|
ఫిట్నెస్ ఇన్ రైనే సీజన్లో |
హెల్త్ అండ్ ఫిట్నెస్
రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ అంటూ.... హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుండి చిరు జల్లులు పడుతున్నాయి. ఈ జల్లులలోనే అందరూ తమ ఆఫీసులకు, పనులకు, షాపులకు వెళ్తున్నారు. చిన్నపాటి జల్లులే కదా అని మనం తడుస్తూపోతే... మన ఆరోగ్యం కాస్త జబ్బులతో చుట్టుముడుచుకుంటుంది. అందుకే రెయినీ సీజన్‌లో మన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచి ఆహారం
వర్షాకాలంలో ఎక్కువగా మనం విటమిన్ 'సి' లభించే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపాటి రోగాల నుండి విటమిన్-సి మనల్ని కాపాడుతుంది.
|
ఫిట్ అండ్ హెల్త్ ఫుడ్ |
నీరు
మనం త్రాగే నీరు కలుషితం లేనిదై ఉండాలి. అవసరమైతే వేడి చేసి, చల్లార్చి త్రాగితే మరీ మంచిది.
సులువుగా జీర్ణమయ్యే ఆహారం
వర్షాకాలంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అందుకోసం మన ఆహారంలో పెరుగు, మజ్జిగ, ఇంట్లో చేసే పచ్చళ్ళు ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమవ్వడానికి సహకరిస్తాయి.
బయటి చిరుతిళ్ళ నుండి దూరంగా ఉండాలి
బజార్లలో లభించే జంక్‌ఫుడ్ నుండి దూరంగా ఉండాలి. వీధులలో లభించే ఆహారం మంచిది కాదు. వీటిపై ఎన్నో మైక్రో క్రిములతో కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ.
దోమల నుండి రక్షణ
వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇంట్లో దోమతెరలు ఉంటే మంచిది. దోమ కాటు మనల్ని భయంకర రోగాలకు దారితీస్తాయి.
మనం తొడిగే బట్టలు
మనం వర్షాకాలంలో బట్టలను ఐరన్ చేసి తొడిగితే మంచిది. అవి శరీరానికి వెచ్చదనాన్ని, క్రిమికీటాల నుండి రక్షణ ఇస్తాయి.
ఇంట్లోని ఏసి గదులకు దూరంగా ఉండాలి
ఇంట్లోని ఏసి గదులలో మన శరీరం, బట్టలు పొడిగా ఉన్నప్పుడే వెళ్ళాలి. లేకుంటే మన శరీరం ఇంకాస్త చల్లబడి జలుబు వంటి రోగాలబారిన పడే అవకాశం ఎక్కువ.
అలాగే మన చేతి గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు ఉంటే వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన శరీరంలో ప్రవేశించడం సులువ. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బులున్నవారి నుండి దూరంగా ఉండాలి.