అదనపు డీజీ, ట్రాఫిక్ పోలీస్ అదనపు ఇంచార్జి కమి షనర్(హైదరాబాద్) అనిల్ కుమార్ చార్మినార్ వద్ద కోవిడ్ 19 వాక్సినేషన్ చైతన్య వ్యాన్కు జెండా ఊపి ఆరంభించారు. ఈ వేడుకకు డీసీపీ గజరాజ్ రావు (భోపాల్ ఐ పి ఎస్, ఎస్జెడ్), కె . బాబు రావు, ఎస్పి, (ఆ ప్ర) , బి ఆర్ నాయక్, ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమి షనర్ కూడా హాజరయ్యారు. వాక్సినేషన్ గురించి ప్రజలలో వీలైనంత త్వరగా చైతన్యం కలిగించేందుకు మెహర్ ఆర్గనైజేషన్స భ్యులు అఫ్ఫాన్ ఖా ద్రి , ఎండి ఫరూఖ్, ఎం డి లతీఫ్, హస్సన్ ఖాద్రి, జోహెబ్ అహ్మద్, ఎం డి సోహైల్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.