హలో ఫ్రెండ్స్ ..
చరిత్రలో చూస్తునే ఉన్నాం- ఎందరో కారణజన్ములను. వారు మనలాగే మానవులనే సంగతిని మర్చిపోకండి. మొద్దు నిద్ర పోకండి- అనామకులుగా మిగుల్తారు సుమా? ఓ జంతువుకు మనకు తేడా ఏమి? అది గ్రహించి దీక్షకు దిగండి. నిస్వార్ధంతో ముందుకు సాగితే భగవంతుని దీవెనలు మీ వెంటనే ఉంాయి.' సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా' అందరికి తెలిసిన విషయమే.
మరి ఆలస్యం ఎందుకు? సమయం మీకోసం ఆగదనే విషయం మరువకండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమి? మిగిలేది దుఃఖమే తప్ప ఏమీ లేదు. మన ఆలోచనలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆలోచనలు మంచిగా ఉంటే- దానికి తోడు నిర్విరామ కృషి ఉంటే ఎందుకు అభివృద్ధి చెందరు. తప్పక చెందుతారు. మళ్ళీ నిద్రలేవండి. ముందడుగు వేయండి. సాధించేది చాలా ఉంది. సాధన చేయండి. మేల్కోండి.
సూర్యోదయంతో మీ ప్రయాణం మొదలుపెట్టండి. అస్తమించేవరకు శ్రమించండి. విజయం ద్వారాలు తెరచుకొని మీకోసం వేచి ఉంాయని ప్రగాఢంగా విశ్వసించి రాస్తున్నాను. తదుపరి విజయం మీదే. లేవండి, మేల్కోండి. రాజ్యాధికారంలో మీరు కూడా ఓ భాగస్వామి కావచ్చు. మనది ప్రజాస్వామ్యం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. మీరు కూడా అందులో ఒక్కరనేది గుర్తుంచుకోండి. నిస్వార్ధంగా ముందుకు సాగండి. ధైర్యంతో నేడు కూడా మీదే, రేపు కూడా మీదే. తొందరగా మేల్కోండి చాల తక్కువ సమయం ఉంది మీకోసం. జీవించేది కొద్దికాలం మాత్రమే ఈ భూమిపై.
మరి ఆలస్యం ఎందుకు? ఎందరో మహనీయులు మహాత్ములు తాము అనుకున్నది సాధించారు? మీరు అందులో కొంతైనా సాధించగలరు కదా? మీరు మానవులు కాదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. మీలో ఏదో ప్రతిభ దాగి ఉన్నదని. వెలికి తీయండి. పేదరికాన్ని తరిమికొట్టండి.
మనము అందలం ఎక్కేటప్పుడు అడుగడుగున ఆటంకాలు వస్తాయి. అధైర్య పడకండి. ముందే చెప్పాను- అధైర్యమనేది మృతువుతో సమానం.
రవాణా వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిన ఈరోజుల్లో ప్రపంచం ఓ కుగ్రామమైంది. చాలా అవకాశాలున్నాయి అభివృద్ధి చెందడానికి.
ప్రపంచమే కుగ్రామమైన ఈ రోజుల్లో అభివృద్ధి చెందడం చాలా సులభం. ఎక్కడైనా ఏ రంగమైనా వెళ్ళండి వెదకండి- అవకాశాలు జారవిడుచుకోకండి- లేదా తామే అవకాశాలు సృష్టించుకోండి. మీలో ఉన్న ప్రతిభను ఉపయోగించుకొని. ప్రపంచంలో అసాధ్యమనేది ఏదీ లేదని మరొకసారి నేను నొక్కి వక్కాణిస్తున్నాను.
ఎన్నో వనరులున్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఫలానా మనిషి ద్వారా నా పరిస్థితి ఇలా దిగజారిందని సాకులు చూపకండి. మీలో చాలా ప్రతిభ ఉంది. అపార మేధస్సు దేవుడు ఇచ్చాడు. ఎవ్వరూ మీకు ఏమీ చేయలేరు. ఎవరో ఏ హాని తలపెడతారని అపోహాలకు వెళ్ళకండి.
భయాన్ని వీడండి- మీరు ఎవరితోనైతే భయపడు తున్నారో వాడు కూడా మ్టిలో కలిసేవాడే కదా? మరి భయమెందుకు? బ్రతికినన్నాళ్ళు హుందాగా దర్జాగా బ్రతకండి. భయపడాల్సిన అక్కర్లేదు. సృష్టికర్తకు భయపడండి. మ్టిలో కలిసే సాి మానవుడికి కాదు. ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. మరి మీరు ఎక్కడున్నారు? వెనుకంజ ఎందుకు వేస్తున్నారు. ముందంజ వేయండి. చాలా అవకాశాలు మీకోసం వేచి చూస్తున్నాయి. అహంకారం అసలే వద్దు. అది మీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
No comments:
Post a Comment