Tuesday, July 7, 2020

అధైర్యపడరాదు....భాగం -2

ఇంకో విషయం మీ ఆలోచనల మీదే మీ అభివృద్ధి ఆధారపడి ఉంది. సరైన ఆలోచనలతో ఆత్మ విశ్వాసంతో మీ వెంటనే మీ పరమాత్ముడు ఉన్నాడని మీరు ఒంటరిగా లేరని మీ మనసులో అనుకుంటే చాలు, ఎంత ఒత్తిడినైనా అధిగమించి విజయ శిఖరాలను అందుకోగలరు. అసాధ్యమైనది ఏదీ లేదు. సాధన చేయండి. అలుపెరుగక సాధిస్తారు తప్పక మీరనుకున్నది. కానీ అధైర్యపడకండి. ముందే మీకు విన్నవించాను. అధైర్యమనేది మృతువుతో సమానమన్నది. ఆది మానవుడు అలజడితో జీవించలేదు. కానీ ఆధునిక మానవుడు అలజడితోనే జీవిస్తున్నాడు. మానసిక ఒత్తిడితో జీవిస్తున్నాడు. మానసిక వత్తిడిని అధాఃపాతాళానికి వత్తి పడేస్తే అంతిమ విజయం మీదే. వత్తిడిని అధిగమించే మార్గాలను అన్వేషించండి. అతిగా ఆలోచించకండి. మనసును గాయపర్చుకోకండి. ఎదుివారిని కూడా గాయపర్చకండి. మనసుకు తగిలిన గాయం మానదని గుర్తుంచుకోండి. ఎదుివాని మనసును గాయపర్చినట్లయితే మీరు జీవితంలో విజయం సాధించలేరు. ఆత్మీయులకు కూడా దూరమవుతారు. ఒంటరిగా మిగిలిపోతారు. 
చరిత్రలో ఇలాిం వారు కూడా మనకు తారసపడతారు. ఎంత దయనీయంగా మారుతుంది వారి అంతిమ థ. మానవుడిగా ప్టుినప్పుడు మానవత్వం అనేది లేకుంటే ఆ జన్మకు అర్ధం లేనట్లే. ఓ పశువు కూడా పుడుతుంది, అంతమవుతుంది. దానికి మానవునికి తేడా ఏమి? తేనెీగ పువ్వు నుంచి మకరందాన్ని పీల్చినట్లే మీ వయస్సు మీ అందాన్ని అంతం చేస్తుందని గుర్తుంచుకోండి. మకరందం అనగా మీలోని శక్తి, యవ్వనం. వాిని సద్వినియోగపర్చుకోండి. వృద్ధాప్యంలో మీరు ఆందోళన పడనవసరం ఉండదు. మానసిక దౌర్భల్యం అనేది దారిద్య్రానికి దారితీస్తుంది. మానసికంగా బలంగా మారి ఆ దరిద్య్రాన్ని తరిమివేయండి. ఇంకో విషయం తీవ్ర మానసిక వత్తిడి క్షణికావేశం ఆత్మహత్యకు ఉసిగొల్పుతాయి. ఉసిగొల్పే ఆ బలహీన క్షణాన్ని  ధైర్యంగా అడ్డుకుంటే ఆ ఘోర తప్పిదం నుంచి బయటపడవచ్చు. చాలా మంది యుక్త వయస్సులోనే దీని బారినపడ్డారు.  నేను విన్నవించేది ఒక్కటే- అది వాస్తవం. సమస్యలు కోి ఉంటే పరిష్కారాలు శతకోి ఉంాయి.  సలహాలు సంప్రదింపులు జరపండి. ఘోర తప్పిదం చేయకండి. పొరపాటు చేసి పశ్చాత్తాపపడితే లాభం లేదు. అలా జరగకుండా జాగ్రత్త వహిస్తే మంచిది. సమస్యలను సృష్టించుకోవడం అనేది మనం చేసిన తప్పులే. ఎవ్వరికీ బెదరక- ఎవ్వరికీ లొంగక మీ పనిని మీరు చేసుకుంటే చాలు. 
మరో విషయం చేయని నేరాన్ని అంగీకరించకండి. ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే ధైర్యంగా అడ్డుకోండి. ఇంతకు ముందు కూడా విన్నవించాను. ధైర్యవంతులదే ఈ ప్రపంచం. మనము అనుకువగా ఉంటే అందరూ మనకు అనుగుణంగానే ఉంారు.  ఆందోళన మనల్ని అంతం చేసే ముందు మనమే దాన్ని అంతం చేయాలి.  దానికొరకు మానసికంగా సన్నద్ధం కావాలి. అప్పుడే మనశ్శాంతి లభిస్తుంది. మన మనస్సును పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకుంటేనే మనశ్శాంతి లభిస్తుంది. కష్టనష్టాలకు మనము కృంగిపోవద్దు. కష్టాలు వస్తుాంయి- నష్టాలు కూడా వస్తుాంయి. వాిని మనము సవాలుగా స్వీకరించినప్పుడే మనము అనుకున్నది సాధించవచ్చు. 
ఇంకో విషయం గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అందులో మనం కూడా ఒకరమనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకో విషయం మన గురించి వస్తున్న అబద్ధపు వదంతులు విని స్పందించకూడదు. ఎందుకనగా- అవి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. మనం చెప్పేది నిజం కావచ్చు. వినేది కాకపోవచ్చు. వెంటనే స్పందించకూడదు. ఆచితూచి స్పందించాలి. అప్పుడు మనకు ఏరకమైన ఆటంకాలు ఎదురుకావు. శత్రుత్వం పెంచుకోవడమనేది చాలా సులభం. మిత్రుత్వాన్ని మెయిన్‌టైన్‌ చేయడం మాత్రం అంత సులభం కాదు. కాని మెయిన్‌టైన్‌ చేయడం మనపై ఆధారపడి ఉంది. 
ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో బెదిరింపులు చాలా సహజమయ్యాయి. ఆ బెదిరింపులకు భయపడి లొంగితే మన జీవిత నౌక గమ్యానికి చేరుకోలేదు. అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓ అలెగ్జాండర్‌ను తీసుకోండి. ఎంత ధైర్యవంతంగా ప్రపంచాన్ని జయించాడు. అందులో కొంత ధైర్యం మనం పుణికి పుచ్చుకుంటే చాలు. మన జీవితం విజయవంతం అయినట్లే. భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రానికి ముందే పోరాడి బలైపోయారు. గాంధీమహాత్ముడు అహింసా ద్వారా పోరాడి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బలైపోయారు. వీరందరూ స్వాతంత్య్రం కోసం పోరాడారు. మార్గాలు మాత్రం వేరు. వారి పోరాలను ఆదర్శవంతంగా తీసుకోండి. మనం కూడా మానవులమనే మాట మర్చిపోకండి. అతిగా ఆలోచించకూడదు. ఆలోచించినా ఏదైనా సాధించాలి. అదేకాని ఆందోళనతో కూడిన ఆలోచనలు మనోనిబ్బరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.  మానవునిగా ప్టుినప్పుడు ఏదో సాధించాలి. అనామకుడిగా అంతం కావద్దు. అది మన చేతిలోనే ఉన్నదనే సత్యాన్ని మరువవద్దు. 
కొందరి ఆందోళన విచిత్ర మైనది. రేపు ఏమవుతుందో, రేపి పూట ఎలా గడుస్తుందో? కాని ఒక విషయం ఆలోచించండి! విశాలమైన ఈ ప్రపంచంలో క్లోాది జీవరాశు లున్నాయి. అన్నింకి ఆహారం అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు. మనమైతే మానవులం- బెంగ పడవలసిన అవసరం ఏముంది? మన దారి మంచిదో-చెడుదో అది మన ఆత్మకు తెలుసు. తెలిసికూడా ఆత్మవంచన చేసుకోకండి. మన మనస్సును ఎంత అదుపులో ఉంచుకుంటే మనం అంత ముందుకు దూసుకెళ్ళవచ్చు. ఆత్రుత వద్దు. ఆత్మశాంతి సన్నగిల్లుతుంది. 


1 comment:

More Post's...