Monday, September 28, 2020

చరిత్రను తిరగేయండి......!

మీలో ఏ లోపం ఉంది? మీరు కూడా విజృంభించండి, చెలరేగండి. విహారించండి. అది సాధ్యమైన పనే. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేసుకుాంరా? లేక థవర్ష ప్రణాళిక సిద్ధం చేసుకుాంరా? చేసుకోండి. ప్రణాళిక ఉంటే తప్పక  సఫలమవుతారు. ఇది ఆధునిక యుగం. సైన్స్‌ చాలా డెవలప్‌ అయినది. అసాధ్యమనేది సుసాధ్యమవుతున్న ఈ రోజుల్లో మీరు మానసిక ఆందోళనతో  కృంగిపోకూడదు. చింత మీకు చిదిమివేస్తుంటే, దైవచింత చేసుకోండి. చింతను మీరు చిదిమివేయవచ్చు. అనవసర అపోహల ఫోబియాలకు గురై కొందరు యవ్వనంలోనే మంచం బారినపడుతున్నారు. వాస్తవంగా చూస్తే వారికి ఏ రోగం ఉండదు. 
కొందరు యవ్వనంలోనే కొందరు నలభై యేళ్ళకే వారికి ఇచ్చే సూచన ఏమి? లేవండి ఆ మంచం పైనుంచి, మీ మనస్సు నుంచి తొలగించండి ఆ అనవసర ఫోబియాను. జనజీవన స్రవంతిలో సాగిపోండి. ఆత్మ క్షోభకు, ఆత్మ వంచనకు గురికావద్దు. మీ అంతరాత్మతో ఆ పరమాత్మను ధ్యానించండి. జీవించేది కొద్ది కాలం మాత్రమే. మళ్ళీ ఎందుకు ఈ ఫోబియాలు. అవి తొలగించుకోకుంటే, అనామకంగా అంతమవుతారు. జీవితం యొక్క విలువను తెలుసుకోండి. జీవితం అతివిలువైనది. వెల కట్టలేనిది. చేయదలుచుకుంటే చాలా ఉంది. ఆ పనులు పూర్తి చేయాలనుకుంటే ఈ జీవితం కాలం సరిపోదు. మితంగా భోజనం చేసి అమితంగా కృషి చేసినచో ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆర్థికం కూడా బాగుంటుంది. ఈ రెండు మీ ఆధీనంలోనే ఉంటే మీకు ఎదురుండదు. అనవసర జోక్యాలతో అనార్ధాలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ఎందుకు చేయాలి? ఆ అనవసర జోక్యాలు. అలాంటప్పుడు ఎందుకు మీదారి మీరు చూసుకుంటే- మీరు ఆత్మశాంతితో జీవించవచ్చు. ఆత్మను అలజడికి గురికానివ్వకూడదు. తీవ్ర అనర్ధాలకు గురై రోగాల బారినపడుతారు. 
అనవసర జోక్యాలతో ప్రపంచ యుద్ధాలే జరిగాయి. తీవ్ర ప్రాణ, ఆస్థి నష్టాలు జరిగాయనేది సంగతి గుర్తుంచుకో. రిలేషన్‌ షిప్‌ను మెయిన్‌టెన్‌ చేసుకుంటూ ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రయత్నించండి. సమాజంలో ముందుకు సాగాలంటే రిలేషన్‌ షిప్‌ మెయిన్‌టెన్‌ చాలా అవసరం. ఒంటెద్దు పోకడ పోకూడదు. నలుగురితో సలహా సంద్రింపులు జరగాలి. అది మీకే మంచిది. అహంకారం, అహంభావం తీవ్ర నష్టానికి దారితీస్తాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో గివ్‌ రెస్పెక్ట్‌ అండ్‌ టేక్‌ రెస్పెక్ట్‌ చాలా ముఖ్యమైనది. దేవుడు మిమ్మల్ని బానిసగా బతకమన్నాడా? కాదు!  కదా! మరి బానిస బ్రతుకులెందుకు? మళ్ళీ బానిస బ్రతుకులెందుకు? వ్యసనాలకు బానిస కావద్దు. దానిని బానిసగా మార్చాలి. కానీ మీరు దానికి బానిస కావద్దు. సంఘం గౌరవించదు. బ్రతుకు దుర్భరమవుతుంది. ఇంతకు ముందే విన్నవించాను. దేవుడు మీకు విజ్ఞత ఇచ్చాడు. జీవితాన్ని పున్నమి వెన్నెల్లా చేసుకుాంరా? లేక అమావాస్య చీకిలా చేసుకుాంరా? అది మీ ఆధీనంలోనే ఉంది. పరులపై నిందలు వద్దు. ఏది ఏమైనా మీ ఆలోచనలు పాజిీవ్‌ ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించవచ్చు. ధైర్యవంతులదే ఈ ప్రపంచం. 

Saturday, September 26, 2020

అసహనం వద్దు.......సమయస్ఫూర్తి కావాలి

మన స్వయం కృషి మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తుంది. స్వయంకృషితో  సహా పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనేది ఎందరో నిరూపించారు. సహనం చాలా అవసరం. అసహనం మీ అభివృద్ధికి తీవ్ర ఆటంకమనేది గుర్తుంచుకోండి. సరియైన దారిని ఎంచుకొని నడుచుకుంటే గమ్యం తప్పక దొరుకుతుంది. దారి  తప్పితే చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మన దారిన మనం ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటే చాలు. సమస్యలనేవి ఉండవు. పది మందికి సహాయంచేసేలా ఎదగాలి. సమాజం గౌరవిస్తుంది. సాధ్యమైనంత వరకు అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఒక్కోసారి తీవ్ర మానసిక అశాంతికి గురిచేస్తుంది, ధ్యానం చేసుకొని మీ ఆత్మను శాంతింపచేసుకోండి. మీ ఆత్మ శాంతిగా ఉంటే మీ జీవితం ప్రశాంతంగా సాగుతుందనేది వాస్తవం. అనవసర ఆలోచనలు వద్దు. 

దానితో ఏమీ సాధించలేము. అశాంతి తప్ప! ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించవచ్చు. విజయానికి తొలిమెట్టు మీరే వేసుకోవచ్చు. ఓ మెట్టు తయారయిందనుకోండి, ఆ తరువాతి మెట్లు చాలా సులభం. అంతస్తుపై అంతస్తులు వేసుకోవచ్చు. 
ఒక్కసారి చూడండి న్యూయార్క్‌లోని ఆకాశ హర్మ్యాలను. అవి మీలాిం మానవుడు వేసుకున్నవే. కలలు కనడంలో తప్పులేదు. కలను సాకారం చేయడానికి కృషి చేయాలి. ఆర్థికంగా బలపడేందుకు కృషి చేయాలి. అప్పుడే అభివృద్ధి అనేది మీ చెంతకు చేరుతుంది. అభివృద్ధి అనేది ఎక్కడో లేదు. తలుచుకుంటే అది మీ సొంతమే. ఆందోళనను మాత్రం మొగ్గ థలోనే అంతం చేయాలి. లేకుంటే అది మీ పాలిట పెను భూతం అవుతుంది. ఏ పని చెయ్యనియ్యదు. నిద్ర పోనివ్వదు. మీ జీవితాన్ని నరకం చేస్తుంది. మేల్కొండి, ఆ పెనుభూతం బారిన పడకండి. జీవితానికి ఓ అర్ధం ఉండాలి. ఎందుకనగా దేవుడు మనల్ని ఓ మానవునిగా ప్టుించాడు. అది అర్ధం చేసుకుంటే చాలు. అర్ధంలేని జీవితం వ్యర్ధం.  
నేను ఈ పని చెయ్యలేను అనే ఫీలింగ్‌ వచ్చిందనుకోండి, ఇక మీరు చెయ్యలేరు. అలాిం ఫీలింగ్‌ వచ్చినప్పుడు అప్పికప్పుడే చిదిపి పడవేసినప్పుడే చెయ్యవలసినదంతా చేసి తీరుతారు. తప్పక చేసి తీరుతారు. 
ఒకసారి ఆలోచించండి! సూర్యుడు కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగునిస్తున్నాడు. మీరు మీ సొంత జీవితానికి వెలుగు ఇవ్వలేరా? చీకి బ్రతుకులెందుకు? మీరు ఆధునిక యుగంలో ఉన్నారనే విషయం గుర్తుంచుకోండి. ఉత్సాహం, సంతోషం - ఇవి మానవునికి బలాన్నిస్తాయి. ఆరోగ్యం కూడా మన అదుపులో ఉంటుంది. ఏ పనిలో మీరు ఉత్సాహంగా ఫీలవుతారో దాన్ని ఎంచుకోండి. సంతోషం సగం బలం అన్న మాట తెలిసిందే కదా!
ఒక్కసారి ఆకాశంలో ఎగిరే పక్షిని గమనించండి! ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా విహరిస్తుందో! మీరైతే మానవులు సర్వాధికారాలున్నాయి. మీరు ఉత్సాహంగా ఉండలేరా? అది మీ ఆధీనంలోనిదే. తమకు తాము పరుధులు ఏర్పర్చుకోకూడదు. సమయం వచ్చినచో సరిహద్దులు కూడా దాటవలెను. అందులోనే మీ అభివృద్ధి. అనవసరంగా బెదరవద్దు. అదిరితే అధః పాతాళమే. ఒక్కసారి స్మరించుకోండి. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ అమర వీరులను స్మరించుకోండి. ప్రస్తుతం అంత త్యాగం చెయ్యవలసిన అవసరమైతే మీకు లేదు కదా!
కొందరు యవ్వనం లోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటే అమరవీరులైతే కారు కదా! అలాిం పనిచేసి సమాజంలో ఓ పిరికివారిగా మీరు గుర్తుండిపోతారు. గుర్తుంచుకోండి! ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్యలను అరికట్టవచ్చు. ఆత్మహత్యలతో ఏమి సాధిస్తారు? మీ మీద ఆధారపడిన కుటుంబం బజారు పాలవుతుంది. మీ పేరు ఓ పిరికి వారిజాబితాలో  చేరిపోతుంది. సూపర్‌ కంప్యూటర్‌ కనుగొన్న అతి విలువైన మేధస్సు మానవునిది. మీకు కూడా దేవుడు మేధస్సు ఇచ్చాడు. ఆ మేధస్సును సక్రమంగా వాడుకుంటే చాలు! చాలా సాధించవచ్చు. కొన్ని అపార శక్తులు  మీలో దాగివున్నాయనే వాస్తవాన్ని మరవక ముందుకు సాగండి. చరిత్రలో మీరు కూడా చిరస్మరణీయులవుతారు. 
ఇంకో విషయం ఈ ప్రపంచంలో మనం వచ్చినది చాలా కొద్ది సమయం కొరకే. దొరికిన ఆ సమయమే మన భాగ్యమని గడపండి. ఆరోగ్యమే మహాభాగ్యమనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటేనే ఆరోగ్యం. ఆందోళనను పారద్రోలినప్పుడే ఆరోగ్యం. అనవసరంగా  అపోహల పాలై మంచాల బారిన పడకండి. చాలా మంది ఈ ఫోబియాతో బాధపడుతున్నారు. అసలు వ్యాధి అనేది ఏమీ ఉండదు. అపోహ మాత్రమే. లేనిది కూడా ఉన్నదని అపోహల బారిన పడి విలువైన జీవితాన్ని త్వరగా అంతం చేసుకోవద్దు. 
మనం వచ్చినప్పుడు తెచ్చినది ఏమీలేదు  కదా! మరి బెంగ ఎందుకు మీకు? మానసిక ఆందోళనే మన ప్రధమ శత్రువు. దానిని అంతం చేసుకుంటే అంతా సుఖమే! ఆత్మవిశ్వాసం అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది. అలాంటప్పుడు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అనవసరంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి అనారోగ్యాల పాలుకావద్దు. మానసిక ఒత్తిడి అనేది మన నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది ఎన్నో అనార్ధాలకు దారితీస్తున్నది వాస్తవం. ఇప్పుడైనా మేల్కోనండి. ఆత్మవిశ్వాసం ఉంటే కొండను కూడా పిండి చేయగలం. నడి సముద్రంపైన కూడా వంతెనను నిర్మించవచ్చు అన్న సంగతి మరవకు ముందుకు అడుగేయండి. దేవుడు అందరికీ అదే మెదడు ఇచ్చాడు. కొందరు దాన్ని సక్రమంగా వాడుకొని చిరస్మరణీయులైనారు. వాడనివారు అనామకులుగా మిగిలిపోయారు. అది వారి స్వయంకృపారాధమే. 
ఘోర తప్పిదాలు చేయకండి. జీవిత చరమాంకం అతి ఘోరంగా దయనీయంగా ముగుస్తుందని మరువకండి. బాల్యం, యవ్వనం, వృధ్ధాప్యం ఈ మూడు థల్లో మీ జీవిత కాలం ముగిస్తుంది. చెప్పలేము ఖచ్చితంగా ఎప్పుడు ముగుస్తుందో- అది దైవానుగ్రహమే! కానీ యవ్వన థ అత్యంత కీలకమైనది. ఈ థలో మీరు నిద్రపోయారనుకోండి! మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనే సత్యాన్ని మరువకండి. 
సమాజంలో ఓ క్యారక్టర్‌ నిర్మించుకోవడమనేది కష్టసాధ్యమైన పని. ఒకవేళ మనం క్యారక్టర్‌ నిర్మించుకున్నామనుకోండి దాన్ని యధాతథంగా కొనసాగించాలి. పోగొట్టుకోవడం చాలా సులభం. నిర్మించుకోవడం చాలా కష్టం. ఓసారి దృఢంగా నిర్మిస్తే మాత్రం అది మరణించే వరకు ఉంటుంది. అది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఓ మంచి పని చేయాలి. ఓ పేరు సంపాదించాలి, నలుగురికి ఉపయోగపడాలి. ఆశయాలు ఉన్నతంగా ఉన్నప్పుడే కృషి పట్టుదల ఉన్నప్పుడే అది సాధ్యం. కలను కనగానే అంత మొందించకూడదు. చేసి చూపాలి. సమాజానికి, ఈ ప్రపంచానికి తమకు తామేోం నిరూపించాలి. అనామకుడిగా అంతం కాకూడదు. జన్మకు కారణమున్నది. కారణజన్ములు కావాలి. ఎందుకనగా దేవుడు అన్ని జీవులలో మిమ్మల్ని సర్వోత్తమ జీవిగా ప్టుించాడు. ఆ విలువను తెలుసుకొని ముందుకు సాగండి. అంధకారంలోనే అంతం కాకండి. చేసేది చాలా ఉన్నది. సమయం కూడా చాలా తక్కువగా ఉన్నదనే వాస్తవాన్ని మరువక జీవించిన ఆ 50, 60 సంవత్సరాలు రానున్న తరాలవారికి స్ఫూర్తిగా మిగులాలనే తపనతో కృషి చేసినచో తప్పక మీరు సఫలురు అవుతారు.ఇంతకు ముందు సఫలురు అయిన వారు మీలాిం మానవులే కదా! 
మీలాిం వారే - వారిలో ఏదో ఉద్వేగం, ఏదో సంకల్పం, దానికై పోరాడి సఫలురు అయ్యారు. మీరెందుకు కారాదు. తప్పక కావచ్చు. అంత ఆత్మవిశ్వాసం మీలో నింపుకోవాలి. అనుకుంటే సరిపోదు, దానికి కృషి చాలా అవసరం. కృషి ఉంటే మనిషి ఋషులవుతారనే సంగతి తెలిసినదే. తెలిసి అలా జీవితాన్ని మందకొడిగా మార్చవద్దు. వేగం పెంచాలి. కాలంతో పోీపడి నడిచినప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చన్నది ఎందరో నిరూ పించారు. మీరు కూడా నిరూపించుకోవచ్చనే వాస్తవాన్ని మరవవద్దు. ఎందరో అతిరధ మహారధులు వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు కూడా ఒకనాడు వెళ్ళవలసినదే. 
కానీ వెళ్ళే ముందు ఆ మహారధులు ఏమి చేశారనేది కక్షుణ్ణంగా పరిశీలించండి. ఆదర్శంగా తీసుకోండి. జీవితంలో మీరు కొంతైనా సాధించవచ్చనే సంగతి గుర్తుంచుకుంటే చాలు. కొందరు లోహ విహాంగాలలో ఖండాంతరాలు దాివెళ్తున్నారు. మీరు కూడా దాటవచ్చు. వారు దాటుతున్నారు- మీరెందుకు దాటలేకపోతున్నారు? ఆత్మశోధన చేసుకోండి.

English Translation:

Don’t be impatient ....... need timeliness

Our self-effort takes us to great heights. Many have proven that perseverance, including self-cultivation, can lead to a higher level. Patience is very necessary. Remember that impatience is a serious obstacle to your development. The destination must be found if you choose the right path and walk. There are many dangers lurking if you get lost. All we have to do is walk with confidence. No problems. Must grow to help ten people. Society respects that. Avoid interfering with unnecessary things as much as possible. Once in a while it causes severe mental turmoil, meditate and calm your soul. The fact is that your life will go on peacefully if your soul is at peace. Do not want unnecessary thoughts.
Nothing can be achieved with it. Except for the unrest! Aspirations must be lofty. Only then can anything be achieved. You can be the first step to success. Suppose one step is made, the next step is very easy. Floors can be laid floor by floor.
Take a look at the skyscrapers in New York. They are human-made. There is nothing wrong with dreaming. You have to work hard to make the dream come true. Efforts should be made to become financially strong. Only then will development reach your grasp. Development is nowhere to be found. It's yours. Anxiety should end at the bud. Otherwise it will become the biggest demon in your milk. No work is allowed. Can't sleep. Makes your life hell. Wake up, do not fall victim to that monster. Life must have a meaning. Because God made us human. It is enough to understand. A meaningless life is a waste.
Suppose I got the feeling that I can not do this, you can not do it anymore. When it comes to feeling aloe vera, all you have to do is do it right away. Must be done.
Think once! The sun is shining on the lives of millions of people. Can’t you light up your own life? To survive Cheeky? Remember that you are in the modern age. Enthusiasm, happiness - these are what give strength to a human being. Health is also under our control. Choose the work in which you are most enthusiastic. Did you know that happiness is half strength?
Once upon a time there was a bird flying in the sky! What a thrilling ride! Humans are omnipotent if you are. Aren’t you excited? It is in your possession. They should not form boundaries for themselves. Boundaries must also be crossed when the time comes. That is your development. Don’t panic unnecessarily. Adirite is the abyss. Remember once. Remember those immortal heroes who sacrificed their lives for freedom. If you need to make such a sacrifice right now, don't you!
Some commit suicide in their teens. If you commit suicide, what about the martyrs? Alam works and you are remembered as a coward in the community. Remember! Increase self-confidence. Confidence can prevent suicides. What is achieved with suicide? The family market depends on you. Your name will be added to the list of cowards. The most valuable intelligence invented by the supercomputer is the human. God has given you intelligence too. It is enough to use that intelligence properly! A lot can be achieved. Forget the fact that there are some immense powers hidden within you. You will also be remembered in history.
Another thing is that we came into this world for a very short time. Spend that time is our destiny. It is a well-known fact that health is the greatest good fortune. You will be able to stay healthy. Health is when you are excited and cheerful. Health is when anxiety is dispelled. Don't fall prey to unnecessary myths. Many people suffer from this phobia. The actual disease is nothing. Myth only. Do not quickly end a life worth living by falling prey to the myth that there is nothing.
Nothing we brought when we arrived! Why do you have more anxiety? Mental anxiety is our number one enemy. All is well if it ends! Self-confidence is linked to health. That's when self-confidence should increase. Do not lose confidence unnecessarily and fall ill. Stress can have a devastating effect on our nervous system. The fact is that it leads to many misfortunes. Wake up now. The hill can also be crushed if there is cock. Ask him out well if he is no longer absorbed in the connection. God gave everyone the same brain. Some used it irregularly and became memorable. Users are left anonymous. That is their selfishness.
Do not make grievous mistakes. Do not forget that the end of life ends in the worst possible misery. Childhood, youth and old age are the three stages in which your life span ends. Can't say exactly when it will end- it is a blessing! But youth is the most crucial. I wish you were asleep in this tha! Don’t forget the fact that you will be left as history scoundrels.
Building a character in society is a difficult task. Suppose we have built a character, it must continue as it is. It is very easy to lose. It is very difficult to build. If Osari is built firmly it will last until it dies. It depends on us. O should do a good job. Must earn a name and be useful to all four. It is only possible when there is perseverance when the ambitions are high. Don’t be so stubborn as to dream. And show. To society, to this world we have to prove ourselves. Should not end anonymously.

Thursday, September 24, 2020

ప్రపంచ హృదయ దినోత్సవం

 24 sept ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా
*హృదయం*
హృదయం
నా హృదయం
నా హృదయం జబ్బు పడితే        నా శరీరమంతా నిర్వీర్యమై పోతుంది 
నేను బతికి ఉన్నానని 
నేను స్పృహలో ఉన్నానని తెలిపేది నా హృదయమే
నా హృదయంలో ఎన్ని దుఃఖాలో ఎన్నెన్ని బాధలో
ఎన్నెన్నివెతలో 
ఎన్నెన్ని విచార లో దాగి ఉన్నాయి  
నా హృదయం లో 
ఎన్నో కోరికలున్నాయి
కన్న కలలూ ఉన్నాయి
ఊహలుఆశలు
చిగురిస్తుంటాయి
నా హృదయం లో జాలి దయ కరుణ ఉంది 
సౌమ్యత సౌజన్యత ఉంది 
ఉపకారం ఉంది 
కృతజ్ఞత భక్తి  నిబిడీకృతమై ఉన్నాయి
నా హృదయం లో గుబులు, భయం, శంకలు,అనుమానాలు కలుగుతుంటాయి 
అది కృత ఘ్నతకు కూడా పాల్పడుతోంటుంది 
ఇలాంటి నా హృదయాన్ని  కోసినప్పుడుడాక్టర్ గారికి 
ఇవేమైనా కనిపించిందా
ఏమైనా వినిపించిందా
 ఏమో!
 కానీ.. కానీ..కానీ.. 
నా హృదయంలో నుండి ఆత్మను ఎవరో లాగుతున్నారు 
కాస్త వారిని ఆపండి 
నేను కేకలు వేస్తున్నాను 
మీకు వినపడడం లేదా 
ఆఁ అర్థమైంది 
వీరు దైవదూతలు 
దైవదూతలారా! ఆగండాగండి  దేవుడు ఉన్నాడని 
నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది 
కాస్త నా వాళ్ళ తో చెప్పి వస్తాను 
ఇప్పుడు నా మాటవాళ్ళు నమ్ముతారు 
వీడ్కోలు చెప్పి వస్తాను
చె... పి... వ... స్తా.....
*అల్లాహ్ ఏ వ్యక్తి శరీరం లోనూ రెండు హృదయాలను పెట్టలేదు* ( దివ్యఖుర్ఆన్: 33-4)

-మొహమ్మద్ అబ్దుల్ రషీద్

Wednesday, September 16, 2020

ప్లానింగ్‌తో ముందడుగు వేయండి!

నేను రాస్తున్న ఈ సాహిత్యంలో అనుభవంతో రాస్తున్న అనుభవాలే. మన విలువ ఏమిో మనం తెలుసుకోవాలి. మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలుస్తుంది. సమయం చాలా విలువైనది. మరి జీవితం అంతకంటే విలువైనది. ఈ విలువలను తెలుసుకుంటే అదే చాలు.

కొందరు ఆత్మహత్యలే పరిష్కారమనుకొని బలవర్మణాలకు పాల్పడుతున్నారు. అది చాలా ఘోర తప్పిదం. క్షమించరాని నేరం. చచ్చిసాధించేది ఏముంది? ఓ పిరికివానిగా మీ విలువైన జీవితం ముగుస్తుంది. చచ్చినా సరే పోరాడి చావాలి. ఓ వీరుడిగా మీరు గుర్తుండిపోతారు. ఇలా చేయదలచుకున్నవారికి నా సలహా ఒక్కటే- గుర్తుంచుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని., ఎన్నో సార్లు ఈ వాక్యాన్ని పదేపదే ఈ పుస్తకంలో రాసాను. ఒక్క సారి ఆలోచించండి. అర్ధాంతరంగా జీవితం ముగించడం మంచిదా? దేవుడు అలా చేయమన్నాడా? కాదు కదా! మరి ఎందుకు ఆ ఘోరానికి పాల్పడుతున్నారు? 

మీతో ముడిపడివున్నవారు ఎందరివో జీవితాలు ప్రభావితమవుతున్నాయి. వద్దు, క్షణికావేశం వద్దు. ప్రశాంతంగా, శాంతిగా ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించండి. మనస్సును సంతోషంగా ఉంచుకోవాలి. మనస్తాపానికి గురికావద్దు. ఓ పుష్పం వికసించినప్పుడు సువాసన వెదజల్లుతుంది. మీ మనస్సును, మీ మెదడును పూర్తిస్థాయిలో వికసింపజేయండి. ఎలాగయితే ఓ మొగ్గ మెల్లమెల్లగా విప్పారి పుష్పంగా మారుతుందో అప్పుడు దాని ఉనికి అందరికీ తెలుస్తుంది. ఈ ఉదాహరణను తీసుకుంటే. దాని ఉనికి అంటే ఏమి? దాని యొక్క సువాసనే. మీరు కూడా మానవులే మీ ఉనికి ఉండకూడదా? అలా చేయలేరా? చేయవచ్చు. ముమ్మాికి చేయవచ్చు. అది మన చేతిలోని పనే. దేవుడు మీకిచ్చిన అపూర్వ మేధస్సుతో కొంతభాగమైనా ఉపయోగించుకుంటే చాలు. సమయం చాలా విలువైనది. అంతకంటే విలువైనది మన జీవితం. ఈ రెండు విలువలను సరిగ్గా గుర్తుంచుకుంటే చాలు విజయం మనదే. 

ఉదాహరణ : హైదరాబాద్‌ నుండి ముంబాయి ఓ వారం రోజుల కొరకు వెళ్ళాలంటే ఓ ప్రణాళిక వేసుకుాంరు.  ావెల్‌ ఫుడ్‌ అకామిడేషన్‌ ఇవన్నీ సర్దుబాటుచేసుకొని ప్రయాణం మొదలెడతారు. ఒక వారం రోజుల వరకు మన ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పుడు- జీవితం అనే ఇంత పెద్ద నౌకకు ప్రణాళిక వేసుకుంటే చాలా సాఫీగా సాగుతుంది. ప్రణాళికా బద్దంగా నడుచుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఒకవేళ ప్రణాళిక లేకుంటే ఈ జీవితం అడవికాచిన వెన్నెల్లా గడిచిపోతుంది. నౌకకు తీరం దొరకనట్లు గడిచిపోతుంది. సమయం ఆసన్నమైనది. ఎన్ని సవాళ్ళయినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. జీవితానికి ఓ అర్ధం ఇవ్వాలి. అది మన మీదనే ఆధారపడి ఉంది. అభివృద్ధి చెందడం లేదు. ఫలానా మనిషి, ఫలానా సమస్య కారణం అనే సాకులు వెదక వద్దు. వెదకకూడదు. అలా వెతుక్కుంటూ ఎవరినో దూషించుకుంటూ ఉండిపోతే ఏమీచేయలేరు.  ఏమీ సాధించలేరు. చిత్తశుద్ధితో సాధన చేస్తే అన్ని సాధ్యమే. 

ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ ఆవేదన చెందకూడదు. మిమ్మల్ని ప్టుించిన మీ భగవంతుడు మీ వెంటనే ఉన్నాడని గుర్తుంచుకుని నడుచుకుంటే ఏ విధమైన ఆందోళన మీ దరిదాపులకు కూడా రాదు. మీ మానసిక స్థితిని ఎంతగా మీరు బలంగా రూపుదిద్దుకుంటే మీ అభివృద్ధి కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లాభ నష్టాలు ఉంాయి. నష్టం వస్తుందని వ్యాపారాన్ని మూసివేయలేం కదా. అలాగే జీవితంలో కూడా సుఖదుఖాలు వస్తుాంయి. దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితం అని అంతం చేసుకుాంరా? కాదు కదా? కాని కొందరు క్షణికావేశంతో అంతం చేసుకుంటున్నారు. ఎందరినో చూస్తున్నాము. కొందరు యుక్తవయసులోనే అంతం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే- ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనేది. ఆలోచనతో నడుచుకోవాలి కాని ఆవేశంతో కాదు. 

ఆవేశంతో నష్టమే కానీ లాభమనేది ఉండదు. ఒకవేళ మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నప్పుడే ఏదో ఒక షాపింగ్‌ సెంటర్‌కు వెళ్ళి జనజీవన స్రవంతిలో కలవండి. ఒంటరిగా ఉండకండి. దాని తీవ్రత ఎక్కువవుతుంది. మానసిక ఆందోళన అనేది చాలా రోగాలకు మూలకారణమవుతుంది. దాని తీవ్రతను అణగద్రొక్కడానికి ప్రయత్నించాలి కాని, ఒకవేళ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే చాలా నష్టం వాిల్లుతుంది. అది వినాశనకారి. మానవునికి పెద్ద శత్రువు మానసిక ఆందోళననే. ఆ శత్రువును అంతం చేయండి. అంతం చేసే మేధస్సు కూడా మీ దగ్గరలోనే ఉంది. 


English Translation :

Go ahead with the planning !

These are the experiences that I am writing with a lot of scrutiny and immense experience in the literature I am writing. We need to know what our value is. Everyone else knows as much as you do about yourself. Time is very precious. And life is worth more than that. It is enough to know these values.

Some commit suicide and resort to coercion. That is a terrible mistake. An unforgivable crime. What? Your precious life will end as a coward. Even if he dies, he must fight and die. You will be remembered as a hero. My advice to those who want to do this is the same- remember that there is a solution to every problem., I have written this sentence many times in this book over and over again. Think for a moment. Is it better to end life by meaning? Does God do that? No way! And why commit that atrocity?

The lives of many who are connected to you are being affected. No, not transient. Live life calmly, peacefully and with confidence. Keep the mind happy. Do not be offended. When a flower blooms, the fragrance dissipates. Fully develop your mind and your brain. However, if a bud slowly unfolds into a flower, then its existence will be known to all. If you take this example. What does its existence mean? The scent of it. Shouldn't you be human too? Can't do that? Can. Mummy can. That is our task. All you have to do is use some of the extraordinary intelligence that God has given you. Time is very precious. More valuable than that is our life. Success is ours if we remember these two values ​​correctly.

Example: We have made a plan to travel from Hyderabad to Mumbai for a week. Avel‌ Food Accommodation adjusts all this and starts the journey. When we are planning for up to a week- planning for such a big ship called life goes very smoothly. No matter how many problems you face, if you follow the plan, you will be comfortable. If left unmanaged, they can be left astray and lose the right path. The ship passes as if it could not find the shore. The time is imminent. Be prepared to face any number of challenges. Life must be given a meaning. It depends on us. Not developing. Falana man, do not look for excuses as to the cause of the particular problem. Do not search. There is nothing that you can do about it. Nothing can be achieved. All is possible if practiced in good faith.

Never feel lonely. No worries will even come to your doorstep if you walk away remembering that your God who caught you is right behind you. The stronger your mood, the better your development will be in that range. There are profit losses when doing a business. Can't close the business that the loss will come. Happiness comes in life as well. Why end this life when grief comes? Isn't it? But some end up with a fleeting moment. Seeing so many. Some end up in adolescence. All I can say is that there is a solution to every problem. Walk with thought but not with rage.

Anger is a loss but not a gain. If you are mentally very anxious then go to some shopping center and meet in the mainstream. Do not be alone. Its intensity increases. Psychological anxiety is the root cause of many diseases. One should try to suppress its severity but if it continues to increase it will do a lot of damage. It is destructive. The biggest enemy to man is mental anxiety. End that enemy. The intelligence to end is also near you.

Sunday, September 6, 2020

దువా కైసే కరే ?

ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ లోని ఈ వీడియో నాకు నచ్చింది  . ఇది మీకు కూడా నచ్చుతుందని నా బ్లాగ్ లో యాడ్ చేశాను 


Islam guru 

Friday, September 4, 2020

కొబ్బరి నీళ్ల తో లాభాలు

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఎన్నో వున్నాయి.
కొబ్బరి నీళ్ళు ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు కాపర్ వంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.  కొబ్బరి నీళ్ళలో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తాజా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలోని చక్కెర మోతాదులు సమపాళ్లలో ఉంటాయి. కొబ్బరినీళ్ళ లోని అమినో యాసిడ్ శరీరంలోని ఇన్సులిన్ ను తగిన మోతాదులో ఉత్పత్తి చేస్తుంది.

 

More Post's...