Tuesday, July 26, 2022

పాపను కాపాడిన రియల్‌ హీరో

 పాపను కాపాడిన రియల్‌ హీరో

Real Heroes..

Real Heroes..




చైనా విదేశాంగ ప్రతినిధి లియాజ్‌ ఝావో ట్విట్టర్లో పంచుకున్న ఒక వీడియో నేడు హల్‌చల్‌ చేస్తుంది.  చైనాలోని టాంగ్‌షింగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుంచి రెండేళ్ళ పాప పడిపోవడం, అక్కడే రోడ్డుపైనుండి నడిచి వెళ్తున్న షెన్‌డాంగ్‌ అనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను క్యాచ్‌ చేసి పట్టుకున్నాడు. 

షెన్‌డాంగ్‌తోపాటు మరో మహిళ కూడా అతనికి సహాయం చేసేందుకు వచ్చినట్లు వీడియోలో ఉంది. అందుకే మన హీరోలు సినిమాలలోనే కాదు, మన మధ్యలో కూడా హీరోలు ఉన్నారని ఈ వీడియో బట్టి తెలుస్తోంది. ఈ వీడియో నేడు వైరల్‌గా మారి ఈ రియల్‌ హీరోలను పొగడ్తలతో ముంచుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోబట్టి అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది.

mydailyroutinkk1973.blogspot.com

No comments:

Post a Comment

Latest Post

Cute Cat !!!!

More Post's...