నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ రక్కసినుంచి ప్రాణాలతో బయటపడాలంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమొక్కటే మార్గం. అంతేగానీ కరోనా విషయంలో లేనిపోనిభయాలను పెట్టుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మృత్యువును ఎవరూ జయించలేరన్నది తిరుగులేని వాస్తవం. అది రావాల్సిన సమయానికి వచ్చితీరుతుంది. మృత్యు భయాన్ని వీడి పరలోక చింతనతోనే జీవితాన్ని గడిపితే లేనిపోని భయాలన్నీ దూరమవుతాయి. అన్నిరకాల రోగాలు, అంటువ్యాధుల నుండి రక్షణ పొందేందుకు నివారణ చర్యలు చేపట్టడం, ఆ పైన దైవం పై భారం వేయడమే ప్రవక్త (స) సంప్రదాయం. ఈ కోవిడ్-19 ను నివారించడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకునే చిట్కాలు చూద్దాం..
దీనికోసం ఏం చేయాలంటే..
- 1. కలోంజి: నువ్వులను పోలిన ఈ నల్లని నిగనిగలాడే విత్తనాలను రోజూ పరిగడుపున తీసుకోవాలని ప్రవక్త (స) చెప్పారు. ఇందులో ఒక్క మృత్యువుకు తప్ప అన్నింటికీ స్వస్థత ఉంది. శిరస్సు నుంచి పాదల వరకూ శరీరంలో ఏ అవయవానికి అస్వస్థత కలిగినా ఈ కలోంజినీ తీసుకోండి. పావు టీ స్పూను కలోంజి విత్తనాలను తేనెలో కలుపుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- 2. పాలల్లో పసుపును కలుపుకుని త్రాగండి. రోగనిరోధక శక్తికి మంచి ప్రయోజనకారి.
- 3. ఖర్జూరం.. రాత్రిపూట నీళ్లల్లో సుమారు 10 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే పరిగడపున ఆ నీటితోపాటు ఖర్జూరాలను తినండి. దీనివల్ల కూడా రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యమూ పెరుగుతుంది. ఇలా చేయడాన్ని అరబీలో నబీజ్ అంటారు. అరబ్బులు ఇలా ఎక్కువగా చేస్తారు.
- 4. రోజూ ఒక చెంచా తేనెను తీసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి.
- 5. హిజామా (కప్లింగ్ థెరపీ). ఒక వైద్య ప్రక్రియద్వారా చెడురక్తాన్ని శరీరంనుంచి తీయడాన్నే హిజామా అంటారు. దీనివల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- 6. ఎండుద్రాక్ష (కిష్మిష్) వీటిని తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
- 7. రోజూ దైవగ్రంథంలోని కొంతభాగాన్ని పారాయణం చేయండి. ఖుర్ఆన్ వాక్యాలలో స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. ఖుర్ఆన్ లో ఒకానొక సూరా సూరే ఫాతిహాకు మరోపేరు షిఫా (స్వస్థత) అని ఉంది. ఏడు వాక్యాలున్న సూరే ఫాతిహాను మూడు లేదా ఐదు సార్లు చదివి నీళ్లల్లో ఊది ఆ నీళ్లు త్రాగితే స్వస్థత చేకూరుతుంది. ఎన్నో రకాల రుగ్మతలు, భయాందోళనలు, వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చు. దైవారాధనలు (దుఆలు) విరివిగా చేయండి.
- 8. నమాజుకు ముందు మిస్వాక్ పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోండి. ఒత్తిడికి, కుంగుబాటుకు దూరంగా ఉండండి.
- 9. కంటినిండా నిద్రపోండి. సోషల్ మీడియాకు, న్యూస్ ఛానళ్లకు, మీడియాకు వీలైనంత దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. నిత్యం వార్తలు చూసేవారిని ఆందోళన, ఒత్తిడి వెంటాడుతుంది. (సోర్స్: ముజాహిద్)
Very good information for current situation
ReplyDelete