Monday, July 6, 2020

ఆత్మవిశ్వాసం కోల్పోరాదు.... భాగం-1



ఆత్మ విశ్వాసం లోపించి, మానసికంగా కృంగికృశించి త్రీవ ఒత్తిడితో దినదినం ప్రాణగండంగా బ్రతుకే భారంగా భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి నిరాశావాదిగా, ఆత్మహత్యే శరణ్యం అని భావించేవారు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమతో రకరకాల ఫోబియాలకు గురై ఏకాగ్రత కోల్పోయి నిద్రలేమితో బాధపడేవారికి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, వైద్యుడు, సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త, కవి, రచయిత అయిన యం.డి. అజ్మత్‌ఖాన్‌ వ్రాస
ఈ  వ్యాసం చదవండి చదివించండి.
మీలో అపార ప్రతిభలు దాగివున్నాయనే సత్యాన్ని మరవక కృషి పట్టుదల సహనం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. క్లోాది జీవరాశులలో మానవుని సర్వోత్తమ జీవిగా దేవుడు సృష్టించాడు. వెలకట్టలేని ఆయుధమైన మేధస్సు అనే వజ్రాయుధం ఇచ్చాడు. సుఖదుఖాలు కష్టనష్టాలు సాధారణమే సర్వసాధారణమే. కాలమే దానికి సమాధానం. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారమున్నది. భయమనే ఫోబియా జీవితాన్ని కకవికాలం చేస్తోంది. 
ధైర్యమనే ఆయుధంతో దాన్ని ఎలా జయించాలి? మనశ్శాంతితో ఎలా జీవించాలి? మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి? అభివృద్ధి ఎలా సాధించాలి? జీవితమనే నౌకతో తీర మనే గమ్యాన్ని ఎలా చేరాలి? ఇందులో కక్షుణ్ణంగా వివరించబడింది. అద్భుతమైన అందమైన అమూల్యమైన మీ జీవితానికి తగిన మూల్యం చెల్లించి ఆశావాదిగా రాబోవు తరాలకు ఆదర్శంగా మీ జీవన ప్రస్థానం విజయంతో ముగించండి.
..........
ప్టుిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. సృష్టిలోని మానవుని ప్రస్థానం అప్పుడే  సంపూర్ణమవుతుంది. జననమరణముల మధ్య ఏదైతే సమయముందో దానిని సద్వినియోగ పర్చుకోవాలి. ప్రతి మానవునిలో ఏదో ఒక ప్రతిభ దాగివుంది. ఆ ప్రతిభను కొందరు వెలికితీస్తారు. మరికొందరు అంధకారంలోనే ఉండిపోతారు. ఓ ప్రశ్న- ఎందుకిలా? 
ప్రతిభను బయికి తీసినవారు కొందరు నాయకులైతే! మరికొందరు వైజ్ఞానికులు, వ్యాపారవేత్తలు, తత్వవేత్తలు మరికొందరైతే మహాత్ములు....వీరందరూ మానవులే! 
వీరిని మనమొకసారి ఆదర్శంగా తీసుకోవాలి.ముందుగా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం, పట్టుదల, సహనం మానవుని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఎవరిలోనయితే ఆత్మవిశ్వాసం లోపించినదో అది ఆత్మహత్య వరకు దారితీస్తుంది. ఎందరో యువకులు క్షణికావేశంతో తమ ఆమూల్యమైన జీవితం భవిష్యత్తు అంతం చేసుకుంటున్నారు. నేను మీకు చెప్పేది ఒక్కటే- ప్రతి సమస్యకు పరిష్కారముంది. వైద్యరంగం, వాణిజ్యరంగం, వ్యవసాయరంగం, రాజకీయ రంగం. మరెన్నొ రంగాలలో ఎదిగినవారెందరో ఉన్నారు. వారందరూ తమతమ కృషి పట్టుదలతో ఎదిగినవారే! 
మనకు ఏ రంగంలో అయితే మక్కువ ఉన్నదో దానిపై స్పష్టత ఉన్నదో దానిని ఎంచుకొని అవిరామంగా కృషిచేస్తే అవలీలగా మనము గమ్యాన్ని చేరవచ్చు. ఉదాహరణకు - ఓ వాస్కోడిగామా నావికుడు ఎంత ధైర్యం, ఆత్మవిశ్వాసం పట్టుదలతో మన దేశానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్న కాలంలో ఏరకమైన ఆధునిక రవాణా వ్యవస్థ సాంకేతిక సదుపాయాలు లేవు. కానీ ఈ కాలంలో ప్రతీ ఒక్కీ మనకు అందుబాటులో ఉంది. మరి మనమెందుకు వాిని ఉపయోగించుకోవడం లేదు? ఎందుకనగా- అందరిలో కాదు- కొందరిలో అధైర్యం, ఆత్మవిశ్వాసం లోపించడం వలనే. జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. అధైర్యమనేది మానవుని అధఃపాతాళానికి న్టెివేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- ధైర్యమే ఆయుధం! ధైర్యమే ఐశ్వర్యం! ధైర్యమే సమస్తం! ధైర్యవంతులదే ఈ ప్రపంచం! అధైర్యమనేది మృత్యువుతో సమానం...!
దేహధారుడ్యం ఉంటే సరిపోదు, మానసికంగా, బలంగా మారినప్పుడే జీవితంలో విజయ శిఖరాలకు చేరుకోవచ్చు. మానసిక బలాన్ని మించిన బలం లేదు.  మానసిక ఆందోళన అనేది మనిషిని కృంగ దీస్తుంది. అనేక రోగాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు మనము ఆ ఆందోళనలను అంతం చేసుకునే మార్గాలు అన్వేషించాలి.చాలా మార్గాలున్నాయి. అనవసర ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఏ పని లేనప్పుడే? అందుకే మనకు నచ్చిన పనిలో నిమగ్నమైనప్పుడు అవి నెమ్మదిగా తగ్గిపోతాయి. మీరు ఆలోచించుకోండి. మీలో ఏదో శక్తి దాగివున్నది. దానిని వెలికితీయడానికి ప్రయత్నించండి. అనవసర భయభ్రాంతులకు గురికాకండి. మీరు జీవితంలో తప్పక విజయం సాధించగలరు. మీయొక్క ప్రతిభను ప్రపంచానికి చాటండి. వెలకట్టలేని మేధస్సు దేవుడు మీకిచ్చాడు. ఈ మేధస్సుతోనే సూపర్‌ కంప్యూటర్‌ కనుగొన్నది . మళ్ళీ మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీ మేధస్సునే వజ్రాయుధంగా ఉపయోగించుకోండి. పాజిీవ్‌ ఆలోచనలతోనే ముందుకు సాగండి. నెగిీవ్‌ ఆలోచనలు మీ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. 
మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. మనశ్శాంతి కరువైతే మానవుని జీవితం జీవచ్ఛంలా మారుతుంది. అందుకే మనశ్శాంతికి కరువైన కారణాలను వెదకండి. కారణాలు అనేకం ఉంాయి. ఏ సమస్యలతోనైతే మీ మనస్సు కకావికాలమైందో వాి పరిష్కారాలకు కృషి చేయండి. తప్పక మీ సమస్యలకు పరిష్కారముంటుంది. అది మీ చేతిలోనే ఉంది. మన అభివృద్ధి మనచేతుల్లోనే ఉంది. మన అభివృద్ధి కాకపోవడానికి ఫలానా మనిషి కారణం అని సాకులు చెప్పకండి- చూపకండి. నిర్భయంగా ముందుకు సాగితే గమ్యానికి దారులు తనంతటతానే దొరుకుతాయి. ఒక్కోసారి మన అధైర్యమే మన అభివృద్దికి ఆటంకం కలిగిస్తోంది.
అభివృద్ధి కలంతో సాధిస్తారా? లేక గళంతో సాధిస్తారా? అది మీయొక్క ప్రతిభతో ముడిపడి ఉంది. అది మీయొక్క అంతరాత్మను అడిగి తెలుసుకోండి. ఏదో ఒక ప్రతిభ మీలో తప్పక దాగివున్నది. మరి ఆలస్యమెందుకు? తీయండి ఆ ప్రతిభను బయటకు.. చాటండి ప్రపంచానికి... మనము శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండడానికి రాలేదు. జీవించిన ఆ కొద్దిరోజులనుకోండి- కొన్ని సంవత్సరాలను కోండి- తమకు తామేోం గుర్తుంచుకుంటే చాలు. క్లోాది జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఓ పశువు, ఓ పక్షి అవి కూడా ఇలా పుడుతున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. వాికి మనకు తేడా ఏమి? మనము మానవులం. దేవుడు వెలకట్టలేని అవయవాలు మనకిచ్చాడు. వెలకట్టలేని మేధస్సు ఇచ్చాడు. మనము తలచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ అపోహలలో వెళ్ళకండి. ఆ అపోహలు మిమ్మల్ని శాంతిగా జీవించనీయవనేది సత్యం. జీవితాన్ని పుణ్యమి వెన్నెల్లా మార్చుకునేది లేదా అమావాస్య చీకిలా మలుపుకునేది మనచేతిలోనే ఉన్నదనేది వాస్తవం. ఓ నలుగురు మెచ్చే పని చేయండి. సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం ఎవరికోసం ఆగదు. ఎందరో అతిరధ మహారధులు ఈ సమయ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వారి పేర్లు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఎందుకనగా- వారు సమయాన్ని సద్వినియోగపర్చు కున్నారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకున్నవారిదే విజయం! 
ఇంకో విషయం- అత్యాశ దురాశతో కోీశ్వరులు కావడానికి ప్రయత్నిస్తే అప్రతిష్టపాలవుతారు. అంచెలు అంచెలుగా ఎదుగుటకు ప్రయత్నించండి. మీ ప్రయత్నంలో నిజాయితి ఉంటే విజయం కూడా మీదే.  కాకపోతే మానసిక ఒత్తిడికి  గురికాకండి. మీ మనస్సును మీ ఆధీనంలో ఉంచుకొని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే అంతిమ విజయం మీదే!
మనకంటే ముందు ప్టుినవారు ఎందుకు చిరస్మరణీయులైనారు. వారు  సమాజానికి ఏదో కొంత చేసి వెళ్ళిపోయారు,.. వారు మానవులే కదా!మనం ఎందుకు చేయలేం? తప్పక చేయగలుగుతాం. ఏదైనా పని చేసే ముందు ఆ పని విజయవంతం చేయుటకు దృఢ సంకల్పం కావాలి. అప్పుడు మీరు విజేతలవుతారు. దృఢ సంకల్పం దానికితోడు కృషి కూడా చాలా అవసరం. సంకల్పం ఉండి కృషి లేకుంటే ఏమీ సాధించలేం.  ఈ సూర్యుడు మీకోసమే ఉదయిస్తున్నాడని మీ మనసులో అనుకుంటే చాలు. దూరాలను చేధించవచ్చు. మీముందే ఉదాహరణ ఉంది.
అంతరిక్షం నుంచి ఆ చంద్రుని వరకు ప్రయాణించినది ఆ మానవుడే కదా! ఎంత దృఢ సంకల్పం, ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ధైర్యముంటే ఆ దూరాలను చేధించాడు. అందులోని కొద్ది స్ఫూర్తి తీసుకుంటే చాలు. మీ జీవితం విజయం అయినట్లే. నేను గ్టిగా నమ్మి ఈ వాక్యాలు మీ ముందుంచుతున్నాను. ఎల్లప్పుడూ ఆశావాదిగానే జీవించాలి. నిరాశ వాదిగా జీవించకూడదు. అందరికీ మంచి రోజులనేవి వస్తాయి . మనకు కూడా వస్తాయనే ఆశతో కృషి చేస్తే, అది ఫలిస్తుంది. చరిత్ర పుాల్లో వెళ్తే ఇలాిం చాలా సందర్భాలు తారసపడతాయి. ఎంత ప్రశాంతంగా మనం ముందుకు సాగితే, అంతే శాంతంగా మనం విజయం వైపుకు పయనించవచ్చు. ఆపదలు వచ్చినప్పుడు ఆవేశపడకూడదు. ఆ ఆవేశం మన జీవితాన్ని అలజడికి గురైన సాగరంలా మారుస్తుందనేది వాస్తవం. శాంతికాములే విజయం సాధిస్తారనేది గుర్తుంచుకుంటే చాలు. కొందరు నియంతలు  కూడా విజయంసాధించారు. కానీ, ఉవ్వెత్తున లేచిన సముద్రపు కెరాలా్లగ వారి విజయాలు. మన మనసులో చిగురించిన ఆశలను ఆరనివ్వకూడదు. ఆ ఆశలను మన ఆశయాలుగా మలుచుకోవాలి. వాడిన పూలు మళ్ళీ వికసించవని గుర్తుంచుకుంటే చాలు. మీ జీవితం వికసించిన పూల మాదిరిగానే వుంటుందనేది వాస్తవం. ఇంకో విషయం గుర్తుంచుకోండి! ఓ సామాన్యుడు అణువైజ్ఞానికుడైనాడు. ఓ పేదవాడు అమెరికా అధ్యకక్షుడు అయ్యాడు. అందులో కొంత ప్రయత్నం చేస్తే చాలు మీ జీవితం ధన్యమైనట్లే. కొన్ని జఠిల సమస్యలు ఎదురవుతాయి. మనం కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే మన జీవిత నౌక నడి సాగరంలోనే మునిగిపోతుంది.


No comments:

Post a Comment

More Post's...