అందరికీ తెలిసి, కొందరికి తెలియని విషయం ఏమిటంటే.... ఇది పెళ్ళిళ్ళ సీజన్. రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. వృత్తి రీత్యా నేను వెడ్డింగ్ కార్డు డిజైనర్ కాబట్టి సీజన్లో ఎడతెరిపి లేకుండా వర్క్ నడుస్తుంది. పని వత్తిడి వల్ల మానసికంగా కాస్త విశ్రాంతి కావాలనే కోరిక ఎక్కడో మూల పుట్టింది.
ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అయితే, ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్ సాబ్, ఇర్షాద్, ఘోరి ఖాన్ ని కూడా వెంట తీసుకెళ్ళాను.
నలుగురం 3 రోజుల టూర్‌ను సెట్ చేసుకొని డిసెంబర్ 9,10,11 లలో అక్కడ చూడవలసిన ప్రదేశాలను, నలమల అడవి అందాలను ఆస్వాదించవచ్చునని ఆశతో ఎంతో ఉల్లాసంగా, హాయిగా ఈ మూడు రోజులు మా పనులను పక్కనబెట్టి మా ఊహాలలో తెలిపోయాము.
ఆ మూడు రోజుల ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరూ చూడండి. ఆఁ... గతంలో కంభం చెరువు గురించి మీకు తెలియజేసానుకుంటా... ఆ అక్కడకు కూడా వెళ్ళాము. చూడండి. - కరీంఖాన్, హైదరాబాద్.
English Translation:
Nalamala Tour
What everyone knows, what some people don't know is that .... it's wedding season. Weddings are in full swing in the two Telugu states. Professionally I am a wedding card designer so the season runs the workshop without a hitch.
|
కంభం cheruvu |
The urge to relax mentally due to work pressure has taken root somewhere. At this point my niece got married. I also had to do the card design myself. |
కంభం చేరువు బోర్డు |
However, with the desire to go to this wedding I went on doing their chores a bit faster that day. Our niece's wedding was in the town of Giddaluru in the Nallamala forest, so I took my well - wishers, friends Moin Saab, Irshad and Ghori Khan with me to the wedding.
The four of us set out on a 3 day tour and in December 9,10,11 we set aside our work for these three days in the hope that we could see the places to see and enjoy the beauty of the Nalamala forest.
I will share those three days photos with you.
See for yourself. Um ...
I just wanted to let you know about the Cumbum pond in the past ...
we went there too. See.