దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ జూలై 8 న ఆవిష్కరించారు. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం.. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చారని.. ఇది ఒక మంచి పుస్తకం అన్నారు. ‘నాన్న జయంతి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు వైఎస్ జగన్.
వైఎస్‌లో చూసిన గొప్పగుణం.. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాసారు విజయమ్మ. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పారు. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారని.. ఎంతో మంది అది తమకిచ్చిన భాగ్యం అనుకుంటానని.. ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ పుస్తకం amazon online ద్వార బుక్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment