వర్షం వల్ల ఆకాశానికి పడిన చిల్లులు భూతలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి
డ్యాములు చెరువులు, కుంటలు నిండి పారివాహక ప్రాంతాలను ఖాళీ చేస్తున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షానికి రైలు పట్టాల వెంబడి ఉన్న బీదవారు గజ గజగలాడుతున్నారు
పేదల బస్తీలలో కూలుతున్న గోడలవల్ల నిరాధారులైన వారు దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు
రోజువారి కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు
హోరు వాన వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలకు జడిసి ప్రజలు మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు
రైతులు వర్షం పడినా కష్టాలు సహిస్తుంటారు
వర్షాలు పడకపోయినా కష్టాలు సహిస్తుంటారు
భారీ వర్షాలను పట్టించుకోకుండా ప్రవహిస్తున్న నీటిలో
వాహనాలు నడిపి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు
నిరాశ్రులైన వారు దారుల వెంట తడిసి ముద్దయి ప్రాణాపాయంలో ఉన్నారు
నగరాలు బస్తీలు పల్లెలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతున్నారు
ఓ దేవుడా వర్షాన్ని మితంగా కురిపించి
మాకు ప్రశాంతతను చేకూర్చు
*మొహమ్మద్ అబ్దుల్ రషీద్, హైదరాబాద్
Good article
ReplyDeleteGood
ReplyDelete