Monday, August 3, 2020

నేటి గ్రామ వాతావరణం

ప్రతి గ్రామంలో లో carona భయంతో ఎవరి ఇంటికి వెళ్లాలి అన్న భయం బాగానే ఉంటుంది. ఏ సహజ మరణం అయినా carona అనే భయం ఒక మూల ఉంది. 
ఒకప్పుడు పెద్ద వారు సహజంగా మరణిస్తే సానుభూతితో వారింటికి అందరూ వెళ్ళి వచ్చేవారు. చివరి చూపు చూసుకునే వారు. 
నేడు ఆ చివరి చూపు చూసుకోవడానికి  crona భయంతో వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
బంధాలు బంధుత్వాలు ఏవి ఈ carona ముందట నిలబడడం లేదు.
పెళ్లిళ్ల సీజన్  పెళ్లిళ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి.  పెళ్లి ఖర్చులు తగ్గుతున్నప్పటికీ బంధువులు రావడం లేదని బెంగ మాత్రం మిగులుతుంది.
ఎటు చూసిన అందరికీ లాక్ డౌన్ సెలవులు ఉన్నప్పటికీ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. 
సహజంగా వయసు మళ్ళిన మరణాలు carona లెక్కలోకి నెట్టివేయబడుతున్నాయి.
పట్టణాల నుండి వచ్చే వారిని అనుమానంతో ఒక విధమైన చూపులతో చూస్తున్నారు. 
ఏదైనప్పటికీ ఈ carona మానవ సంబంధాలను దూరం చేస్తుందని చెప్పవచ్చు.


1 comment:

More Post's...