనం అహింసతో కూడిన జీవితం, రాజకీయాలు , ఆర్థికవిధానం, విద్యావిధానం వైపు అడుగులేయాల్సి ఉంది. ఇది మన పిల్లలకు కూడా నేర్పించి అలవాటుచేయాల్సి ఉంది. అందరూ బాధ్యతాయుతంగా, జవాబు దారీతనంతో జీవించే సత్సమాజంను మనం రూపొందించుకోవాల్సి ఉంది. 
మన జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గాన్నే తన జీవన విధానంగా మార్చుకుని మనకు ఆదర్శంగా నిలిచారు. ఇస్లాంలో అయెతే ఒకరిని అన్యాయంగ హింసిస్తే అందరిని హింసించినట్లు అని చెబుతుంది. ఇదే జీవన విధానం మనందరిదీ కావాలి. అప్పుడే ఈ ప్రపంచంలో అందరూ సామరస్యంతో ప్రశాంతంగా సాధారణ జీవితం గడపడం సాధ్యపడుతుంది.

నేటి ఆధునిక సమాజంలో అభివృద్ధి, ప్రగతి అనేవి దోపిడి, హింస వంటి పునాదుపైనే నిర్మితాయ్యాయి. కానీ ఇలాంటిది అభిషణీయం కాదు. నేడు సమాజంలో అనైతికత, అహింస జడులువిప్పి ఉంది. అతి తక్కువ మంది చేతిలో కోట్లాది రూపాయలు ఉంటూ, అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. ఈ ఆర్థిక అసమానతను ఏమనాలి? అన్ని రంగాలలో ఏదో రకమైన హింస, దోపిడి చోటుచేసుకుంటోంది. వినియోగ సంసృతి(కన్జూమరిజం) పెరిగిపోయి క్రోనీ క్యాపిటలిజం రాజ్యమేుతోంది. ఇవన్నీ సమూలంగా మారి గాంధీగారు కలలుకన్న అహింసా రాజ్యం మనకు సిద్ధించాల్సి ఉంది.  -అశోక్‌, హైదరాబాద్‌.

English Translation :

Non-violence is the need of the hour...

Non-violence is not torturing an organism. Torture comes in many forms. It can be mental violence, it can be physical violence. Psychological violence comes down to blaming someone, not talking, keeping them away. No longer does beating, torture, and detention fall under physical violence. Violence includes the husband not talking to his wife, keeping her away, keeping her brother away, and the children not caring for their elderly parents.

It is torture in any way from eccentric to pentagonal organisms. The man must control his tongue. It is not good to hurt the little ones and the weak and hurt their minds. It is not even good to beat the weak, to squander their possessions and money, whether they are strong or not. It is common for some to plunder other people's property as a father without hard work. But that thought is not good.

Some people accumulate money and power just to satisfy their ego. It should also be considered a form of violence.

Not to mention that there is still an atmosphere of violence in our country where saints like Buddha, Mahavira, Nanak, Kabir and Mahatma Gandhi were born. For example, there is a lot of violence going on around us. We continue to see wars, sectarian strife, sectarian strife, class struggles, coups, and honor killings.

We need to move towards a non-violent life, politics, economics and education. It also needs to be taught and practiced by our children. We need to create a society where everyone lives responsibly and responsibly.

Our patriarch Mahatma Gandhi changed the non-violent way of life into his way of life and stood as an ideal for us. In Islam, however, it is said that to torture someone unjustly is to torture everyone. This is the way of life we ​​all want. Only then will it be possible for everyone in this world to live a peaceful and normal life in harmony.

In today's modern society, development and progress are built on the foundations of exploitation and violence. But something like this is not admirable. Immorality and non-violence are rampant in society today. With very few people holding crores of rupees in their hands, the vast majority are languishing in poverty. What about this economic inequality? Some kind of violence and exploitation is taking place in all sectors. Consumerism is on the rise and crony capitalism is on the rise. We have to change all this radically and prepare the non-violent state that Gandhi dreamed of.

Monday, November 16, 2020

సక్సెస్‌ ఫుల్‌ జీవితానికి......! For a Successful Life ......!

సక్సెస్‌ ఫుల్‌ జీవితం గడుపుటకొరకు కొన్ని సూత్రాలు ఎంచుకోవాలి. కొన్ని మంచి ప్రణాళికలు వేసుకోవాలి. కొండను పిండి చేయాల్సిన అవసరం లేదు. హాయిగా జీవితం సాగిపోతుంది. మానసిక ఒత్తిడిని అధిగమిస్తే అన్నింని అధిగమించినట్లే. శారీరకంగా ధృడంగా బలంగా ఉంటే లాభం లేదు. మానసికంగా బలంగా ఉంటేనే అనుకున్నది సాధించవచ్చు.

మీరు ఒకవేళ నాయకుడిగా మారాలంటే దానికోసం సహనం చాలా అవసరం. వాక్చాతుర్యం, మంచిమాట కలుపుగోలుపుతనం, చిరునవ్వు ఇవి అన్ని ఉంటే జన హృదయాలను గెలవవచ్చు. జీరో నుంచి మొదలుప్టిెన తమ ప్రస్థానం హీరోగా ముగించిన నాయకులు చాలా మంది ఉన్నారు.

నిజాయితీ ఉంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అవినీతిలో అశాంతి ఉంటుంది. మనశ్శాంతి దెబ్బతింటుంది.  మనశ్శాంతిని మించిన శాంతి వేరొకి లేదని.

నిమిషాలకు 72సార్లు గుండె కొట్టుకుంటుంది. ఓ గడియారపు ముల్లు నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అంటే కాలం కంటే  వేగంగా మీ గుండె పరుగెడుతుంది. అలాంటప్పుడు మీరు కాలంతో పోటీపడి అభివృద్ధి చెందడం చాలా సులభం.  సమయాన్ని సద్వినియోగం చేసినవారిదే విజయం. డబ్బు సాధించడం ఓ కళ.  అయితే సంపాదించిన డబ్బు ఆదా చేయడం ఓ పెద్ద కళ.  ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ రెండు కళలు చాలా అవసరం.  ఒకటే కళ ఉంటే సరిపోదు. రెండవ కళ చాలా అవసరం. ఆల్‌ ది బెస్ట్‌!!!

For a Successful Life ......!

There are certain principles that must be chosen in order to live a successful life. Make some good plans. No need to grind the hill. Cozy life goes on. Overcoming mental stress is like overcoming everything. There is no gain if you are physically strong and strong. If you are mentally strong, you can achieve what you set out to do.

It takes a lot of patience if you want to become a leader. Eloquence, kindness and smile can win the hearts of the people if they are all there. There are a lot of leaders who start from zero and end their reign as heroes.

To be honest no one needs to be afraid. Note this sentence carefully. There will be unrest in corruption. Peace of mind is damaged. That there is no peace other than peace of mind.

The heart beats 72 times per minute. A clock strikes 60 times per minute. That means your heart beats faster than time. Then it is very easy for you to compete and grow over time. Success is for those who make the most of their time. Making money is an art. But saving money is a big art. Both of these arts are essential for economic recovery. It is not enough to have the same art. The second art is much needed. All the best !!!

Saturday, November 7, 2020

ప్రకృతి వైపు షికారు....!

హైదరాబాద్‌ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే 'సండే మార్కెట్ 'ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్మకాలు అంతగా లేకపోయినప్పికీ, పాత వస్తువుల అమ్మకాలకుపెట్టింది పేరు. 'సండే మార్కెట్' ఉదయం ఆరు గంటలకే జనంతో నిండిపోయింది. ఒక రౌండ్‌ వేసుకొని ఇంటికెళ్ళి పోయాను. శనివారం వేసుకున్న ప్రణాళిక ప్రకారం 'షికారు'కు నేను, నా మిత్రులు మహమూద్‌ ఖాన్‌ ఘోరి, ఇర్షాద్‌ మరియు మోయిన్‌ సాబ్‌ నలుగురం హిమాయత్‌సాగర్‌ సందర్శనకు బయలుదేరాము. దారిలో కిషన్‌బాగ్‌లోని 'హరీదర్గా'కు కూడా వెళ్ళాము. దర్గాలో అద్దాలతో చేసిన డిజైన్‌ చాలా ఆకర్షించింది.

అక్కడి నుండి రాజేంద్రనగర్‌ దాటుకుంటూ హిమాయత్‌సాగర్‌ చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సాగర్‌కు  పక్కనే ఉన్న గుట్టపై కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాము. అది ఆహ్లాదంగా కనిపించింది. నవాబులు నిర్మించిన ఆ హిమాయత్‌ సాగర్‌ను చూడడం నాకు అదే మొదిసారి. అక్కడ మేము సంతోషంగా, ఉల్లాసంగా గడిపాము.  హిమాయత్‌సాగర్‌  కట్టపై నడవడానికి అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. ఏదో పని జరుగుతుందని, అందుకని సందర్శకులను దానిమీదకు రానివ్వటం లేదని తెలిపారు. మేము మాతో తెచ్చుకున్న ఫలహారాన్ని ఆరగించి, సేదతీరి మరలా 2 గంటలకు శంషాబాద్‌ వైపు నుండి హైదరాబాద్‌కు బయలుదేరాము. దారిపొడవున పచ్చదనం, అందమైన రింగు రోడ్డు. చూడడానికి ఆహ్లాదకర వాతావరణం. అది చూడాల్సిందే తప్ప,  వివరించడం కుదరదు.

హైదరాబాద్‌లోకి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసరికి ఆకలి దంచేసింది. హైదరాబాద్‌లో బిర్యాని ఫేమస్‌ హోటల్‌ 'షాగౌస్‌'లో మేము నలుగురం 'బిర్యానీ, మంది (మసాలాతో ఉండని బిర్యాని)' ఆరగించేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. 

ఇంటికి చేరుకొనేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఈ విధంగా ఆదివారం అంతా  ప్రకృతి లో షికారు చేసేందుకు అవకాశం దొరికింది. దానికి సంబంధించిన చిత్రాలు మీరు చూడవచ్చు..  - కరీంఖాన్‌, హైదరాబాద్‌

More Post's...